చేనేత కార్మికుల కష్టాలపై వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ 23న కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేపట్టనున్న దీక్ష వివాదాస్పదమవుతోంది. చేనేత దీక్షకు పోలీసులు అనుమతిచ్చినా టిఆర్ఎస్ నేతలు మాత్రం అడ్డుకుని తీరుతామంటున్నారు. విజయమ్మ పర్యటన మరో మానుకోటలా మారి అనుకోని సంఘటనలు జరిగితే దానికి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీలదే బాధ్యతని హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలంగా వున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరానికి లేఖ ఇచ్చిన తరువాతే సిరిసిల్లలో అడుగు పెట్టాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణాలో పుణ్యక్షేత్రాల దర్శనానికి వస్తే తమకు అభ్యంతరం లేదనీ తెలంగాణాపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వస్తే నిరసన తప్పదని జేఎసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. అలాగే తెలంగాణకు అనుకూలమని వైఎస్ఆర్సీపి ప్రకటిస్తే నియోజకవర్గ ప్రజలతో తాను కూడా దీక్షకు మద్దతిస్తామని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటిఆర్ చెప్పారు. విజయమ్మకు సాదర స్వాగతం పలుకుతామన్నారు. అయితే తెలంగాణ నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని కెసీఆర్ చెప్పినప్పుడు తమ పార్టీ వైఖరితో పనేంటని అడుగుతున్నారు. విజయమ్మ పర్యటనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎలా ఆగిపోతుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే విజయమ్మ పర్యటనను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టిన టిఆర్ఎస్ విద్యార్ధి విభాగం 23న సిరిసిల్ల బంద్ కు పిలుపునిచ్చింది.
....avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more