Bjp party support to ys jagan

BJP party support to YS Jagan, YSR congress party and BJP Party, YS Jagan , BJP MP, Support

BJP party support to YS Jagan

BJP.gif

Posted: 05/29/2012 05:49 PM IST
Bjp party support to ys jagan

BJP party support to YS Jagan

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు .. కొత్త మిత్రుడు దొరికాడు. ఆపదలో ఆదుకున్నావాడే అసలైన మిత్రుడు అని చెబుతుంటారు. అలాంటి జగన్ విషయం రుజువైనట్లు తెలుస్తుంది. జగన్ అరెస్ట్ ను ఖండిస్తూ.. జగన్ పూర్తి మద్దతు పలికింది ఒక జాతీయ పార్టీ . ఆ పార్టీ మద్దతు దొరకటంతో .. జగన్ కూడా కొంచెం ఆనందంలో ఉన్నాడని జైలు అధికారులు అంటున్నారు.

ఎట్టకేలకు జగన్‌కు ఓ జాతీయ పార్టీ అండ దొరికింది. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడనే సూత్రాన్ని బీజేపీ అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ను వ్యతిరేకించినందుకే జగన్‌ను అరెస్టు చేశారని బీజేపీ ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ ఆరోపించారు. సీబీఐ విచారణపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, అయితే కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న వారిపైన మాత్రమే విచారణలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

అక్రమాస్తులు ఉన్నాయంటూ ఆయనపై కేసులు పెట్టారు.. కానీ జగన్ తండ్రి వైఎస్ హయాంలో జీవోలు జారీ చేసిన ఎనిమిది మంత్రులు ప్రస్తుత కిరణ్ ప్రభుత్వంలో కూడా ఉన్నారు అని గుర్తు చేశారు. వారిపై చర్యలు తీసుకోకుండా జగన్‌నే లక్ష్యంగా చేసుకోవటాన్ని చూస్తే సీబీఐ చర్యలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్రంలో కూడా.. తమను వ్యతిరేకించే వారిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీబీఐని ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్న ముఖ్యమంత్రి తన కేబినెట్‌లోని కళంకిత మంత్రులపై చట్టం తనపని తాను ఎందుకు చేసుకుపోవట్లేదో చెప్పాలని కోరారు. కాగా తెలంగాణ అంశానికి, ఆ అంశంపై పోరాడే పార్టీలకు బీజేపీ మద్దతుగా నిలుస్తుందని రూడీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు ప్రజాదరణ పెరుగుతుండటంతో, కాంగ్రెస్ నాయకులు జగన్‌వైపు వెళుతుండటంతో ఆ రాజకీయ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సీబీఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని బీజేపీ ఎంపీ బల్బీర్ పుంజ్ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shane warne and elizabeth hurley enjoy a leisurely lunch
Poonam pandey goes nude for shahrukh khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more