జగన్ పర్యటన అంటే .. జనం కొన్ని వేల మంది .. వస్తారని .. సాక్షి పేపరు, సాక్షి ఛానల్ .. ఉకదంపుడుగా ప్రచారం చేస్తున్నారు. అది ఒక టౌవును .. ఆ రోజు జగన్ ఒదార్పుయాత్ర జరుగుతుంది. ఆ ఒదార్పు యాత్రం 10 వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారని .. జగన్ కు సంబందించిన మీడియా, పేపర్లలో వస్తాయి. కానీ మిగత ఏ తెలుగు పేపర్ కానీ, టీవీ ఛానల్లో గానీ ఈ న్యూస్ ఉండదు, రాదు . కారణం జగన్ మీడియాకే తెలుసు. 1000 మంది ఉన్న గ్రామంలో కూడా .. జగన్ పర్యటిస్తే.. 10 వేల మంది ప్రజలు వచ్చినట్లు సాక్షి పేపర్ లో ఫోటోలు ఉంటాయి. ఇక సాక్షి ఛానల్ అయితే.. గంటల కొద్ది .. అదే ప్రచారాన్ని సాగదీస్తు .. ఉదయం నుంచి సాయంత్రం వరకు .. ప్రచారం చేస్తుంది. ఇలా ఎన్ని రోజులు చేస్తారు? ఏదో ఒక రోజు ప్రజలకు తెలియకుండ ఉంటుందా? అంటే .. అలాంటిది జరగకుండా .. సంవత్సరం రోజులు జగన్ మీడియా జాగ్రత్త పడింది.
అదే జిల్లా... అదే ప్రాంతం... అదే జగన్! 'ఓదార్పు' సభలు, రోడ్‌షోలలో జనం కళకళ! ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన రోడ్‌షోలు జనంలేక వెలవెల! నెల్లూరు జిల్లా కోవూరు ఉపఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్‌షోకు జనం కరువయ్యారు. జగన్ ఉదయం నుంచి రాత్రి వరకు కొడవలూరు మండలంలో పర్యటించారు. 18 చోట్ల ప్రచార సభలు ఏర్పాటు చేశారు. కొడవలూరు, తలమంచి, గండవరం తదితర సభలకు జనం బాగానే కనిపించారు. మిగిలిన సభలు మాత్రం జనంలేక పలుచనయ్యాయి. గుండాలమ్మపాళెంలో ఇరవై ముప్పై మంది కూడా కనిపించలేదు.
కొడవలూరు మండలంలో జగన్ 2010 ఆఖర్లో జరిపిన ఓదార్పు యాత్రకు జనం భారీగా 'హాజరయ్యారు'. కానీ... నాటి రోడ్‌షోలు మాత్రం జనంలేక వెలవెలబోయాయి. 30 నుంచి 40 వాహనాలతో జరిగే కాన్వాయ్‌లే 'ఓదార్పు' విజయ రహస్యమని... ఎన్నికల ప్రచారంలో అన్నేసి వాహనాలు పాల్గొనేందుకు వీల్లేకపోవడంతో 'అసలు జనం' బయటపడ్డారని రాజకీయ ప్రత్యర్థులు చెబుతున్నారు. అప్పటికీ... 'కోడ్' కంట పడకుండా 50 నుంచి 60 ద్విచక్ర వాహనాల్లో జగన్ అభిమానులు అనుసరిస్తూ, స్థానికుల్లో కలిసిపోయి జనం తరలివచ్చారనే 'కలరింగ్' ఇస్తున్నారని కూడా చెబుతున్నారు.
రాత్రి 10 గంటలు దాటిన తర్వాత రాజుపాలెంలో బహిరంగసభకు జగన్ వస్తుండగా... ఎన్నికల అధికారి పోలీసులను వెంటబెట్టుకుని జగన్‌ను ఆపారు. దీంతో జగన్ పార్టీ నేతలు, ఎన్నికల అధికారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు జగన్ కాన్వాయ్‌ను అధికారులు ఇందుకుపేట మండలం జగదేవిపేటకు పంపారు. అలాగే... కాన్వాయ్‌లో పరిమితికి మించి ఉన్న ఒక ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రాబోయే ఉప ఎన్నికలపైనా జగన్ దృష్టి సారించారు. నెల్లూరు లోక్‌సభ స్థానానికీ ప్రచారం ప్రారంభించారు. "లోక్‌సభకు ఉప ఎన్నికల్లో మేకపాటి పోటీ చేస్తారు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డికి, అప్పుడు మేకపాటికి ఓటు వేసి గెలిపించండి'' అని ప్రజలను కోరారు. అరెస్టుపై ఊహాగానాలు ముమ్మరం కావడంతో... భవిష్యత్తులో ప్రచారానికి వస్తానో, లేనో అనే ఆందోళనతోనే జగన్ ఆ ప్రస్తావన తెచ్చి ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అయితే పాపం .. ఎక్కవ రోజు .. ఉండదు కాబట్టి... ఈ రోజు జగన్ ప్రచారం రహస్య పాపం బట్టబయులైంది. అదీ ప్రతి పక్ష పార్టీ అయిన తెలుగు దేశం వారికి జగన్ మీడియా రహస్యం దొరికింది. ఎలా అంటే.. ఉప ఎన్నికల నిమిత్తం కోవూరు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పర్యటన సాగింది.. అయితే వైఎస్ జగన్ పర్యటన చేస్తున్న గ్రామంలో.. మొత్తం జనాభ 1000 మంది ఉంటారట. కానీ వైఎస్ జగన్ పర్యటనకు.. 10000 వేల మంది జనం వచ్చినట్లు .. జగన్ మీడియా ప్రచారం చేసిందని .. టీడీపి వారు అంటున్నారు. అసలు ఇంత మంది ఎలా వచ్చారు అంటే.. జగన్ తన కాన్యాయ్ తో పాటు 100 కార్లలలో .. కొన్ని వందల మంది ప్రజలను ..జగన్ ప్రచారం కోసం అద్దె కు జగన్ వెంట తెచ్చుకుంటున్నారని టీడీపి నాయకులు అంటున్నారు. ఒక్కొక్క మనిషికి .. రోజుకు అద్దె .. ఒక ప్యాకెట్ బిర్యాని.. 500 రూపాయాలు.., మందు ఇస్తున్నారని .. టీడీపీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more