ప్రముఖ కూచిపూడి నాట్య గురువు వెంపటి చిన సత్యం(83) ఇక మనకులేరు. ఈ నాట్య సాగరుడు ఆదివారం ఉదయం పది గంటలకు చెన్నైలో కన్ను మూశారు. వృద్ధాప్యంతో వచ్చిన అనారోగ్యం కారణంగా ఆయన మరణించారు. దీంతో నిన్నటినుంచీ చిన సత్యం భౌతిక కాయాన్ని అనేక మంది సందర్శించి వారి కుటుంభ సభ్యులకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
కాగా, కోస్తా ఆంధ్రాలోని కూచి పూడి నాట్యానికి పుట్టినిల్లయిన కృష్ణాజిల్లా కూచి పూడి గ్రామంలో 1929వ సంవత్సరం అక్టోబరు 25న వెంపటి చిన సత్యం జన్మించారు. వెంపటి చలమయ్య, వరలక్ష్మీ దంపతులకు ఆయన జన్మిం చారు. కూచిపూడి నాట్యాన్ని ప్రపంచ వ్యాపితం చేయడంలో ఆయన తనదైన పాత్ర పోషించారు. కూచిపూడి నాట్యంలో నూతన విధానాలను ప్రవేశ పెట్టి వందలాదిమంది శిష్యులను తయారు చేశారు. పద్మభూషణ్ అవార్డుతో పాటు విశాఖ పట్టణంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. కూచిపూడి నాట్యంలో ఆయన చేసిన కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇతర సంస్ధలు కూడా ఆయనను సత్కరించి గౌరవించాయి.
వెంపటి సత్యం 1956 సంవత్సరంలో పద్మ భూషణ్ అవార్డు పొందారు. 1967లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ పొందారు. వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి వద్ద ఆయన కూచిపూడి నాట్యాన్ని అభ్యసించారు. ఆ తరువాత శ్రీ తాడేపల్లి పేరయ్య శాస్త్రి, ఆయన పెద్ద సోదరుడు వెంపటి పెద్ద సత్యం వద్ద శిష్యరికం చేశారు. ఈ నేపథ్యంలో కూచిపూడి నాట్యంలోని కొన్ని ధోరణులకు స్వస్తి చెప్పి నూతన విధానాలను ప్రవేశపెట్టిన ఘనత చిన సత్యానికే దక్కింది. కూచిపూడి నాట్యానికి ప్రపంచ వ్యాపితంగా ఆదరణ లభించడం వెనుక చిన సత్యం కృషి ఎంతో ఉంది.
పద్మావతి శ్రీనివాస కళ్యాణం, విప్ర నారాయణ చరితం, మేనక విశ్వామిత్ర, కళ్యాణ శకుంతలం, భామా కలాపం, చండాలిక, రుక్మిణీ కళ్యాణం, హర విలాసం, శివ ధనుర్భంగం, అర్థనారీశ్వరం తదితర నాట్య ప్రక్రియలు చిన సత్యానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. కాలక్ర మంలో1963వ సంవత్సరంలో మద్రాసులో కూచి పూడి ఆర్ట్ అకాడమీని చినసత్యం స్థాపించారు.ఈ అకాడమీ తరుపున ఆయన 180కి పైగా సోలో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. దాదాపు 15 నాట్యనా టికలు ప్రదర్శించారు. వీటన్నిటకి చిన సత్యమే కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఆయన తొలి నాట్య నాటికి శ్రీకృష్ణ పారిజాతము. ఆ తరువాత క్షీరసాగర మథనంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. చినసత్యం ధరించిన శివుడి పాత్రకు ప్రేక్షకుల నుండి ఎనలేని ప్రశంసలు లభించాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నాట్యా చార్యునిగా కొనసాగారు. అదేవిధంగా బోంబే సంగీత పీఠానికి నేతృత్వం వహించారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ టిటికె మెమోరియల్ అవార్డును ఇచ్చి సత్కరించింది. వీటితో పాటు విశాఖపట్టణా నికి చెందిన సాంస్కృతిక సంస్థ నాట్య కళాసాగర బిరుదు, మద్రాస్ రాజా-లక్ష్మీ అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ బిరుదు, గుంటూరులో నాట్య కళా భూషణ, హైదరాబాద్‌లో కళాప్రపూర్ణ, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డి.లిట్, న్యూఢిల్లీకి చెందిన కేంద్ర సంగీత నాటక అకామడీ నుండి జాతీ అవార్డును వెంపటి చిన సత్యం అందుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ పురస్కారంతో సత్కరించింది, తమిళనాడు ప్రభుత్వం కళైమామణి బిరుదునిచ్చి సత్కరించింది. ఈయన ప్రముఖ బాలీవుడ్ నటీ హేమమాలిని, తెలుగు నటులుప్రభ, వైజయంతి మాలలకు నాట్య గరువుగా వ్యవహరించారు.
భారత జాతి గర్వించదగిన నాట్యాచార్యులు వెంపటి చినసత్యం మృతితో కూచిపూడి నృత్యం ఒక మహాగురువును కోల్పోయిందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. చెన్నరులో ఆదివారం కన్నూమూసిన చిన సత్యం కుటుంబా నికి సంతాపాన్ని, కుటుంబసభ్యులకు ప్రగాఢసాను భూతిని తెలిపారు. ఎందరో కళాకారులను తీర్చిదిద్ది కూచిపూడి నృత్యానికి ఖండాంతర ఖ్యాతిని చిన సత్యం ఆర్జించిపెట్టారని ఆయన కుటుంబ సభ్యు లకు పంపిన సంతాప సందేశంలో సిఎం పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. వసంతకుమార్ చిన సత్యం మృతికి సంతాపం తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూచిపూడి నృత్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి చిన సత్యం అని చెప్పారు. ప్రపంచంలోని దాదాపు 60 దేశాల్లో ఆయన నాట్య ప్రదర్శనలిచ్చారు. పదివేల మందికి పైగా శిష్యులను తయారు చేశారని వసంతకుమార్ తెలిపారు. ఎన్టీఆర్ తనయ, కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరికి కూడా ఆయన నాట్య గురువు. వెంపటి చిన సత్యం మరణ వార్త తెలియ గానే ఆమె విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యు లకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.
ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం మృతి పట్ల తెలుగుదేశం అధ్యక్షులు ఎన్.చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాస్త్రీయ భారతీయ నృత్యాలలో కూచిపూడి నాట్యానికి సమున్నత గుర్తింపు తీసు కురావడానికి విశేష కృషి చేశారని కొనియాడారు. అనేక చలనచిత్రాలకు నృత్య దర్శకత్వం వహించిన ఆయన నర్తనశాల సినిమాలో ఎన్టీఆర్ బృహన్నల పాత్రకు నృత్యకల్పన చేశారని గుర్తు చేశారు. ఆయన ప్రతిభకు తార్కాణంగా కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిందన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సాను భూతిని, సంతాపాన్ని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
వెంపటి చినసత్యం మృతిపట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షు రాలు వై.ఎస్.విజయమ్మ సంతాపాన్ని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కూచిపూడి కళను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఘనత చినసత్యంకే దక్కుతుందన్నారు. ఆయన మరణం నాట్య కళారంగానికి తీరని లోటు అని ఆమె పేర్కొన్నారు.
ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణం కళామతల్లికే తీరని లోటని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రానాయక్, పల్లె నర్సింహ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more