ఉపాధికోసం సౌదీకి వెళ్లిన హైదరాబాద్ వాసి అక్కడ జైల్లో అష్టకష్టాలు పడుతున్నాడు. తను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ క్షణమొక యుగంలా గడుపుతున్నాడు. కూటికోసం కూలికోసం పట్ణణంలో బ్రతుకుకోసం బయలుదేరిన బాటసారికి ఎంతకష్టం ఎంతకష్టం అన్న మాటలు విదేశాలలో ఉపాధికోసం వెళ్లిన మొహ్మద్ బషీర్ ప్రస్తుత స్థితికి అద్దం పడుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన బషీర్ 1990లో జీవనోపాధి కోసం గల్ఫ్ బాట పట్టాడు. సౌదీ లోని జెడ్డా నగరంలో జనరల్ స్టోర్లో పనికి కుదిరాడు. కొద్ది రోజుల్లోనే అతడి పనితీరు నచ్చిన షాపు యజమానులు వేతనం కూడా పెంచారు.దీంతో కొన్ని రోజుల తర్వాత తన భార్యను కూడా సౌదీకి తీసుకెళ్లాడు. అంతా బాగానే ఉందనకుంటున్న సమయంలో మొహ్మద్ బషీర్ ను జెడ్డా పోలీసులు ఏ కారణం చెప్పకుండానే నిర్బంధించారు.
అతడితో పాటు దుకాణంలో సహాయకుడిగా ఉన్న కడపజిల్లాకు చెందిన మహబూబ్ బాషా ను అతడి సోదరున్ని అరెస్ట్ చేశారు. బషీర్ ని చిత్రహింసలకు గురిచేసిన పోలీసులు రియాద్ ప్రాంతంలో జరిగిన హత్యతో సంబంధం ఉందని అంగీకరించాలని ఒత్తిడి చేశారు. తనకు ఏ పాపం తెలియదని చెప్పినా వినిపించుకోకుండా నేరంగీకార పత్రంపై వేలిముద్రలు తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు 250 కొరడా దెబ్బలు కొట్టాలని తీర్పునిచ్చింది. శిక్ష పూర్తైన తర్వాత స్వదేశానికి వెళ్లవచ్చని తీర్పు చెప్పింది. ఈ ముగ్గురి అరెస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలపకపోవడంతో బషీర్ భార్య గందరగోళానికి గురైంది.
తన వారికి ఫోన్ లో సమాచారం అందించింది. ఐతే చివరకు ఆరునెలల తర్వాత బషీర్ అరెస్ట్ కు సంబంధించిన సమాచారాన్ని అతడి షాపు యజమానులకు తెలపడంతో పాటు అతడి భార్యను కలవడానికి అంగీకరించారు పోలీసులు. సంవత్సరం తర్వాతైనా విడుదలవుతాడని ఆశతో ఎదురుచూసింది. కోర్టు తీర్పు ఇచ్చి ఏడుసంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ బషీర్ ను సౌదీ అధికారులు నిర్భందంలోనే ఉంచారు. నాలుగు గోడల మధ్య చీకటి జీవితాన్ని గడుపుతున్న బషీర్ క్షణం ఒక యుగంగా గడుపుతున్నాడు. ఇటు స్వదేశంలో బషీర్ రాక కోసం అతడి కుటీంబీకులు ఆశతో ఎదురుచూస్తున్నారు. సౌదీలో ఉద్యోగం చేసి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న కొడుకు నాలుగు గోడల మధ్య కష్టాలు అనుభవిస్తున్నాడని తెలిసి బషీర్ తల్లి కన్నీరుమున్నీరవుతుంది. తన కుమారున్ని చూడకుండానే చనిపోతానేమోనని విలపిస్తుంది. తన తమ్ముడిని విడిపించాలంటూ తాము ఎంత మంది అధికారులను, నాయకులను కలిసిన లాభం లేకుండా పోయిందని బషీర్ సోదరుడు అన్సార్ వాపోతున్నాడు. అన్యాయంగా తన సోదరుడు జైలు జీవితం అనుభవిస్తుంటే రాయబారి కార్యాలయ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని వేదన వ్యక్తంచేశాడు. తను చేయనినేరానికి అన్యాయంగా జైలులో పెట్టారని అసలు ఇప్పటికవరకు తాను ఎవరిని హత్య చేసానో కూడా తెలుపకుండా గుడ్డిగా ఇక్కడి అధికారులు ,కోర్టు తనకు శిక్ష వేసారని బాధితుడు లేఖలో ఆరోపించాడు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more