దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి వదులు కొని, పులివెందుల ఉప ఎన్నికలో పరాజయం పాలై, రాజ్యసభ టికెట్ ఆశించి భంగపడిన వైఎస్ వివేకానందరెడ్డి ఇప్పుడు రాయలసీమ సమ స్యలపై పోరాటాన్ని తలకెత్తుకున్నారు. శ్రీ వేంకటే శ్వర, శ్రీకృష్ణ దేవరాయ, యోగి వేమన సహా సీమ జిల్లాలలోని వర్సిటీల విద్యార్థులు ఢిల్లీలో రాయలసీమ సమస్యలపై ప్రారంభించిన రెండు రోజుల రిలే నిరశన దీక్షలకు సంఘీభావం ప్రకటించటం ద్వారా వివేకా ఈ పోరాటాన్ని ప్రారంభించారు. రాజకీయంగా కాంగ్రెస్ నాయకత్వం తనను సాంబారులో కరివే పాకులా తీసి పారేసిందన్న బాధతో ఉన్న వివేకా, పార్టీ నాయకు లందరికీ దూరంగా ఉంటూ వస్తున్నారు.
స్వయంగా రెండు పర్యాయాలు అధినేత్రి సోనియా గాంధీని కలసినా, సీఎంతో మాట్లాడినా, పీసీసీ అధ్యక్షుడు బొత్సతో సంప్రదింపులు జరిపినా రాజ్యసభ టికెట్ రాకపోవటంతో వివేకా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒకవైపు తనను కుటుంబానికి దూరం చేసి, జగన్‌తో వైరం ఏర్పడేలా చేసి, మరోవైపు తనను ఏమాత్రం పట్టించుకోవటం లేదని తన సన్నిహితులతో వివేకా చెబుతూ వస్తున్నారు. ఈ నేప థ్యంలో ఆయనకు సీమ విద్యార్థుల ఆందోళన కలసి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని, వెనుకబడిన రాయలసీమ ప్రాంతాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని రాష్ట్ర మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆ ప్రాంత విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు న్యూఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద రెండు రోజుల ధర్నాను ప్రారంభించారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ఏర్పడగా, నిజాం పాలనలోని ప్రాంతాలు కూడా కలవటంతో ఆంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని, అందుకే తెలంగాణ ప్రజలు అభివృద్ధి కోరటం లేదని చెప్పారు. కేవలం రాయలసీమ ప్రజలు మాత్రమే అభివృద్ధికి దూరంగా ఉన్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంలో నలుగురు అన్నదమ్ములుంటే.. ఒకరు మాత్రమే బాగుపడ్డారని, బాగుపడిన వారు విడిపోయి వేరు కాపురం పెట్టుకుంటామంటే కుదరదని స్పష్టం చేశారు.
కుటుంబంలోని మిగిలిన అన్నదమ్ములు కూడా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే వెనుకబాటుకు గురైన ప్రాంతం రాయలసీమేనని, ఇక్కడ సాగు నీరు లేక ఏడాదికి ఒక్క పంటకూడా రైతులు పండించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ గాలేరు-నగరి, హంద్రి-నీవా, పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, తుంగభద్ర సమాంతర కాలువ, రాజోలి రిజర్వాయర్ తదితర అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ అకస్మికంగా చనిపోవటంతో, ఆయన తలపెట్టిన ప్రాజెక్టుల్లో కొన్ని ఆగిపోగా, కొన్నింటి పనులు నిదానంగా సాగుతున్నాయని వివరించారు. పోలవరం, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులు పూర్తయ్యి, రాష్ట్రంలో నదుల అనుసంధానం జరిగితే సాగునీటి జలాల పంపిణీ సమస్య పరిష్కారం జరుగుతుందని పేర్కొన్నారు.
దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం గల జిల్లాల్లో అనంతపురం.. రెండో జిల్లాగా నిలచిందని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితోపాటు ప్రాంతీయ అసమానతలు రూపుమాయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించారని తెలిపారు. జలయజ్ఞం పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామన్నారు. రెండురోజుల దీక్ష అనంతరం ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులను కలసి, వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. బ్రహ్మణి స్టీల్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అలాగే రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ కర్మాగారాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more