ఇదేదో వింత వ్యాపారం... అని అనుకోకండి... బిజినెస్ చేయాలనుకునే వాడు ప్రతిదాన్ని ఓ బిజినెస్ గానే చూస్తాడు. విడాకులకును కూడా వ్యాపారంగా మార్చుకొని డబ్బులు సంపాదించేస్తున్నారు..సాధారణంగా భార్య భర్తల మనస్పర్థలు వస్తాయి. అవి కాస్త మితిమీరి క్షిణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల అవి కాస్త విడాలకుల వరకు వస్తాయి. తప్పని పరిస్థితితులలో కొందరు విడాకులు తీసుకుంటారు. మరి వేద మంత్రాల సాక్షిగా మెడలో మూడుముళ్ళు వేయించుకొని చివరి వరకు కలిసిసుండక విడాకులు తీసుకునే వారి సంఖ్య నేటి సమాజంలో ఎక్కువైందని చెప్పనక్కర్లేదు. భార్య భర్తలకు విడాకులు మంజూరు చేసేది కోర్టు. ఏ కేసు అయినా కోర్టులో వెస్తే అది ఓ సంవత్సరం వరకు తెగదు. అంతదాకా కూడా ఆగని కొందరు భార్య భర్తలు ఉంటారు. వారిని ఆసరాగా కూడా చేసుకొని కొందరు బిజినెస్ చేస్తున్నారు. ఆ విడాకుల వ్యాపారం ఏ దేశంలో చేస్తున్నారని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి....
సాధారణంగా భార్యభర్తలిద్దరి అంగీకారంతో విడాకులు తీసుకోవాలంటే బ్రిటన్ లో మూడు నుండి ఐయిదు నెలల సమయం పడుతుందట. దాంతో 4,500 పౌండ్లు ( సుమారు రూ. 3.4 లక్షలు) చెల్లిస్తే 24 గంటల్లో విడాకులు మంజూరు చేయిస్తాం’ అంటూ స్థానికంగా వ్యాపారం ప్రారభించిందట ‘క్విక్ డైవర్స్’ యూకే కంపెని. కాకపోతే విడాకులు కావాలనుకునే దంపతుల్లో ఒకరు కంపెనీ ఉద్యోగితో పాటు ‘డొమినికన రిపబ్లిక్’కు వెళ్ళాలట. (అక్కడ కోర్టులు ఒక్కరోజులోనే విడాకులు మంజూరు చేస్తాయట. ఆ తీర్పు బ్రిటన్ లోనూ చెల్లుతుంది) మరొకరు విడాకుల మీద సంతకం పెడితే చాలు. ఇక విమాన ప్రయాణాలు, హోటల్ సదుపాయం, అక్కడ న్యాయవాది కొర్టుకు అయ్యే ఖర్చులన్నింటినీ ఆ కంపెనీయే భరిస్తుందట. అక్కడ ఆ కంపెనీకి ప్రస్తుతం కస్టమర్ల రద్దీ బాగానే ఉందట.ఏ అవకాశం దొరికినా దాన్ని బిజినెస్ గా మార్చుకొని బ్రతికేసేవాళ్లకు ఇది మంచి ఐడియాలాంటిదని అనుకుంటున్నారు.
మరి భవిష్యత్తులో మన ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో ...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more