అనుకున్న హీరో కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది చెప్పాండి? ఆ అనుభూతి గురించి చెప్పటానికి మాటలు దొరకటం చాలా కష్టం. ఇక్కడ అలాంటిదే ఒకటి జరిగింది. పపంచానికే హీరో అయిన టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఆటను టీవీలో వీక్షిస్తేనే ఎంతో ఉత్తేజానికి లోనవుతాం! మరలాంటిది సచిన్‌తో కలిసి ఫొటో దిగితే.. మాస్టర్‌తో కలిసి లంచ్ చేస్తే.. దిగ్గజ ఆటగాడితో క్రికెట్ ఆడితే.. అతనితో పిచ్చాపాటి మాట్లాడితే.. అబ్బో ఆ థ్రిల్లే వేరులే. మరలాంటి మధురానుభూతిని మన తెలుగు తేజం దక్కించుకుందంటే గొప్ప విషయమే కదా మరి! ఆ అదృష్టమే మెదక్ జిల్లా జిన్నారంనకు చెందిన సుష్మ అనే ఇంటర్ విద్యార్థిని దక్కించుకుంది.సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బూస్ట్ సంస్థ నిర్వహించిన ఓ ఎస్ఎంఎస్ పోటీలో విజేతగా నిలిచిన సుష్మ లెజెండరీ ఆటగాడిని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం కొట్టేసింది. దేశవ్యాప్తంగా పది మంది ఎంపికవగా, రాష్ట్రం నుంచి సుష్మ మాత్రమే ఆ అదృష్టాన్ని చేజిక్కించుకుంది.
ఇటీవల చెన్నయ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సుష్మ మాస్టర్‌ను కలుసుకుంది. రోజంతా వీళ్లతో సరదాగా గడిపిన మాస్టర్ వారి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చాడు. అనంతరం సుష్మ సహా ఇతర విద్యార్థినులకు బూస్ట్ లోగోతోకూడిన బ్యాట్లను అందజేశాడు. చిన్నప్పటి నుంచి సచిన్ ఆటను అమితంగా ఇష్టపడే తనకు మాస్టర్‌ను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం రావడం గొప్ప అనుభూతినిచ్చిందని సుష్మ తెలిపింది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చెప్పింది. సచిన్‌ను కలవడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొం ది. సచిన్‌ను కలుసుకోవాలన్న కల ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదని సుష్మ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more