‘‘ ఏ నిమిషానాకి ఏమీ జరుగునో ... ఎవరు ఊహించేదరు? ’’ అనే పాట గుర్తుకు వస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులె చోటు చేసుకోబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ..ఆంద్రప్రదేశ్ పైనే మనసు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడి రాజకీయాలతో ప్రతి రోజు అధిష్టానం జెండ్ బామ్ రాసుకుంటుందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఆంద్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నాయకుల రాజకీయం .. మరే ఇతర రాష్ట్ర నాయకుల్లో లేదని కేంద్రం అంటుందట. మన రాజకీయ నాయకులతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బొప్పికట్టకముందే.. నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అందులో బాగాంగా అధిష్టానం కేరళ ఆయుర్వేధ డాక్టర్ తో రాష్ట్రంలో సర్వే చేయించి .. ఒక రిపోర్టు తయారు చేసినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. కేరళ వైద్యుడు .. రెండు, మూడు సార్లు రాష్ట్రంలో పర్యటణ చేసి.. రాజకీయ నాయకుల మనసులు తెలుసుకొని .. అమ్మకు రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ రిపోర్టు ప్రకారం .. ఇప్పుడు ..రాష్ట్రంలో రెండు కీలకమైన పదవుల్లో మార్పులు జరగటం ఖాయమాని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నెం.1 పీసీసీ పదవి.. కాపులకు, నెం. 2 రాష్ట్ర సీఎం పదవి .. తెలంగాణ రెడ్డికి ఇవ్వటం ఖాయమాని అధిష్టానం తెల్చినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు.
మొదట పీసీసీ పదవి ..కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చేందుకు అధిష్టానం సిద్దమైందట. కానీ చివరి నిమిషాంలో కేరళ వైద్యుడు సలహా మేరకు .. కన్నాకు పీసీసీ పదవి ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ లో గ్రూపు రాజకీయాలు వస్తాయి. దానివలన పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని కేంద్రం భావించి.. పీసీసీ పదవి కాపులకే ఉంటే విధంగా .. కేంద్ర మంత్రి పల్లం రాజు పేరు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. పల్లం రాజు పీసీసీగా ఉంటే .. అటు రాష్ట్ర నాయకులు , ఇటు పార్టీకి అనుకూలంగా ఉంటాడని భావిస్తుంది. అంతేకాకుండా పల్లం రాజు వల్ల ఎవరి నష్టం ఉండదని కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయం. పల్లం రాజు వలన పార్టీ బలపడుతుందని అంటున్నారు. పల్లం రాజుకు రాహుల్ గాంధీ, ఢిల్లీ నాయకులతో , సోనియాగాంధీ మంచి సంబంధాలు ఉండటం వలన రాష్ట్ర నాయకులకు కొంచెం భయం ఉంటుందని కేంద్రం భావిస్తుందట. పీసీసీ పదవి బలమైన వ్యక్తి దొరినట్లేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
నెం.2 :: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి. అధిష్టానం సీఎం పదవితో చరిత్రకమైన సమస్యకు శ్రీకారం చుట్టింది. ఇప్పుటి వరకు రాష్ట్రం రాజకీయాల్లో పెను మార్పులు రావటానికి కారణమైన సమస్య ఒక్కటే .. ఆ పెను సమస్యను చెక్ పెట్టేందుకు అధిష్టానం బాగా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. సీఎం పదవిని ..తెలంగాణ రెడ్డికి ఇవ్వాలని కేంద్రం చూస్తుందట. అదీ కూడా ఎలాంటి సమస్యనైన సమర్థించుకోగల నాయకుడిని చూసినట్లు తెలుస్తోంది. ఆయన పంచాయితీ శాఖ మంత్రి కె. జానా రెడ్డి పేరు ను తెరపైకి తెచ్చినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. జానా రెడ్డి ముఖ్యమంత్రి చేయటం వెనుక ప్రత్యేక తెలంగాణ సమస్య తీరిపోతుందని, అలాగే రెడ్డి సామాజిక వర్గం నాయకులు కూడా మన రెడ్డే అనే ఫిలింగ్ వారిలో ఉంటుందనే విధంగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఈ రెండు మార్పులతో రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కారం అవుతాయాని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. కేంద్ర మంత్రి కూడా జైపాల్ రెడ్డి కూడా ఈ ప్రతిపాధనకు సమ్మతి తెలిపినట్లు .. ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అరచేతిలో ఏం జరుగుతుందో వేచిచూద్దాం......
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more