కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థినీ విద్యార్థులకు శుభవార్త. విద్యా సంస్థల్లో సహచరుల ర్యాగింగ్ లేదా వేధింపులకు గురయ్యే విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యాంటీ ర్యాగింగ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. www.antiragging.in వెబ్‌సైట్‌ను కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి కపిల్ సిబల్ ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా విద్యార్థులు వారి ఫిర్యాదుల పురోగతిని తెలుసుకోవడంతోపాటు యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్లను కూడా మెయిల్ ద్వారా పొందవచ్చు. అలాగే 18001805522 నెంబర్‌కు ఫోన్ చేసి కూడా వారి ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ప్రభుత్వం ఈ ఫిర్యాదులను పరిశీలించి వాటి తీవ్రతనుబట్టి పోలీసులకు, మేజిస్ట్రేట్‌కు, విద్యాసంస్థ అధిపతికి బదిలీ చేస్తుంది. ఈ వెబ్‌సైట్ నిర్వహణ బాధ్యతను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చేపడుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో 2009లో ర్యాగింగ్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన ఆమన్ అనే విద్యార్థి తండ్రి రాజేంద్ర కచ్రూ క్రియాశీల భాగస్వామ్యంతో యూజీసీ ఈ వెబ్‌సైట్‌ను తయారు చేసింది. ర్యాగింగ్ నిరోధక కార్యక్రమాలను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు 2009లో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు సిబల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూజీసీ తాత్కాలిక చైర్మన్ వేద్ ప్రకాష్, రాజేంద్ర కచ్రూ తదితరులు పాల్గొన్నారు. తాజా సైట్ తో ఆకతాయిల భారినుండి విముక్తి పొందేందుకు విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more