Asian games gold medalist pinki pramanik released from jail

Asian Games gold medalist Pinki Pramanik released from jail,asiagame-goldmedalist-pinkypramanik-rapecase-chromosomes, medical tests, west bengal police, government,state human rights commission, athletians,

Asian Games gold medalist Pinki Pramanik released from jail

Pramanik.gif

Posted: 07/12/2012 03:28 PM IST
Asian games gold medalist pinki pramanik released from jail

Asian Games gold medalist Pinki Pramanik released from jail

ఆమె నన్ను రేప్ చేసిందని ఒక అమ్మాయి పోలీసులకు రిపోర్టు చేసింది. ఆమె, అమ్మాయిని రేప్ చెయ్యటం ఏమిటి? అనుకుంటున్నారా? ఈ స్టోరీ మనకు తెలిసిందే.  పింకి అనే పేరు వినే ఉంటారు. ఇప్పుడు పింకి ఆమె కాదట? ఆమెలో మగాడు ఉన్నాడని  డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఆమెను టెస్ట్ పేరుతో.. అమానుషంగా పింకి చూపించారని ఆమె చెబుతుంది. పోలీస్ కస్టడీ సమయంలో తన పట్ల ఖాకీలు అమానుషంగా ప్రవర్తించారని ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత పింకీ ప్రామాణిక్ తెలిపింది. పోలీసులు కాళ్లూచేతులు కట్టేసి లింగ నిర్ధారణ ప రీక్ష నిర్వహించారని ఆరోపించింది. అత్యాచారం ఆరోపణలతో 26 రోజు లు జైల్లో ఉన్న పింకీ  బెయిల్‌పై విడుదలైంది. 'పోలీసులు నా కాళ్లుచేతులు కట్టేసి లింగ నిర్ధారణ పరీక్ష నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎంత ఏడ్చినా, ప్రతిఘటించినా ఎవ్వరూ పట్టించుకోలేదు' అని పింకీ ఆరోపించింది. ఎవరైతే తనపై అత్యాచారం ఆరోపణలు చేశారో ఆమె గతంలో తనను డబ్బు అడిగిందని.. ఇవ్వకపోవడంతో ఈ విధంగా కేసు పెట్టిందని పింకీ చెప్పింది. తన న్యాయవాదులతో మాట్లాడి న్యాయపోరాటం చేస్తానని పింకీ పేర్కొంది. పింకీని పోలీసులు వేధిస్తున్నారన్న ఆరోపణలతో ఈ నెల 6వ తేదీని వేసిన పిటీషన్‌ను కోల్‌కతా హైకోర్టు విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే.

pinki1

అయితే దీనిపై రెండు వారాల్లోగా విచారణ జరిపి అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ విషయంపై విచారణ చేయాల్సిందిగా పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఆ రాష్ట్ర హోం, ఆరోగ్య, పోలీసు శాఖలను ఆదేశించింది. పోలీసుల వేధింపుల విషయంలో తనకు అండగా నిలిచిన క్రీడాకారులందరికీ పింకీ కృతజ్ఞతలు తెలిపింది. క్రీడాకారులు తెలిపిన నిరసనను తాను జైల్లో ఉన్నప్పుడు పత్రికల ద్వారా తెలుసుకున్నానని చెప్పింది. అయితే పింకీ మళ్లీ తన ఉద్యోగంలో చేరుతుందా అన్న ప్రశ్నకు ఆమె న్యాయవా ది తుహిన్ రాయ్ సమాధానమిస్తూ.. దోషిగా నిర్ధారణ కానంతవరకూ పనిచేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు. పింకీ బెయిల్‌పై విడుదలైన సమయంలో తండ్రి దుర్గాచరణ్ ప్రామాణిక్, మాజీ ఎంపీ జ్యోతిర్మయి సిక్దర్ ఆమెతో కూడా ఉన్నారు. మరోవైపు తనకు న్యాయం జరిగేలా చూడమని.. బెంగాల్ ప్రభుత్వ క్రీడల మంత్రి మదన్ మిత్రాను కోరినట్టు పింకీ తెలిపింది. 'నా తండ్రి ఇప్పటికే మంత్రిని కలిసి మాట్లాడారు. నేను కూడా మంత్రిని కలిసి పరిస్థితి వివరించాను. దీనిపై విచారణ జరపాలను కోరాను. నా సహచరురాలు చేసిన ఆరోపణలన్నీ అబద్ధం. ఆమెకు కూడా పరీక్షలు నిర్వహించమని పోలీసులను కోరితే వారు నిరాకరిస్తున్నారు' అని పింకీ పేర్కొంది. పోలీసులు తనను ఎం దుకు వేధిస్తున్నారో తెలీడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బెయిల్‌పై ఉదయం 10 గంటలకు విడుదలైన పింకీ.. తన ఇంటి తాళాలిమ్మని పోలీసులను అడగ్గా.. తొలుత తమ వద్ద లేవని చెప్పిన పోలీసులు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంటి తలుపులు తెరిచారు.

Asian Games gold medalist Pinki Pramanik released from jail

అత్యాచారం ఆరోపణలతో కేసు పెట్టిన రూమ్మేట్ బ్లాక్‌మెయిల్ చేస్తోందని పింకీ చెప్పింది. 'నా ఫొటోలను చూపిస్తూ.. నన్ను ఈ కేసులో ఇరికించిన నా రూమ్మేట్ ఇప్పటికీ బ్లాక్‌మెయిల్ చేస్తోంది' అని పింకీ పేర్కొంది. తనపై వచ్చిన ఆరోపణలపై వైద్య పరీక్షలు జరపకుండానే జైలుకు పంపారని.. 26 రోజుల జైలు జీవితాన్ని తానెన్నటికీ మరచిపోలేనని పింకీ చెప్పింది. తన న్యాయవాదితో కలిసి తదుపరి చర్యలపై చర్చిస్తానని తెలిపింది. లింగ నిర్ధారణ పరీక్షకు సంబంధించిన పింకీ నగ్న వీడియోను కొందరు యూ ట్యూబ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. పింకీ లింగ నిర్ధారణ వివాదం కేసు తుది దశకు వచ్చింది. పింకీలో పురుష లక్షణాలు అధికంగా ఉన్నట్టు, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ఓ వైద్యుడు తెలిపారు. అత్యాచార కేసులో అరెస్టయిన పింకీకి కోర్టు ఆదేశాల మేరకు 11 మంది సభ్యుల బృందం క్రోమోజోమ్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసింది. వీటి ఫలితాలను పశ్చిమబెంగాల్‌లోని ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రికి నివేదించారు. వీటిని పరిశీలించిన మెడికల్ బోర్డు పింకీలో ఎక్కువగా పురుష లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించింది. 'మహిళల్లో రెండు x క్రోమోజోమ్‌లు ఉంటాయి. వీటిని 46, xxగా పరిగణిస్తారు. పురుషుల్లో xy క్రోమోజోమ్‌లు ఉంటాయి. 46, xyగా పరిగణిస్తారు. పింకీలో ఎక్కువగా పురుషుల లక్షణాలు ఉన్నట్టు తేలింది. నివేదికను కోర్టుకు సమర్పిస్తాం' అని మెడికల్ బోర్డు సభ్యుడొకరు తెలిపారు. కాగా సాధారణ పురుషుడి మాదిరిగా అతడిలో పూర్తి లక్షణాలు లేవని, ఇలాంటి వ్యక్తి అత్యాచారం చేయడం సాధ్యంకాదని వివరించారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Babu warns tdp on lokesh entry
When prabhu deva got sonakshi sinha drunk  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more