Employment problem in spain

employment problem in spain

employment problem in spain

25.gif

Posted: 07/30/2012 05:03 PM IST
Employment problem in spain

       స్పెయిన్ లో సాధారణంగా అయితే ఈ సమయంలో పర్యాటక రంగం బిజీగా వుంటుండటంతో ఉద్యోగావకాశాలు పెరుగుతూ నిరుద్యోగిత తగ్గుముఖం పడుతుండాలి. అందుకు భిన్నంగా ఈ ఏడాది ప్రభుత్వ పొదుపు చర్యల పుణ్యమా అంటూ దాదాపు 53 వేల మంది ఉద్యోగాలు spainపోగొట్టుకుని రోడ్డున పడటంతో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. 18ఏళ్ల క్రితం స్పెయిన్ లో సంభవించిన మాంద్యంలో నిరుద్యోగులైన వారి రికార్డును ఈ సంఖ్య బద్దలు కొట్టింది. దక్షిణ, పశ్చిమ స్పెయిన్  ప్రాంతంలోని కేనరీ ఐలండ్స్ లో ప్రతి ముగ్గురిలో ఒకరు నిరుద్యోగిగా మారారని ప్రభుత్వ లెక్కలున్నాయి. ప్రస్తుతం నిరుద్యోగులుగా వున్న వారిలో దాదాపు 50శాతానికి పైగా గతేడాది కాలంగా ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా తిరుగుతున్న వారేనని ప్రభుత్వ గణాంకాలు వివరించాయి. ప్రాంతీయ, స్థానిక సంస్థలు, ప్రభుత్వం తన వ్యయంలో భారీగా కోతలు పెడుతుండటంతోప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య 5 శాతానికి పైగా పడిపోయింది.
  spain_ee ఇదే సమయంలో టౌన్ హాల్స్  తమ సిబ్బందిని 11శాతానికి పైగా తగ్గించుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం మరో ఏడాది కొనసాగే సూచనలున్నాయని, ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా కోలుకునే సూచనలు కన్పించటం లేదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితి లేదని తెగేసి చెబుతోంది. పార్ట్ టైమ్  ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందటం లేదు. కేవలం మాడ్రిడ్  నగరంలోని 60 శాతం మంది నిరుద్యోగులకు మాత్రమే ప్రభుత్వం నుంచి నామమాత్రపు ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నాయి. ఎటువంటి సంపాదనాపరులు లేని కుటుంబాల సంఖ్య ఇప్పుడు 17లక్షలకు చేరుకుంది. యూరోను పరిరక్షించుకునేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటామని ఐరోపా కేంద్ర బ్యాంకు ప్రకటించటంతో స్పెయిన్  రుణభారంపై కొంత మేరకు సాంత్వన లభించినట్లయింది. స్పెయిన్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునే చర్యల్లో భాగంగా స్పానిష్ రుణభారాన్ని కొనుగోలు చేసేందుకు ఐరోపా కేంద్ర బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manisha koirala ends her marriage with samrat dahal
Indian cheated in soudi arabia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more