ఆయన అపాయింట్ మెంట్ కోసం రాజకీయ నాయకులు ఎదురుచూస్తుంటారు. అవకాశం ఏ రూపంలో వస్తుందో అని రాజకీయ నాయకులు ఆశగా ఎదురు చూస్తుంటారు. అలాంటి అవకాశం ఒక పండగ రూపంలో వారికి వచ్చింది. ఒకేసారి రాజకీయ నాయకులకు అపాయింట్ మెంట్లు ఇవ్వటం జరిగింది. అడిగిన వారికి అగినట్లు అపాయింట్ మెంట్లు ఇచ్చుకుంటూ అందర్ని కలుస్తున్నారు. ఆ రాజకీయ నాయకులు చెప్పె మాటలు ఓపిగ్గా వింటూ .. తన ధోరణిలో ఆ యువ నాయకుడు ఉన్నాడని సీనియర్ నాయకులు అంటున్నారు.
ఆయన ఎవరో కాదు ఏఐసీసీ ప్రదాన కార్యదర్శి రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకుల్లో అడిగిన వారందరికీ అపాయింట్ మెంట్లు ఇస్తూ వారితో సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. మొన్న పాలడగు వెంకట్రావు కు నాలుగో తేదీన సమయం ఇవ్వగా.. ఆయన వెళ్లలేకపోయారు. మరోసారి కలవాలంటూ ఆయనకు రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డికి సమయం ఇచ్చినా.. సర్థుబాటు కాకా వాయిదా పడినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే చిరంజీవి గ్రూపు నుండి వచ్చిన రాయలసీమకు చెందిన ఒక నాయకుడితోనూ వారం కిందట రాహుల్ గాంధీ సమవేశం అయినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. రాష్ట్ర నాయకులతో జరుగుతున్న సమావేశల్లో రాహుల్ గాంధీ ప్రధానంగా తెలంగాణ అంశంతో పాటు పార్టీ బలోపేతం గురించి అడుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? రాష్ట్రంలో ఇతర సమస్యల పరిస్థితి ఏమిటి? అనే దానిపై నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
అయితే రాహుల్ గాంధీకి అనుకోని షాక్ తగిలింది. ‘జనం మన వెంట లేరు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా నిలబెట్టుకోగల్గిన సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం శరవేగంగా కోల్పోతోంది. కాబట్టి వచ్చేసారి మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోక తప్పదు’’ అని నంద్యాల కాంగ్రెస్ ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీతో కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. రాహుల్ పిలుపు మేరకు ఎస్పీవై రెడ్డి ఆయన్ను కలిశారు. ఉప ఎన్నికల్లో పరాభవానికి కారణాలు, భవిష్యత్తులో పార్టీ అవకాశాలు తదితరాలపై రాహుల్ 40 నిమిషాల పాటు ఆరా తీసినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌పై ఉన్న అభిమానం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే బట్వాడా అయిందని ఎస్పీవై స్పష్టం చేశారు. వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు సామాన్యులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయాన్ని కూడా రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more