Evangelist k a paul held for murder plot

Evangelist K A Paul held for murder plot, Hospital, Health, KA paul, Brother murder Case, Divid raju,

Evangelist K A Paul held for murder plot

Paul.gif

Posted: 07/23/2012 03:16 PM IST
Evangelist k a paul held for murder plot

Evangelist K A Paul held for murder plot

కేఎ పాల్ అంటే  తెలియాని వారు చాలా మంది ఉంటారు.  కానీ క్రైస్తవ కేఎ పాల్ అంటే మాత్రం ప్రతి ఒక్కరి గుర్తుకు వస్తారు.  కేఎ పాల్  ప్రజా శాంతి పార్టీ పెట్టి  రాజకీయంగా ఎదగలానే ఉద్దేశంతో రాజకీయల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.  కేఎ పాల్ ను రాష్ట్ర  ప్రజలు కోరుకుంటున్నారని అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పటం తెలిసిన విషయమే.  అయితే తన అన్నహత్య కేసులో  నిందుతుడిగా భావించి  కేఎ పాల్ ను  ఒంగోలు  పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల నుండి కేఎ పాల్  అనారోగ్యంతో  బాధపడుతున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.    కేఎ పాల్  మెరుగైన చికిత్స కోసం  నిమ్స్ కు తరలించటం జరిగింది. అయితే అక్కడ కేఎ పాల్ రచ్చ రచ్చ చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. తాను పిచ్చి వాడిని కాదని, తనకు పిచ్చి లేదని చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి వస్తే ఇక్కడ చికిత్స చేయకుండా పిచ్చిఉందని ఎర్రగడ్డకు పంపుతున్నారని కె.ఎ.పాల్ గోలగోల చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కక్ష గట్టి తనని ఎర్రగడ్డకు తీసుకెళ్తున్నారని ఆయన అంటున్నారు. తనను చంపడానికి కుట్రచేస్తున్నారని పాల్ అంటున్నాడు. రెండేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ఇప్పుడు తనని అరెస్ట్ చేయడమేంటని ఆయన అడిగారు. ఇదంతా రాజకీయ కుట్ర ఆయన కేఎ పాల్ చెబుతున్నాడట . క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్‌ను పోలీసులు మే మూడో వారంలో అరెస్టు చేశారు.

Evangelist K A Paul held for murder plot

తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో ఆయనను పోలీసులు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అరెస్టు చేశారు. డేవిడ్ రాజ్ రెండేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పాల్ తమ్ముడు డేవిడ్ రాజు 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.డేవిడ్ రాజుకు, కెఎ పాల్‌కు మధ్య ఆస్తి తగాదాలున్నాయి. ఈ ఆస్తి తగాదాల కారణంగానే డేవిడ్ రాజును కెఎ పాల్ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆస్తులపై పరస్పరం కేసులు పెట్టుకుని వివాదానికి దిగారు. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి కొంత మంది క్రైస్తవ మత పెద్దలు ప్రయత్నించారు.కెఎ పాల్ వద్దకు పోలీసులు స్పై కెమెరా తీసుకుని వెళ్లారు. డేవిడ్ రాజు హత్య కేసులో అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులకు కోటి రూపాయలు ఇస్తానని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. అందుకు ముందస్తుగా మూడు లక్షల రూపాయలు ఇవ్వజూపాడు. దీన్నంతా పోలీసులు స్పైకెమెరాలో బంధించి, సోమవారం తెల్లవారు జామున అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab mukherjees elder sister says its a dream come true for his brother
Ys vijayamma siricilla tour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more