Worried indian pregnant with donor sperm

Worried indian pregnant with Donor Sperm,low sperm count, male factor infertility, low morphology, low motility,

Worried indian pregnant with Donor Sperm

Sperm.gif

Posted: 05/19/2012 12:00 PM IST
Worried indian pregnant with donor sperm

Worried indian pregnant with Donor Sperm

ఇందుకోసం ఈ సంస్థకు చాలా పెద్ద నెట్‌వర్కే ఉంటుంది. అండాలుగానీ, వీర్యకణాలుగానీ.. సేకరించే ముందు చాలా విషయాల్ని ఆ సంస్థ నిర్వాహకులు పరిగణనలోకి తీసుకుంటారు. 'అండాలు కావాలి' అంటూ.. ఉక్రెయిన్, లిథువేనియా, జార్జియా, ఆర్మేనియా, బెలారస్ లాంటి తూర్పు యూరప్ దేశాల్లో ఆన్‌లైన్‌లో ప్రకటనలద్వారా ప్రచారం చేస్తారు. అందుకు సిద్ధపడి వచ్చే మహిళలకు తెలివితేటలు (ఐక్యూ), ఆరోగ్య పరీక్షలు నిర్వహించి జన్యుపరంగా అన్నివిధాలా ఆరోగ్యవంతులని తేలిన తర్వాత మాత్రమే వారినుంచి అం డాలు సేకరిస్తారు. ఇదేమీ అంత సులభం కాదు.పుట్టబోయే బిడ్డకు అందమైన నీలి రంగు కళ్లుండాలి! ఐన్‌స్టీన్‌కున్నన్ని తెలివితేటలుండాలి! ..పాశ్చాత్యదేశాల్లో డబ్బు జబ్బు బాగా ముదిరిన కొన్ని జంటల స్వలింగ సంపర్కుల కోర్కెలివి. ఇలాంటి కోర్కెలెన్నింటినైనా వైజాక్స్ సంస్థ భేషుగ్గా తీర్చగలదు. "విదేశీయులు అచ్చం తమలాగానే ఉండే పిల్లలు కావాలని కోరుకుంటారు. అలాగే.. ఇక్కడి సంతాన సాఫల్య కేంద్రాల్లో అండం ఫలదీకరణం చెందించడం వారికిష్టం ఉండదు. వారి కోరికలన్నిటినీ తీర్చడమే మా ధ్యేయం. అందుకే.. అండాన్ని విదేశాల్లోనే సేకరిస్తాం. ఫలదీకరణం అమెరికాలో జరుపుతాం'' అని ఆ సంస్థ నిర్వాహకులు చెబుతారు.

Worried indian pregnant with Donor Sperm

ఆయా మహిళలను అమెరికాలోని క్యాలిఫోర్నియాకో, బోస్టన్‌కో తరలిస్తారు. అక్కడ వారికి మత్తుమందు ఇచ్చి సుదీర్ఘ ప్రక్రియ అనంతరం అండాన్ని సేకరిస్తారు. ఒక్కో అండానికీ వారికిచ్చే సొమ్ము మన కరెన్సీలో అక్షరాలా రూ.64 వేలకు పైమాటే!! ఇంత కష్టం ఎందుకంటే.. అండాలను అప్పటికప్పుడు సేకరించాల్సిందే తప్ప వాటిని నిల్వచేయడం కుదరదు కాబట్టి. వెంటనే ఆ అండాలను అమెరికాలోని స్పెర్మ్ బ్యాంకుల నుంచి సేకరించిన వీర్యకణాల సాయంతో ఫలదీకరణం చెందిస్తారు. ఆడ/మగ.. ఎవరు కావాలంటే వారిని టెస్ట్‌ట్యూబ్ విధానం ద్వారా పొందే వీలు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో చట్ట సమ్మతమే. అండాలను అక్కడే ఫలదీకరించడానికి ఇది మరో కారణం. మొత్తానికి అలా తయారైన పిండాలను మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ద్రవరూప నైట్రోజన్‌లో భద్రపరిచి 8 వేల మైళ్ల దూరంలోని ఇండియాకు తరలిస్తారు. నిజానికి అమెరికాలోనూ గర్భాన్ని అద్దెకిచ్చే వారు దొరుకుతారు. కానీ.. ఖర్చెక్కువ! అదే భారత్‌లో అయితే కారుచౌక!! ప్రపంచంలో మరే దేశంలోనూ అమ్మకడుపు ఇంత చౌకగా దొరకదు. దొరికినా ఇన్ని సౌకర్యాలు, వైద్యు లు, పరికరాలు అందుబాటులో ఉండే అవకాశం తక్కువ. కాబట్టి.. తర్వాతి సీన్ భారతదేశానికి మారుతుంది.

Worried indian pregnant with Donor Sperm

రూ.3,50,000.. పదేళ్లపాటు ఉద్యోగం చేసినా వెనకేయలేని సొమ్ము! తొమ్మిదినెలలపాటు వేరొకరి బిడ్డను తమ కడుపులో మోస్తే చాలు. పైగా ఆ తొమ్మిదినెలలూ కూడు, గూడు, సంరక్షణ అన్నీ వాళ్లే చూసుకుంటారు. ఇంతకంటే కావాల్సిందేముంది!! ఇదే మన దేశంలోని చాలామంది పేద మహిళలను ఆకర్షిస్తున్న అంశం. భర్త చనిపోయినవారు.. విడాకులు తీసుకున్నవారు.. ఇలా ఎందరో స్త్రీలు సరగసీ నెట్‌వర్క్‌లో భాగమవుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేని దుస్థితిలో భార్యాభర్తలిద్దరూ కలిసే ఈ నిర్ణయం తీసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి. "నవమాసాలూ మోసి, కన్న బిడ్డపై మీకు ఏ మమకారం ఉండదా?'' అని ప్రశ్నిస్తే.. "పుట్టిన పిల్లలను మాకు కనీసం చూపించరు. ఇక వారిపై ప్రేమ ఎలా ఉంటుంది'' అంటారు వారు నిర్వేదంగా. ఆ మాటలు అంటున్నప్పుడు వారి కళ్లల్లో కనిపించే తడి.. ఆవే దన... ఇవి చాలు వారి మనసేంటో చెప్పడానికి. కానీ, ఇక్కడ భావోద్వేగాలు ఏ మాత్రం పనికిరావు. ఇలాంటి సరగసీ సంస్థల నిర్వాహ కులు ఎవరైనా ఇవే మాటల్ని కరాఖండీగా చెబుతారు. "పుట్టిన బిడ్డను అప్పగించడానికి వారు మానసికంగా సిద్ధంగా ఉంటారు. వాళ్ల డబ్బు వాళ్లకి.. పుట్టిన బిడ్డ కోరుకున్నవారికి. అంతే'' అని కచ్చితంగా మాట్లాడతారు.

Worried indian pregnant with Donor Sperm

నిజానికి.. సరగసీ విధానం ద్వారా కోరుకున్న లక్షణాలను గల బిడ్డల్ని పుట్టించే సరగసీ సంస్థలు అందుకోసం పుచ్చుకునే సొమ్ము దాదాపు రూ.64 లక్షలు. మనకిది చాలా పెద్ద మొత్తమేమోగానీ.. ఇదే స్థాయి సదుపాయాలతో బిడ్డను పొందడానికి అమెరికాలో ఇంతకు ఐదింతలు ఎక్కువ అవసరం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఈ విధానంలో బిడ్డను పొందాలనుకున్నా వారికి ముందుగా గుర్తొచ్చేది భారతదేశమే. ఇందులో విషాదమేంటంటే.. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసే తల్లులకు ఇందులో దక్కేది కేవలం రూ.మూడు నుంచి మూడున్నర లక్షలే!! గ్లోబలైజేషన్.. గ్లోబలైజేషన్.. అనుకుంటాంగానీ.. నిజంగా ప్రపంచంలో అసలైన ప్రపంచీకరణఇక్కడే కనిపిస్తుంది! తూర్పు యూరప్ దేశ మహిళ అండం.. అమెరికా పురుషుడి వీర్యం.. భారతీయ మహిళ గర్భం..! ఇందులో ఎన్నో కష్టాలు. మార్గాంతరం లేదా అంటే.. ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో చిన్నారులు అనాథలుగా దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. అమ్మానాన్నల ప్రేమకోసం తపిస్తున్నారు. వారి గోడు ఎవరికీ అక్కర్లేదు. అందరికీ 'డిజైనర్ బేబీ'లే కావాలి! అలాంటివారి భావాలు మారేదాకా.. అద్దెగర్భాల వ్యాపారం మూడు పువ్వులూ.. ఆరుకాయల చందమే!!

Worried indian pregnant with Donor Sperm

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kirti azad demands ipl shut shop
Salman khan shocked with gabbar singh craze  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more