హీరోయిన్లు సాహసాలు చేయడం హాలీవుడ్‌లో పరిపాటి. ఇండియన్ సినిమా విషయానికొస్తే... అడపాదడపా కొందరు హీరోయిన్లు ఫైట్లూ గట్రా చేసేసి ‘మేమూ ఏం తక్కువ కాదు’ అని నిరూపించుకున్నారు. అయితే... ఈ మధ్య బాలీవుడ్‌లో మాత్రం కథానాయికల సాహసాలు కాస్త ఎక్కువయ్యాయి. ఈ ట్రెండ్‌ని వేగవంతం చేసిన ఘనత మాత్రం కత్రినాకైఫ్‌దే. ఆ మధ్య కొన్ని సినిమాల్లో ధైర్యంగా బైక్ రైడింగ్‌లు చేసేసి ఆడియన్స్‌ని షాక్‌కు గురి చేశారు కైట్స్.ఆ తర్వాత బిపాసాబసు, అనుష్కశర్మ, నర్గీస్ ఫక్రీ లాంటి తారలు కూడా కత్రినాను అనుసరించి సక్సెస్ అయ్యారు కూడా. ఇప్పుడు వారి లిస్ట్‌లోకి అనిల్‌కపూర్ ముద్దుల తనయ సోనమ్‌కపూర్ కూడా చేరబోతున్నారు. ‘బాగ్ మిల్కా బాగ్’ అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నారు సోనమ్. పాత్రోచితంగా ఆ సినిమాలో ఆమె బైక్ రైడింగ్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంది. పైగా దర్శకుడు ఓం ప్రకాష్ ఆ సన్నివేశాలను రియలిస్టిక్‌గా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని సోనమ్‌కు ఆయన విశదపరిస్తే... చిరునవ్వుతోనే సోనమ్ అంగీకారం తెలిపారట.అసలు విషయం ఏంటంటే... సోనమ్‌కు బైక్ రైడింగ్ రాదు. గతంలో ‘ప్లేయర్స్’ సినిమా కోసం ఆమె బైక్ రైడింగ్ చేసినా... అది చాలా చిన్న సన్నివేశం. దాంతో డూప్‌ని పెట్టి ఎలాగోలా మేనేజ్ చేసేశారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం దర్శకుడు ‘నో’ డూప్ అనేశాడట. ఆయినా ఈ ముద్దుగుమ్మ వెనకంజ వేయకుండా ‘ఓకే’ చెప్పేశారు. ఓ ట్రైనీని పెట్టుకొని రైడింగ్‌లో కఠినమైన మెళకువలు నేర్చుకుంటున్నారట సోనమ్. కొసమెరుపు ఏంటంటే.. తండ్రి అనిల్‌కపూర్ కూడా సోనమ్‌కు బైక్ రైడింగ్ పాఠాలు నేర్పుతున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more