రైతులకు, పల్లె ప్రజలకు హైకోర్టు ఎవరు ఊహించని వరం ప్రసాదించింది. రాష్ట్ర ప్రజల బాధలను హైకోర్టు బాగా అర్థం చేసుకుందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. రాష్ట్రంలో రైతులు, ప్రజలు పడుతున్న కష్టాలు చెప్పలంటే వర్ణనాతీతం ఉంటాయి. అలాంటి రాష్ట్ర ప్రజల బాదలకు ఒక విముక్తి హైకోర్టు కలిగించిందని సామాన్య ప్రజలు ఆనందంతో అంటున్నారు. ఈ రోజుల్లో ఓవైపు కబ్జాలు! మరోవైపు ప్రభుత్వ భూ సేకరణలు! ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తాలు! ఇంకోవైపు, రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారుతున్న భూములు! వెరసి, ఒకప్పుడు భూమికి కొరత లేని గ్రామాల్లో ఇప్పుడు, శ్మశానాలకూ చోటు లేదు! చనిపోయిన వారిని ఖననం చేయడానికి కూడా ప్రదేశం లేదు! ఇక, పశువుల మేత, సామాజిక అడవుల పెంపకం వంటి సామాజిక అవసరాల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది! ఈ నేపథ్యంలోనే, రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేసేవిధంగా చెప్పటం చాలా విశేషమాని రాష్ట్ర ప్రజా సంఘాలు అంటున్నాయి .రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వినియోగంలో ఉన్న భూమిలో ఒక శాతం లేదా పది ఎకరాల్లో ఏది ఎక్కువైతే అది ప్రజల అవసరాల కోసం ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏదేని గ్రామంలో పశువుల మేత, సామాజిక అడవుల పెంపకం, గ్రామాల ఉమ్మడి అవసరాల కోసం కనీసం పది ఎకరాల భూమి కూడా లేకపోతే ఆ మేరకు అసైన్డ్ భూములనైనా సేకరించి రిజర్వు చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.
చిత్తూరు జిల్లా సోడం మండలంలోని చంకవారిపల్లెలో 11.20 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ సీహెచ్ వీరయ్య అనే రైతు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.నర్సింహారెడ్డి ఈ ఆదేశాలు జారీ చేశారు. చంకవారిపల్లె సర్వే నెం.31లోని 11.20 ఎకరాల భూమిని తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎవరికీ కేటాయించవద్దని జిల్లా కలెక్టర్, తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ ప్రజల ఉమ్మడి అవసరాలు, పశువుల మేత, సామాజిక అడవుల పెంపకం తదితరాలకు కనీసం పది ఎకరాలకు తగ్గకుండా భూమిని రిజర్వు చేయాలని ఆదేశించారు.ఇది పరీవాహక ప్రాంతాలు, నదీ తీరాలు, శ్మశాన వాటికలకు అదనంగా ఉండాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ భూమి కబ్జాకు గురి కాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుని పటిష్ఠమైన కంచెను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల్లోని 1128 మండలాల్లో సుమారు 28 వేలకుపైగా గ్రామాలకు మేలు కలుగనుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more