ఇదో మద్యం మాయా ప్రపంచం . కూటికి లేని నిరుపేద కోట్లు పెట్టి మద్యం దుకాణాలను సొంతం చేసుకుంటాడు. తెల్లకార్డు ఉన్న పేదవాడు మద్యం మాఫియాగా దుకాణాన్ని నడిపిస్తుంటాడు. ఇందిరమ్మ ఇల్లు కోసం అర్రులు చాచే మరో పేద రోజూ లక్షల రూపాయాల మద్యం వ్యాపారం చేస్తుంటాడు. చిన్న సంస్థల్లో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి కోట్ల సిండికేట్లకు ఆద్యుడిగా ఉంటాడు. ఇదంతా వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన విజయనగరంలో ఈ మద్యం మాయాజూదం విచ్చల విడిగా నడుస్తోంది. అసలు వీరంతా ఎవరు? ఎవరికి బినామీలు..? ఇలాంటి లీకులు పేపర్ కు ఎలా వస్తున్నాయి.? ఎవరు లీక్ చేస్తున్నారు? అసలు దీని వెనక ఉన్నది ఎవరు?
విజయనగరం జిల్లాలో మద్యం షాపుల దందాపై ఈనాడు ఆసక్తికరమైన కధనాన్ని ఇచ్చింది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిన స్టోన్ క్రషర్స్ , తదితర సంస్థలలో పనిచేసేవారి పేరిట మద్యం షాపులు ఉన్న వైనంపై ఈ కధనం సాగింది.మజ్జి శ్రీనివాసరావు అనే వ్యక్తి 7.9 లక్షల తో ఒక మద్యం షాపును వేలంపాటలో కొనుగోలు చేశారు. అయితే ఈయనకు మంచి భవనం ఉంది. అయినా ఈయన భార్య పేరుతో తెల్ల రేషన్ కార్డు ఉంది. పైగా ఈయన బొత్స సత్యనారాయణ కు చెందిన సత్య క్రషర్స్ లో పనిచేస్తున్నారు.విజయనగరం పట్టణంలో పన్నెండు మద్యం షాపులు ఉంటే అందులో పదకుండు షాపులు బొత్స కంపెనీలలో పనిచేస్తున్న వారి పేరుతోనే ఉన్నవి కావడం విశేషంగా కనిపిస్తుంది.
మరో వ్యక్తి లక్ష్మణరావు. ఈయనకు పెంకుటిల్లు ఉంది. ఈయన కూడా బొత్స స్టోన్ క్రషర్ లోనే పనిచేస్తున్నారు.ఈయన పేరుతో కూడా ఒక వైన్ షాపు ఉంది. విజయనగరంలో తక్కువ ధరకు షాపులు వేలంలో పాడుకోవడం కూడా ఒక ప్రత్యేకత అని కధనం చెబుతోంది. ముఖ్యమంత్రి శిబిరం ఈ వివరాలను లీక్ చేసిందో, లేక ఈనాడు ప్రత్యేక పరిశోధన చేసిందో తెలియదు కాని బొత్స సత్యనారాయణకు ఇది షాక్ ఇచ్చే కధనమే అవుతుంది.
ముఖ్యమంత్రి ఆఫీస్ నుండి లీక్ చేసినట్లు తెలుస్తుంది. ఈ లీక్ వెనుక కిరణ్ హస్తం ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సీఎంకు బొత్సకు కొన్ని నెలల నుండి ఇద్దరికి మాటలు కుదరని విషయం తెలిసిందే.. బొత్సను ఎలాగైన.. దెబ్బతీయ్యాలని కిరణ్ గ్రూప్ రాజకీయాలు చేస్తు..ఇలా సిక్రేట్ గా.. తన శత్రు వర్గాన్ని మీడియాకు పట్టిస్తున్నాడని గాంధీ భవనంలో అనుకుంటున్నారు. గతంలో.. బొత్స ..చిరుకు దగ్గరైనప్పుడు.. సీఎం వెంటనే దాసరి నారయణ రావు ను తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరళ ఇప్పుడు .. బొత్స దాసరికి జై అనటంతో.. కిరణ్.. తెర వెనక పనులకు స్పీడ్ పెంచినట్లు తెలుస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా బొత్స పై కిరణ్ ఎదురు దాడి చేయించిన విషయం తెలిసిందే.. ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండకూడదని .. తెలంగాణ నాయకులున రెచ్చిగొట్టి బొత్స పై తెలంగాణ నాయకులును పంపించాడని .. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మొత్తం కిరణ్ తన దారికి అడ్డు ఉన్న వారిని ఇలా తప్పిస్తున్నాడని.. గాంధీభవనంలో కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
ఇదిలాఉండగా.. బినామీల పేరుతో బొత్స సంపాదించిన లిక్కర్ షాపుల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్‌లోని ఆయన ప్రత్యర్ధులకు బ్రహ్మాస్త్రంలా పరిణమించింది. పార్టీ అధ్యక్షుడు అయి ఉండీ బినామీలతో షాపులు నడిపిస్తూ పార్టీ ప్రతిష్ఠను మంటగలిపారన్న భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. బొత్స సిండికేట్లకు నేతృత్వం వహిస్తున్నారని, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లిక్కర్ సిండికేట్లు ఆయన కనుసన్నలోనే కొనసాగుతున్నాయన్న ఆరోపణలతో ఇప్పటికే పార్టీ భ్రష్టుపట్టిందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొత్స భాగస్వామ్యం, జోక్యానికి సంబంధించి ఏసీబీ దాడుల వివరాలను ముఖ్యమంత్రి ఢిల్లీకి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more