కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏలూరు ఎంపీ కావూరు సాంబశివ రావు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పినట్లేనా ? ఇప్పటి వరకు ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పై, ఆ పార్టీ సీనియర్ల పై చూపెట్టే వివక్ష వైఖరి పై అసంత్రుప్తి చెందిన ఆయన తన రాజీనామాను స్పీకర్ మీరా కుమార్ కి పంపించారు . ఈయన రాజీనామా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు, ప్రధాన మంత్రి కూడా ఆయన్ను బుజ్జగించడానికి ప్రయత్నించారు . అయినా కావూరికి కాంగ్రెస్ పెద్దల పై, పార్టీ వైఖరి పై కోపం తగ్గలేదు. ఇక ఈయన పార్లమెంటు సభ్యత్వానికి కచ్చితమైన ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చారని , స్పీకర్ ఎప్పుడైనా ఆ రాజీనామాను పరిశీలనకు తీసుకుని ఆమోదించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇంత సీనియర్ నాయకుడు అయిన కావూరిని సోనియా గాంధీ కనీసం పిలిచి మాట్లాడలేదు. దీంతో మరింత అసహనానికి గురైన ఆయన ఇక పార్టీని వీడటమే కరెక్ట్ అని భావించారో లేక ఒకసారి తేడా వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో మనుగడ కష్టం అని భావించారో, ఏమో కాని కావూరి సాంబశివరావు తెగతెంపులకే సిద్దపడ్డారని రాజకీయ వర్గాల భోగట్టా.
ఒకవేళ కావూరి కాంగ్రెస్ ని వీడితే.... ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం . ఒక వేళ ఆయన వైయస్సార్ కాంగ్రెస్ లో చేరితే.... ఏలూరు నుండి పోటీ చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కావూరి వైయస్సార్ పార్టీలో చేరితే...ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందని కూడా అంటున్నారు. ఇక ఆయనతో పాటు ఆయన మనవడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ చేరుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి . మరి ఏం జరుగుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more