న్యూఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తాజా సమాచారం ప్రకారం సుమారు 50మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శనివారం రాత్రి న్యూఢిల్లీ బయల్దేరిన ఈరైలు ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఎస్ -10, ఎస్ -11 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన S-11 బోగి శవాల గుట్టను తలపిస్తోంది. ప్రయాణికులు మంటలకు మాడి మసైపోయాయి. కనీసం గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయాయి. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. పొగకు ఊపిరాడకా చాలా మంది చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రయాణికులంతా తమిళనాడుకు చెందిన వారిగానే భావిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గురైన బోగి... ఆనవాళ్లు లేకుండా మారిపోయింది. బెర్తులన్నీ బూడిద కుప్పలుగా మారాయి. శవాల్ని అతికష్టమ్మీద బయటకు తీస్తున్నారు.
కాగా, శనివారం రాత్రి పదిన్నరకు ఢిల్లీ నుంచి బయల్దేరిన ఈ రైలు ఈ ఉదయం ఏడుగంటలకు చెన్నై చేరాల్సి ఉంది. విజయవాడ నుంచి బయల్దేరిన ఈ రైలుకు తర్వాతి స్టాప్ చెన్నైయే. నెల్లూరు విజయమహల్ గేట్ దగ్గర మండుతున్న బోగిని గేట్‌మ్యాన్ గుర్తించినట్టు తెలుస్తోంది. అతనే డ్రైవర్‌ను అలర్ట్ చేసినట్టు సమాచారం. కాలిపోయిన బోగిని మిగిలిన రైలు నుంచి వేరు చేశారు. ఎస్ 10 బోగికి కూడా మంటలు అంటుకున్నా అందులోని ప్రయాణికులంతా సురక్షితమని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రైలును నెల్లూరు స్టేషన్‌కు తరలించారు. మిగిలిన రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు మరణించిన వారి బంధువుల్ని తీసుకొని ప్రత్యేక రైలు చెన్నై నుంచి బయల్దేరింది.
ఈ ప్రమాదంలో ఏడాదిన్నర వయస్సు ఉన్న ఓ చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి ముఖం స్వల్పంగా కాలింది. మధురైకి చెందిన ఈ చిన్నారిని కౌశిక్‌గా గుర్తించారు. తండ్రి వెంకటేష్ బాబు, సోదరుడు హర్షిత్ ఈ ప్రమాదంలో చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. తల్లి వీణ ప్రస్తుతం కాలిన గాయాలతో నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది రైలు ప్రమాద వార్త తెలియగానే .... నెల్లూరులో ఉంటున్న బంధువులకు బాధితులు సమాచారం అందించారు. వెంకేటష్ బాబు మధురైలో ఉద్యోగం చేస్తున్నాడు. విజయవాడ నుంచి వీళ్లు చెన్నైకి బయల్దేరినట్టు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని కాప్రాకు చెందిన శాలిని అనే యువతి మరణించింది. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమె తన స్నేహితురాలి ఎంగేజ్‌మెంట్ కోసం కరీంనగర్ వచ్చింది. శాలిని నిన్న రాత్రి వరంగల్ లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ప్రమాద విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రులు హృదరవిదారకంగా రోదించారు. అందరితో ఆత్మీయంగా ఉండే శాలిని రైలు ప్రమాదంలో మరణించడంతో కాప్రాలోని ఆమె నివాసం వద్ద విషాదం అలుముకుంది.
ప్రమాద ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. రైలు ప్రమాదానికి విద్రోహ చర్యలు కూడా కారణమై ఉండవచ్చనే కోణంలోనూ వారు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి పేలుడు పదార్థాలు ఏమైనా ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ప్రమాద ఘటనకు ముందే బోగీలు శబ్దాలు వినిపించినట్లు తమిళనాడుకు చెందిన టీటీఈ అధికారులకు తెలియచేశారు.
ప్రాథమిక అవగాహన ప్రకారం రైలు నెల్లూరు రైల్వేస్టేషన్ దాటిన కొద్దిసేపటికే బోగీలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన ఎస్ -11 బోగీలో ఓ కిరోసిన్ డబ్బా లభించినట్లు సమాచారం. కాగా ఈ బోగీలో ముగ్గురు అనుమానితులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. వారి వివరాలను అధికారులతో పాటు పోలీసులు సేకరిస్తున్నారు. కాగా రైల్వేలో భద్రత వ్యవస్థ పటిష్టంగా లేనందునే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ -ఎన్ ఎఫ్ ఐఆర్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య చెప్పారు. S-11 బోగీ తగలబడి పోవడానికి షార్ట్‌సర్క్యూట్ కారణం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతే ప్రమాద కారణమేంటో తెలుస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
అగ్ని ప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్ ప్రెస్ S-11 బోగిని నెల్లూరు రైల్వే స్టేషన్ నాలుగో ఫ్లాట్‌ఫామ్‌పైకి తీసుకు వచ్చారు. మాంసం ముద్దలుగా మారిన శవాల్ని బోగీ నుంచి అతి కష్టమ్మీద బయటకు తెచ్చేందుకు సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సహాయక పనుల్ని నెల్లూరు ఎస్పీ రమణ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
శవాల్ని చేర్చేందుకు వీలుగా ఫ్లాట్‌ఫాంపై టార్పాలిన్ పరిచారు. మరో వైపు మృతుల్ని గుర్తించేందుకు వీలుగా చెన్నై నుంచి ప్రత్యేక రైలు నెల్లూరుకు బయల్దేరింది. మరికాసేపట్లో ఆ రైలు నెల్లూరుకు చేరుకునే అవకాశం ఉంది. శవాలేవి గుర్తించే విధంగా లేవు. గుర్తించేందుకు ఆనవాళ్లే ఆధారం. కాగా ప్రమాదానికి గురైన ఎస్ -11 బోగీతో పాటు మరో నాలుగు బోగీలను అధికారులు నెల్లూరులో నిలిపివేశారు. మిగిలిన బోగీలతో రైలు చెన్నైకి బయల్దేరింది.
నెల్లూరు సమీపంలో ప్రమాదానికి గురైన రైలులో ఎస్ -11 బోగీలోలో ప్రయాణిస్తున్న 72మందిలో
ఢిల్లీ- 17మంది భోపాల్-11మంది, ఆగ్రా-ముగ్గురు ఝాన్సీ- ఆరుగురు, వరంగల్- ఏడుగురు, విజయవాడ -28 మంది ప్రయాణికులు రైలు ఎక్కారు.విజయవాడలో రైలు ఎక్కిన ప్రయాణికుల వివరాలు:
ఉదయభాను(30), సాయికుమార్( 26), తిరుపతి(15)
శ్రీరాం (25), సాయికుమార్ (28), మదన్‌లాల్ (48)
అనూష్ ( 23), రుషి వర్ధి (27), ఉత్తర కుమార్ (34)
సంపత్ (23), వర్మ (22), జస్వని (23), శ్రీకర్ (22)
విజయవాడలో తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కిన ప్రయాణికులు:
రాజేశ్వర్ (28), దీపిక (22), రాజు (27), పల్లవి (25)
ప్రశాంతి (23), సింధు (22), దీపక్ (33), సుధాకర్ (46)
జ్ఞానేశ్వర్ (25), సునీత (25), విజయ్‌కుమార్ (23), వెంకటరమణ (30)
మొహిద్దీన్(40), అభినవ్‌బద్రా(24), నాగరాజు(45), కాశీనాథ్ (28) ఉన్నారు.వరంగల్ స్టేషన్ లో ఎక్కిన ఏడుగురి వివరాలు:
షాలిని(23), ప్రశాంతి(23), చందు(22), విజయ్కుమార్(23)
అవినాష్(24), రాజు 27, శ్రీనివాస్(25)
వరంగల్ హెల్ప్ లైన్ నంబర్: 0870 2426232
తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నుంచి 27మంది ప్రయాణికులు బయటపడినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. గాయపడ్డ వారు వివిధ ఆస్పత్రుల్తో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్నవారి వివరాలు : రేఖ, వీణ, సాంబశివరావు, శిరీష, వెంకట కోటేశ్వరరావువర్మ, హుసేన్, రాఘవన్, కేకే సునీల్ కుమార్, హర్షిత్, సందీప్ అగ్నిహోత్రి, అమీర్ ప్రీత్ సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, విజయకుమార్, ఖుర్షీ అనే ఇద్దరు వ్యక్తులు పీపుల్స్ పాలీ క్లినిక్ లో చికిత్స పొందుతున్నారు.
నెల్లూరు జయభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు: సరళ, బంజర్ లాల్, విద్యాభాస్కర్, శ్రీనివాసులు, ప్రకాశ్ సింగ్, శోభాసింగ్ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు: మదన్ లాల్, హరికిషన్, అనూష, తిరుమతమ్మ, సంపత్.
దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఒక్కొక్కరికీ అయిదు లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు తెలిపింది. ప్రమాద ఘటనపై రైల్వే శాఖ మంత్రి దినేష్ త్రివేది తీవ్ర దిగ్ర్బాంతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more