రాష్ట్రంలో నెలకున్న ప్రతికూల పరిస్థితులను తనకు సానుకూలంగా మార్చుకుంటే నల్లారి కిరణ్ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. వినూత్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలు విసృ్తతంగా ప్రచారం ఆయ్యే అవిధంగా ముఖ్యమంత్రి కిరణ్ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటునే ఉన్నారు. స్వపక్షంలో ఆశించిన స్థాయిలో సహకారం లభించనప్పటికీ, తనదైన శైలిలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూనే ఉన్నారు. ఇందిరమ్మ బాట పేరుతో తూర్పుగోదావరి జిల్లాల్లో చేపట్టిన ప్రభుత్వ మూడు రోజుల కార్యక్రమం విజయవంతం కావడంతో వచ్చే ఆరు నెలలు కూడా ప్రజల్లో తిరగడం ద్వారా ఇటు ప్రభుత్వ ఇమేజ్‌ను పెంచడంతోపాటు ఆటు పార్టీ ప్రతిష్టకు క్షేత్ర స్థాయిలో బలమైన పునాదులు వేయాలని కిరణ్ భావిస్తున్నారు.నేటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లా ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన నున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ బాటలో భాగంగా ముఖ్యమంత్రి పర్యటిస్తున్న జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీలు చేయడం తోపాటు, ఆ జిల్లా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేయడం గమనార్హం. దీనిలో భాగంగా ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో ముగింపు రోజు చేపడుతున్న అభివృద్ధి సమీక్షా సమావేశాలపై పార్టీలకు అతీతంగా అభినందనలు వస్తున్నట్లు సీఎమ్‌ఓ వర్గాలు చెబుతున్నాయి.
ఇందిరమ్మ బాటలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న మూడు రోజులు కూడా పేదలు, మహిళలు, స్వయం సహాయక బృందాలు, విద్యారు ్థలు, వెనుకబడిన గిరిజన ప్రాంతాల ప్రజలతో సీఎం స్థానిక సమస్యలపై ముఖాముఖి నిర్వహించడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసు కోవడం, అక్కడికక్కడే వాటిని పరిష్కరించడానికి ఆశక్తిచూపడం వంటి చర్యలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇదే కారణంతో కిరణ్‌తో విభేదించే కీలక నేతలు కూడా అయిష్టంగానే ఆయనతోపాటు ఇందిరమ్మ బాటలో పాల్గొంటున్నట్లు సీఎం సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా కిరణ్ చేపట్టిన ఇందిరమ్మ బాట కార్యక్రమంపై మరింత ఆశక్తిచూపినట్లు తాజా పరిణమాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా ఇందిరమ్మ బాటతో సీఎం కిరణ్ అటు అధిష్టానం, ఇటు పార్టీ శ్రేణులను ఆకట్టుకున్నట్లు తెలుస్తున్నది. దీనికి తోడు సమాచార శాఖ అధికారులు కూడా సీఎం ఇందిరమ్మ బాట కార్యక్రమల్లో ప్రత్యక్షంగా పాల్గొనడంతోపాటు, ప్రచార ప్రక్రియను కమిషనరే స్వయంగా పర్యవేక్షించడం ప్రభుత్వానికి మీడియాలో విసృ్తత ప్రచారం రావడానికి దోహాద పడుతున్నది.
అదే విధంగా ప్రభుత్వ పథకాల అమలుతీరుపై స్థానిక ప్రజలను కమిషనరే అడిగి తెలుసుకోవడం కూడా సత్ఫలితాలు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ప్రజలు ఎదుర్కొంటున్న క్షేత్ర స్థాయి సమస్యలు, పలు ప్రభుత్వ శాఖల పనితీరుపై స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను ఈ సందర్భంగా అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు తెలిసింది. ఈ నివేదికలపైనా సీఎం ఎంతో ఆశక్తిచూపుతున్నట్లు సీఎమ్‌ఓ అధికారులు చెబుతున్నారు. నిఘా వర్గాల నివేదికలను కూడా ఎప్పకప్పుడు సీఎం అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. ఆనివేదికలు సీఎంకు సానుకూలంగా ఉండడంతో వచ్చే ఆరు నెలలకు తగిన విధంగా ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని సీఎమ్‌ఓ అధికారులు ఖరారు చేశారు.
ఇదిగో సీఎం బిజీబిజీ షెడ్యూల్....
1. సెప్టెంబర్ ..... కర్నూలు, మహాబూబ్ నగర్, కృష్ణా
2. అక్టోబర్ ...... మెదక్, విశాఖ, ప్రకాశం
3. నవంబర్..... రంగారెడ్డి, చిత్తూరు, అనంతపురం
4. డిసెంబర్.... నెల్లూరు, నల్గొండ, నిజామాబాద్
5. జనవరి 2013..... విజయనగరం, గుంటూరు, కరీంనగర్
6. ఫిబ్రవరి-2013.... కడప, వరంగల్, ఆదిలాబాద్
ప్రతి నెలా హైదరాబాద్‌లోని రెండు నియోజక వర్గాల్లో ఇందిరమ్మ బాట
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more