అత్యధిక కాలం అధికారంలో ఉన్నా.. ఈ మూడు దశాబ్దాల్లో ఎన్నో ఎత్తు పల్లాలు.. మరెన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. మరి టీడీపీ భవిష్యత్ ఎలా ఉంటుంది? తెలంగాణలో తెలుగు వెలుగు సాధ్యమేనా? అటు.. సీమాంధ్రలో పార్టీ సిచ్యువేషన్ ఏంటి? రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన పార్టీ.. ఇప్పుడే మలుపులో ఉంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలుగు దేశం నాయకులను, క్యాడర్ ను పట్టి పీడిస్తున్నాయి.
వరుస ఓటములు ఆ పార్టీలో మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒక వైపు తెలంగాణ సెంటిమెంట్..మరో వైపు వైఎస్ పై సానుభూతి ఈ రెండు 2014లో కూడా తెలుగుదేశానికి అధికారాన్ని దూరం చేస్తాయేమోనని ఆ పార్టీ భయపడుతోంది.. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు బాబు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. కానీ తాను గతంలో చేసిన ప్రకటనలే బాబుకు శాపాలై వెంటాడుతున్నాయి.. తెలంగాణలో బాబును విలన్ చేసి చూపెట్టేందుకు టీఆర్ఎస్ కూడా సర్వ శక్తులు ఒడ్డుతోంది.
తెలంగాణ సెంటిమెంట్ ఆ పార్టీకి బాగా కలిసివస్తుంది.. అయితే తెలుగుదేశం కూడా ఇప్పుడు తెలంగాణలో తన క్యాడర్ ను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు కొంతమేర సక్సెస్ అవుతున్నా.. అనుకున్న స్థాయిలో అవి వర్క్ అవుట్ కాకపోవడంతో ఆ పార్టీ డీలా పడుతోంది.తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పాత్ర కూడా ఇక ముందు బాగా పెరగాలని టీడీపీ అధినేత తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు సూచిస్తున్నారు.పార్లమెంటులో కూడా పార్టీ తరపున తెలంగాణ వాదం వినిపించాలని టీ టీడీపీ నిర్ణయించింది.
ఇక ముందు టీఆర్ఎస్ పై కూడా విమర్శల వర్షం కురిపిస్తూనే.. పార్టీని కాపాడుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని భావిస్తోంది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం.. విద్యార్ధుల కేసుల ఎత్తివేతపై కూడా ఉద్యమాలు చేయాలని టీడీపీ భావిస్తోంది. ఉప ఎన్నికల ఫలితాల్లో టీడీపీ దెబ్బ తిన్నా.. టీఆర్ఎస్ భారీ మెజార్టీలు సాధించకపోవడం.. ఆపార్టీకి పెద్ద ఊరట అనే చెప్పాలి. గత ఉప ఎన్నికలతో పోలిస్తే.. ఎంతో కొంత టీడీపీ మెరుగుపడిందనే భావన పార్టీలో ఉంది.
ఇక ముందు తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం మరింత చురుకుగా వ్యవహరించాలనే యోచనలో ఉంది.అయితే తెలుగుదేశంపై తెలంగాణ ప్రజలకు మరింత నమ్మకం కలిగించాలి ఆ నమ్మకాన్ని బట్టే తెలంగాణలో టీడీపీ భవిష్యత్ ఆధారపడి ఉంది. తెలంగాణలో కేసీఆర్ తెలుగుదేశాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుంటే..అటు సీమాంధ్రలో జగన్ టీడీపీపై పై పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సానుభూతే అస్త్రంగా రంగంలోకి దిగిన జగన్ ను నిలువరించి.. తెలుగుదేశం పూర్వ వైభవం పొందటానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. రానున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటి జగన్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది. జగన్ పై వచ్చిన అవినీతి ఆరోపణలే టీడీపీ తన అస్త్రాలుగా మార్చుకుని.. రానున్న ఉప ఎన్నికల్లో రంగంలోకి దిగనుంది.ఇక టీడీపీలో కూడా యువతకే పెద్ద పీట వేయాలని బాబు భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో యువతకు అధిక ప్రాథాన్యం ఇచ్చి.. వారికే ఎక్కువగా పార్టీ టిక్కెట్లు కేటాయించాలని భావిస్తోంది. దీంతో పాటు బాబు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూత్ తోనే ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇది పార్టీకి ఎంతో ప్లస్ అవుతుందని టీడీపీ లెక్కలు కడుతోంది. సీమాంధ్రలో కాంగ్రెస్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లు చీలి అది తెలుగుదేశానికి లాభిస్తుందని ఆ పార్టీ నేతలు అంచానా వేస్తున్నారు.
జగన్ పార్టీ ప్రభావాన్ని తగ్గించగలిగితే.. సీమాంధ్రలో తెలుగుదేశానికి తిరుగుండదనేది తెలుగుదేశం అంచనా.. అందుకే ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ కంటే జగన్ టార్గట్ గా వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయి. బాబు ఎంత వరకు జగన్ ను నిలువరించడంలో సక్సెస్ అవుతారనేది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more