తెలంగాణ కోసం కేసిఆర్ కొత్తగా త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఢిల్లీలో కొన్ని రోజుల నుండి అమ్మ దర్శనం కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నాడట. ఈ సారి కేసిఆర్ చేసే త్యాగంతో తెలంగాణ వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు తన మానస పుత్రికైన టీఆర్ఎస్‌ను పణంగా పెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు అటు కాంగ్రెస్‌తో పాటు.. ఇటు యూపీఏ సర్కారు సిద్ధంగా లేదన్న సంకేతాలు స్పష్టంగా వస్తున్న తరుణంలో టీఆర్ఎస్‌ను విలీనం చేసేందుకు ఆయన సమ్మతించినట్టు ఢిల్లీలో ఊహాగానాలు వినొస్తున్నాయి.
గత 11 రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఉన్న కేసీఆర్... కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో తన ఆప్తులతో రహస్య రాయబారం నడిపిస్తున్నట్టు వినికిడి. ఇందులో భాగంగా.. ఆయన తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను పంపినట్టు సమాచారం.
అందువల్లే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్శింహలను అంతర్గత పంచాయతీ పేరుతో తెలంగాణ ఏర్పాటుపై చర్చించినట్టు తెలుస్తోంది.
అయితే, తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో పార్టీ మనుగడ పూర్తిగా కోల్పోయినట్టేనన్న భావను కొందరు నేతలు వ్యక్తం చేశారు. అలాగే, తెలంగాణ ఇవ్వకుంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ కోలుకోలేదని కూడా వారే చెపుతున్నారు. మొత్తం మీద ఇటీవల వెల్లడైన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కళ్లు తెరిపించినట్టుగా భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more