మంత్రి పార్థసారథి పదవికి గండం తప్పేట్లు లేదు. పదేళ్ళ క్రితం సారథిపై నమోదైన కేసులో మంత్రిగా ఉన్న సమయంలో శిక్ష ఖరారు కావడం, ఆ తర్వాత కూడా మంత్రి వర్గంలో కొనసాగటంపై విమర్శలు వెల్లువెత్తాయి. పార్థసారథి స్వచ్చందంగా రాజీనామా చేయడమో లేకుంటే సీఎం ఆయనని తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో మంత్రి సారథి రాజీనామాకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ వాన్ పిక్ కేసులో పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మరో బి.సి సామాజికవర్గానికి చెందిన మంత్రి కూడా కోర్టు కేసు, శిక్షల కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి రావడం కిరణ్ కుమార్ కేబినెట్ ను ఇరకాటంలో పెట్టే పరిస్థితే. పార్థసారథి కూడా రాజీనామా చేస్తే కిరణ్ కేబినెట్ లో ఇద్దరు బి.సి మంత్రుల రాజీనామా చేసినట్లు అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టికి, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి కూడా కొంత ఇబ్బంది కరమై పరిస్థితే. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎదురు చూడాలి. మంత్రి సారథి మాత్రం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమేనని, కానీ తర్వాతి పరిణామాలకు మాత్రం సి.ఎం కిరణ్ కుమారే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూనే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. మరోవైపు సీఎం కిరణ్ కుమార్ మాత్రం తాజా పరిణామాలపై అధిష్టానం ఆదేశాలకనుగుణంగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే అవినీతి వ్యవహారాల్లో మంత్రుల ప్రమేయంపై కోర్టు విచారణల్ని ఎదుర్కోవాల్సి రావడం, ఒకరు జైలు పాలైన నేపథ్యంలో అచితూచి అడుగులు వేస్తున్నారు.
రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి సారథి విషయంలో వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు. మరోవైపు తీవ్ర దుమారం రేపిన పార్థసారథి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ప్రజా జీవితంలోకి రాకముందు జరిగినా, ప్రభుత్వంలోని ఒక మంత్రికి జైలు శిక్ష పడడం ప్రజల్లోకి ఎలాటి సంకేతాలు పంపుతుందన్న విషయాన్ని హైకమాండ్ అంచనా వేస్తోంది. వివిధ కారాణాలతో ఇప్పటికే పార్టీ ప్రతిష్ట దిగజారిన నేపథ్యంలో, తాజా వ్యవహారం పార్టీపై చూపే ప్రభావాన్ని అంచనా వేస్తోంది. జగన్ ని రాజకీయంగా ఎదుర్కోవడానికి పార్థసారథి మంత్రి వర్గం నుంచి తప్పించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన మంత్రి మోపిదేవి వాన్ పిక్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు. ఇప్పుడు బీసీ వర్గానికే చెందిన పార్థసారథిపై చర్యలు తీసుకుంటే బీసీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుయ్యే అంశాన్ని కూడా హైకమాండ్ పరిశీలిస్తుంది. తన మంత్రిత్వ శాఖ పనుల్లో బిజీగా ఉండటం వల్ల సీఎంతో మాట్లడలేదని, ఆయనతో మాట్లాడి కేసు పూర్వాపరాలు తెలుసుకున్న తరువాత పార్థసారథి వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ చెప్పారు. రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి సరికొత్త రూపం ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో, పార్థసారథి వ్యవహారం కాంగ్రెస్ హైకమాండ్ కి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.
ఈ వ్యవహారం వల్ల పార్టీ ప్రతిష్టకి ఏ మాత్రం భంగం కలగకూడదని భావిస్తే పార్థసారథిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. బీసీ సెంటిమెంటుని పరిగణనలోకి తీసుకుంటే పార్థసారథి ప్రస్తుతానికి బయటపడే అవకాశాలున్నాయి. కోర్టు తీర్పు ప్రకారం హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు సాంకేతికంగా నెల రోజుల గడువు ఉంది కాబట్టి, అప్పటి వరకు వేచి చూసే అవకాశాలున్నాయి. అయితే ఏదో ఒక నిర్ణయం 24గంటల్లోపే రాబోతుంది. సెంటిమెంటు కన్నా ప్రతిష్టే ముఖ్యమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే పార్థసారథికి ఉద్వాసన తప్పదు. పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి బిసి సెంటిమెంటు వైపు మొగ్గితే మాత్రం ఆయన ప్రస్తుతానికి బయటపడొచ్చు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more