ప్రభుత్వ హాస్టళ్లు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం విద్యార్ధుల ప్రాణాలను హరించి వేస్తోంది. కూలిపోయేందుకు సిద్ధంగా భవనాలు, ఎక్కడ ముట్టుకున్నా విద్యుత్ షాక్ కొట్టే గోడలను చూసి విద్యార్ధుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో తాగునీటి కోసం వెళ్లిన విద్యార్ధులకు విద్యుత్ షాక్ తగిలింది. కొండారెడ్డిపల్లి పురపాలక పాఠశాల విద్యార్ధులు కొందరు తాగునీటి కోసం వెళ్లగా అక్కడే వున్న ట్రాన్స్ ఫార్మర్ షాక్ కొట్టి 20మంది విద్యార్ధులు గాయపడ్డారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా వుంది. మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ బాలికల గురుకుల హాస్టల్ లోని 200మంది విద్యార్ధినులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. హాస్టళ్లలో సరైన వసతులు లేకపోయినా మౌనంగా భరిస్తూ వచ్చిన బాలికలు.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భయపడుతున్నారు. భవనంలోని గదుల్నీ తడిసి ఎక్కడ ముట్టుకున్నా విద్యుత్ షాక్ వస్తుండటంతో.. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గతంలో ఓ విద్యార్ధిని విద్యుత్ షాక్ తో మృతి చెందినా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని విద్యార్ధినుల తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ భవనం మొత్తం విద్యుత్ ప్రసారమౌతుండటంతో తక్షణమే విద్యార్ధులను వేరే భవనానికి మార్చాలని తల్లి తండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more