దైవకణం నిర్ధారణకు సాగుతున్న ప్రయోగాల్లో ఇరవైఏళ్లుగా పాలుపంచుకుంటున్నాడు ఒక తెలుగు వ్యక్తి. ఈ మహా ప్రయోగంలో ఇన్నేళ్లుగా తలమునకలయ్యాను. విశ్వవ్యాప్తంగా వందలాదిమంది శాస్త్రవేత్తలతో కలసి ఫలితం కోసం ఉద్విగ్నం గా నిరీక్షించారట. చిరకాలస్వప్నం ఫలించిన అద్భుత తరుణమిది.. కణభౌతిక శాస్త్రం (పార్టికల్ ఫిజిక్స్)లో పరాకాష్టగా పరిగణించదగిన ఈ ఆవిష్కరణ విజ్ఞాన శాస్త్ర ప్రస్థానంలో ఓ ఉత్కృష్ట ఘట్టం. ఇది భవిష్యత్తులో మానవాళి పురోగమనానికి ఊహాతీత రీతిలో దోహదపడుతుంది. నేటి పరిశోధన రేపటి వినూత్న అధ్యయనాలకు నాంది.’ అన్నారు బోసాన్ కణం నిర్ధారణలో భౌతికశాస్త్ర మహామహులతో కలసి పనిచేసిన తెలుగువాడు డాక్టర్ భీశెట్టి సత్యనారాయణ. విశాఖ జిల్లాలోని మునగపాక మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్)లో భౌతిక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మౌలిక పరిశోధనగా చెప్పుకోదగ్గ బోసాన్ కణం ఉనికి నిర్ధారణకు జరిగిన సంక్లిష్ట ప్రయోగాల్లో అనేక మంది భారతీయ శాస్త్రవేత్తలతో కలసి ఆయన పాలుపంచుకున్నారు.
ఇంజినీర్‌గా, భౌతిక శాస్త్రంలో శాస్త్రజ్ఞుడిగా ఉన్న తనకు ఈ ప్రయోగం విభిన్న అనుభూతులను కలిగించిందని ఆయన చెప్పారు. అపరి మిత వేగంతో పయనించే రెండు ప్రోటాన్లను 27 కిలోమీటర్ల పొడవున్న కొలైడర్‌లో ఢీ కొట్టించినప్పుడు వెలువడే కణాల ఉనికిని ఒడిసిపట్టడమే ఈ ప్రయోగంలో ప్రధానాంశమని, ఇందుకు అవసరమైన డిటెక్టర్ల రూపకల్పన, అమెరికలో తాను పాలుపంచుకున్నానని సత్యనారాయణ చెప్పారు. ప్రయోగం జరిగిన జెనీవా ప్రాంతానికి తాను ఎనిమిది సార్లు వెళ్లి వచ్చానని తెలిపారు. ప్రోటాన్లను ఢీ కొట్టించడానికి సంబంధించిన ప్రయోగాల్లో రెండు అంచెలుంటాయని, వీటిలో సీఎం ఎస్ ఘట్టంలో తాము పాల్గొన్నానని తెలిపారు. పార్టికల్ ఫిజిక్స్‌కు సంబంధించి బోసాన్ కణం పరిశోధన వంటిదే మన దేశంలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయని సత్యనారాయణ తెలిపారు. అంతర స్థాయిలో కాకపోయినా ఈ ప్రయోగాన్ని ‘న్యూట్రినో’ కణానికి సంబంధించి చేస్తున్నట్టు తెలిపారు. ఈ పరిశోధనను ఐఎన్‌ఓగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. రూ. 1300 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రయోగానికి పదేళ్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఐదారేళ్లలో ఈ పరిశోధనల ప్రథమ ఘట్టం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more