రాష్ట్ర కాంగ్రెస్ సమూల ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోందా? ఆ మేరకు అధిష్ఠానం ముహుర్తం పెట్టిందా? నగరంలో ఒక శుభకార్యానికి వచ్చిన వయలార్ రవి వచ్చేవారం గుడ్ న్యూస్ వింటారన్న వ్యాఖ్యలు మార్పు సంకేతాలా? .. రవి రాకతో రాష్ట్ర కాంగ్రెస్‌లో పెరిగిన కాక ఇది. సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 50వ వివాహ వార్షికోత్సవానికి హాజరయిన రవి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ, ఆసక్తి కలిగి స్తున్నాయి. వచ్చే వారం గుడ్‌న్యూస్ వింటారని కారెక్కబోతూ రవి చేసిన వ్యాఖ్యలు నాయకత్వ మార్పునకు సంకేతంగానే భావించక తప్పదని కాం గ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తాను రాష్ట్ర పార్టీ ఇన్చార్జిని కాదని, నాయ కత్వ మార్పుపై చర్చించేందుకు ఇది వేదిక కాదని వ్యాఖ్యానించిన రవి.. ఇన్‌చార్జి కానప్పుడు, తనకు ఇక్కడి విషయాలేవీ తెలియనప్పుడు, గుడ్‌న్యూస్ చెబుతానని ఎలా అంటారని కాంగ్రెస్ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా నాయకత్వ మార్పునకు సంబంధించిన అంశమే రవి చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్నాయని వాదిస్తున్నారు. తాను మళ్లీ వచ్చే వారం వస్తానని సమన్వయం కుదర్చవలసిన అవసరం ఉందన్నారు. అవసరమైతే వారికి ఢిల్లీకి పిలిపిస్తానన్నారు.అయితే, రవి చాలాకాలం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలను పరిశీలించిన తర్వాత ఒక నివేదిక ఇచ్చారు. అది కిరణ్‌కు వ్యతిరేకంగానే ఉందని, ఆయన రాష్ట్ర నేతల మధ్య సమన్వయం కుదర్చడంలో విఫలమవడంతో పాటు, తానుగా ఎవరితోనూ సమన్వయం కుదుర్చుకోవడం లేదని తన నివేదికలో పేర్కొన్నట్లు సీనియర్లు చెబుతున్నారు. పైగా, కిరణ్ సీఎంగా కొనసాగినంత కాలం జగన్ పార్టీ అభివృద్ధి చెందుతుందని తన నివేదికలో ఇచ్చారని రవికి సన్నిహితంగా వ్యవహరించే ఓ సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ వెల్లడించారు. కిరణ్ కేవలం ఒక వర్గాన్నే ప్రోత్సహిస్తున్నారని, ఆ వర్గమంతా ఇప్పటికే జగన్‌కు సామాజిక ఓటు బ్యాంకుగా మారిందని, ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన వ్యక్తికి సారధ్యం ఇవ్వాలని రవి సూచించినట్లు ఆ నేత చెప్పారు.
గులాంనబీ ఆజాద్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో నాన్ సీరియస్‌గా ఉన్నారని, పైగా ఆయనకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదని, గతంలో వైఎస్ ఉన్నప్పుడు ఇన్చార్జిగా ఉన్నప్పుడు అందరినీ సమన్వయం చేసినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవితవ్యాన్ని అంచనా, అవగాహన చేసుకోలేకపోతున్నారని పలువురు సీనియర్లు రవికి ఫిర్యాదు చేశారు. అదీగాకుండా ఆజాద్ ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, దిగ్విజయ్ సింగ్ ద్వారా లాబీయింగ్ చేస్తున్నారంటూ ఒక రాజ్యసభ సభ్యుడు స్వయంగా రవి దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇదిలాఉండగా.. గతంలో రాష్ట్రానికి వచ్చిన వయలార్ రవి... రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని ఖరాఖండీగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం రవి నాయకత్వ మార్పుపై మీడియా ప్రశ్నిస్తే, తిరిగి అదే మాట ప్రస్తావించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పైగా తాను ఈ రాష్ట్ర ఇన్చార్జిని కాదని, కేరళకు చెందిన తనకు ముఖ్యమంత్రి ఇవ్వరని హాస్యమాడటం ప్రస్తావనార్హం. దీన్నిబట్టి.. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఖాయమన్న విషయం రవి తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారని విశ్లేషిస్తున్నారు. అసలు తాను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిని కాదని చెప్పిన రవి, ఏ ఉద్దేశంతో వచ్చే వారం గుడ్ న్యూస్ వింటారని చెబుతారని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే నాయకత్వ మార్పుపై అధిష్ఠానం కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే రవి ఆ మాట పరోక్షంగా చెప్పి ఉంటారని, నిజంగా మార్పు అంటూ లేకపోతే... గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా నాయకత్వ ఉండదని ఎందుకు ఘంటాపధంగా చెప్పలేదని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ నాయకుడయిన రవి.. నాయకత్వ మార్పుపై మీడియా ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని, అంతా మీడియా కథనాలేనని కొట్టిపారేయాలి తప్ప, నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో వచ్చే వారం గుడ్‌న్యూస్ వింటారని ఎలా అంటారని సీనియర్లు చె బుతున్నారు. రవి వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్య చేశారని, ఏఐసీసీ అధికార ప్రతినిధులుగానీ, సోనియాకు సన్నిహితంగా వ్యవహరించే నేతలు గానీ ఇదే విధంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేసి, భవిష్యత్ సంకేతాలు ఇస్తుంటారని, ఇప్పుడు ఇది కూడా అదే కోవలోకి వస్తుందని ఓ సీనియర్ నేత విశ్లేషించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more