ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ముందుకు వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ యువనేత అఖిలేష్ యాదవ్‌ను మైసూరు విశ్వవిద్యాలయం గుర్తు చేసుకుంటోంది. బంతి తగిలి ఆయన ముక్కు పగిలిన సన్నివేశాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు. ఎస్‌జెసిఇ మైదానంలో ఆడుతున్నప్పుడు బంతి నేరుగా అఖిలేష్ ముఖానికి తగిలిందని, అప్పటి నుంచి ఆ ముక్కు అలాగే ఉందని, మైసూరును గుర్తు చేసుకున్నప్పుడు అఖిలేష్ చేయి అనుకోకుండానే ముక్కుపైకి వెళ్తుందని రోహిల్‌ఖండ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, ఎస్‌జెసిఇలో ఆయన సీనియర్ కరుణ అంటున్నారు. దెబ్బ తగిలిన ముక్కుకు సర్జరీ చేయించుకోవద్దని వైద్యులు అఖిలేష్‌కు సలహా ఇచ్చినట్లు కూడా ఆయన తెలిపారు.
ఇక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు అఖిలేష్ ముక్కుకు దెబ్బ తగలిందని గుర్తుంది గానీ అది ఎలా జరిగిందో గుర్తు లేదని వైస్ ప్రిన్సిపాల్ షాకిబ్ ఉర్ రహ్మాన్ అన్నారు. అఖిలేష్‌కు ఓపెన్ జీపు ఉండేదని, తాను బస్సు స్టాపులో నిరీక్షిస్తున్నప్పుడు అటుగా వస్తే తనను వొంటికొప్పల్‌లోని తన ఇంటి వద్ద జీపులో వదిలేసేవాడని కరుణ చెప్పారు. తమ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని, ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి కలుసుకుంటామని ఆయన చెప్పారు.
బరేలీకి వస్తే తనను తప్పకుండా అఖిలేష్ కలుసుకుంటాడని, తమ చర్చంతా కాలేజీ రోజుల గురించే సాగుతుందని, చివరి సారి ఎన్నికల ప్రచారం కోసం వచ్చారని, తీరిక లేకుండా ఉన్నప్పటికీ తనతో అర గంట సేపు గడిపారని ఆయన గుర్తు చేసుకున్నారు.
.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more