ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం హైదరాబాద్ ను జలదిగ్బంధంలో చిక్కుకునేలా చేసింది. వర్ష బీభత్సం జనజీవనాన్ని స్తంభింపజేసింది. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడిక్కడే నిలిచిపోయింది. వర్షబీభత్సానికి 9మంది మృత్యువాత పడ్డారు. నగర పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించి సహాయక చర్యలకు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. చినుకు వణుకు పుట్టించింది. వరద హడలెత్తించింది. భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా హోరెత్తిన వర్ష బీభత్సానికి రాజధాని చిగురుటాకులా వణికిపోయింది. దాదాపు 20గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 78ప్రాంతాలు దిగ్బంధంలో చిక్కుకొని విలవిల్లాడిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు కంటిమీద కునుకులేకుండా గడిపారు. బట్టలు, నిత్యావసర వస్తువులు, వండుకొన్న ఆహార పదార్థాలు సైతం నీట మునిగాయి.
మెహిదీపట్నం సమీపంలోని నదీంకాలనీ, ముషీరాబాద్ లోని నాగమయ్యకుంట, పద్మాకాలనీ, అంబర్ పేట బతుకమ్మకుంట, ప్రేమ్ నగర్, దిల్ సుఖ్ నగర్ లోని గ్రీన్ పార్క్ కాలనీ, తపోవన్ కాలనీ, లెనిన్ నగర్ లలోని వీధులన్నీ వర్షం నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. టోలీచౌకీ, షేక్ పేట్, బీఎస్ మక్తా, మారుతీనగర్, పార్సీగుట్టలోని అశోక్ నగర్ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు హడలిపోయారు. సామాన్లు నీటిలో కొట్టుకుపోకుండా కాపాడుకొనేందుకు రాత్రంతా జాగరణ చేశారు. పాతబస్తీ గొల్కొండ ప్రాంతం భారీవర్షానికి జలమయమయ్యింది. గోల్కొండ సమీపంలోని లోతట్టుప్రాంతమయిన దొనకొండ వర్షం నీటితో నిండిపోయింది. ఇళ్ళనుంచి బయటకు రాలేని పరిస్థితిలో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాల ధాటికి హఫీజ్ పేటలో నలుగురు, బాలానగర్ లో గోడ కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్సించారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. అటు ఖైరతాబాద్ లోని లోతట్టు ప్రాంతాల్లోనూ, నాగయ్య కుంట ప్రాంతంలోనూ సీఎం పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షం, వరదనీటి బీభ్సతానికి తోడు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.
ప్రధాన మార్గాల్లో వరదనీరు ప్రవహించడంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభించింది. వర్షాలకు జీహెచ్ ఎంసీ పరిధిలోని 78ప్రాంతాలు నీట మునిగాయని జీహెచ్ ఎంసీ కమిషనర్ కృష్ణబాబు తెలిపారు. హైదరాబాద్ లో గత పన్నెండేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమన్నారు. తాజా వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో జలమట్టం పెరిగింది. అటు కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఆలూరు మండలం హర్టిబెళగల్ సమీపంలోని కల్లె వాగులో నిన్న రాత్రి ఓ ఇండికా కారు, టాటా ఏస్ వాహనం గల్లంతయ్యాయి. వరద ఉధృతికి కొద్దిదూరం కొట్టుకుపోయాయి. దీంతో రెండు వాహనాల డ్రైవర్లు చనిపోయారు. ఆదివారం ఉదయం వారి మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారిని గుంతకల్లుకు చెందిన మల్లికార్జున్ రెడ్డి, ఆటో డ్రైవర్ బాషాగా గుర్తించారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more