తెలుగు సినీ పరిశ్రమలోనే తిరుగులేని నిర్మాత, పంపిణీదారుడు, అందరి దగ్గరా మంచి మార్కుల్లో ఉండే వ్యక్తీ, దిల్ రాజు... శ్రీ వెంకటేశ్వరా ఫిల్మ్స్ సంస్థపై, తోటి నిర్మాతలు, లక్ష్మణ్, శిరీష్ లతో కలిసి, ఎన్నో విజయవంతమైన చిత్రాలు, కుటుంబం మొత్తానికి వినోదాన్ని పంచె చిత్రాలు, పంపిణీదారులకు కాసుల వర్షం కురిపించే చిత్రాలు నిర్మించిన ఘనత, రాజు గారిది. ఈ మధ్య కాలంలో, అటు నిర్మాతగా, ఇటు పంపినీదారుడిగా కుడా, చాల వరకు తన చిత్రాలు ఆడక, నష్టాలని
చవిచూడవలసి వచ్చింది రాజు గారికి. అయినా, ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా, సంక్రాంతి బరిలో దూసుకొస్తున్నారు.
రాజు గారు... తెలుగు సినీ పరిశ్రమలోనే, దాదాపు 25 ఏళ్ళ తరువాత, అసలు సిసలైన మల్టి స్టారర్ సినిమా, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం, మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, స్టార్డం ఉన్న, వెంకటేష్ ఇంకా మహేష్ బాబు తో తీసి, సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధం చేసారు రాజు... ఈ మధ్యనే విడుదల అయిన ఈ చిత్రం ఆడియో ఘన విజయాన్ని సాధించడమే కాకుండా చిత్రం మొదలయిన దగ్గరినుండి ఈ రోజు వరకు, చిత్ర విజయం పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి..కుటుంబ కదా చిత్రం కావడం వల్ల, 'సీతమ్మ...' అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తుంది అనే నమ్మకం, ఫిలిం నగర్ లో బలంగా నాటుకుంది.
మరో వైపు, సంక్రాంతి బరిలోనే సత్తా చాటడానికి విడుదలకు సిద్ధం అయిన, పవర్ ఫుల్ చిత్రం, చరణ్ 'నాయక్'... వి.వి. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో కూడా ఘన విజయం సాధించడమే కాకుండా, చిత్రం పక్కా హిట్ కొడుతుంది అనే టాక్ ని సంపాదించుకుంది. ఒక విధంగా ఈ చిత్రం, 'సీతమ్మ...' ఒక దానికి ఇంకొకటి పోటీ అయితే ఈ పోటిలో నెగ్గేది మాత్రం రాజు గారే. అటు 'సీతమ్మ...' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడమే కాక, ఇటు 'నాయక్' చిత్రం నైజాం పంపిణీ హక్కులని సొంతం చేసుకున్నారు, దిల్ రాజు.సో, ఈ సంక్రాంతి ఎలాగైనా విజయం, కాసులు తన ఖాతాలో వేసుకునే ప్లాన్ పకడ్బందీగా తయారు చేసుకున్నారు నిర్మాత, దిల్ రాజు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more