'నాయక్' ఆడియో వేడుకలో, పవన్ కళ్యాణ్ వైపు నిలిచిన చెర్రీ 'ఈ రోజు నాన్న గారు ఇక్కడలేరు... డిల్లీలో ఉన్నారు... అత్యితేనేం, ఆయన లోటు భర్తీ చెయ్యడానికి, పవన్ బాబాయి ఆయన స్థానంలో నాకు తోడుగా నిలిచారు. 'నాయక్' చిత్రం చూసి సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాడు, పవన్ బాబాయి... పోయిన సారి 'రచ్చ' సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో, మా కుటుంబం అంతా ఉండి, పవన్ బాబాయి లేకపోతె, ఎవరికి తోచినట్లు వాళ్ళు కథలు అల్లి, మా కుటుంబం మధ్య వైరం ఏర్పడిందని ప్రచురించారు.
నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా రాయడం తప్పు అని చెప్పడానికే, ఇప్పుడు నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. బాబాయి కాని మా కుటుంబం లో ఇంకెవరైనా కాని, ఇటు వంటి వేడుకలకి రాలేకపోవడానికి, వంద కారణాలు ఉంటాయి. అసలు ఈ విషయం తలెత్తినప్పుడే నేను మాట్లాడవలసింది, కాని బాబాయ్ నన్ను వద్దని వారించాడు, 'మన అనుబంధం ఎటువంటిదో మనకు తెలుసు, అందరికి చెప్పనక్కరలేదు,వదిలేయి' అని... కాని, 'మెగా ఫ్యాన్స్ కి అసలు నిజం తెలియాలి కాబట్టి నేను ఈ రోజు మాట్లాడుతున్నాను.
ఇక బాబాయి కి నాన్న కి ఉన్న అనుబంధం, ఏంతో గొప్పది... నాన్నకు ఎవరైనా అడ్డుతగాలాలని, హాని చెయ్యాలని చూస్తె, బాబాయి నాన్న ముందు ఉండి 'ముందు నాతొ మాట్లాడు' అని నిలుస్తాడు... ఇవాళ బాబాయిని ఎవరైనా ఏమన్నా అంటే 'ముందు నాతొ మాట్లాడు' అని నేను అడ్డుగా నిలుస్తాను', ఈ మాటలు, ఈ మధ్యనే జరిగిన 'నాయక్' ఆడియో రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ అన్నవి.మెగా అభిమానులకు అమృతంలా తోచిన ఈ మాటలు నిజంగానే ఆలోచింపచేసాయి... అయితే, ఇంకొంతమంది వాదన ఇంకొకలా ఉంది... 'ఇన్నాళ్ళూ, సైలెంట్ గా ఉండి, కారణం ఏదైనా, ఇప్పుడు సడెన్ గా ఇలా 'మేమంతా ఒకటి' అని ఎందుకు అంటున్నారు, 'మెగా' కుటుంబం వారు? అల చూసుకుంటే, పవర్ స్టార్ 'పంజా' ఆడియో వేడుకలో కూడా, 'మెగా', 'అల్లు' కుటుంబం నుండి ఒక్కరు కూడా వచ్చినట్టు లేరు, మరి అప్పటి సంగంటి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు... మరి యిది అయితే ఏదో ఊహించిన విషయం కాదు... చూసినదే కదా ?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more