గత కొంతకాలం వరకూ చిరంజీవితో చెట్టపట్టాలు వేసుకుని, ఆయనను మెప్పించేందుకు తాపత్రయపడిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పుడు రూటు మార్చారా? చిరంజీవి బదులు ఆయనంటే గిట్టని దాసరి నారాయణరావును తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? తనకు దూరమైతే చిరుకు రాజకీయ భవితవ్యం ఉండదని బొత్స పరోక్ష హెచ్చరిక సంకేతమా? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల మర్మం ఇదేనని పార్టీ వర్గాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి. పార్టీ వర్గాలు చెబుతున్న ప్రకారం.. ఇంతకాలం చిరంజీవి కరుణా కటాక్ష వీక్షణాల కోసం పరితపించిన సత్తిబాబు చాలావరకూ తన ప్రయత్నాల్లో సఫలమయ్యారు.
చిరంజీవి రాష్ట్రంలో ఉంటే సీఎం రేసులో తనకు ఎక్కడ పోటీ ఉంటారోనన్న ముందు జాగ్రత్తతో ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ చాలారోజులు ఢిల్లీలో కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ తిరిగారు. చాలాకాలం చిరంజీవితో కలసి తిరిగి, ఆయనకు తానున్నానన్న భ్రమలు కల్పించిన బొత్సకు, చిరంజీవి కూడా చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, బొత్స తనను అడ్డుపెట్టుకుని అధిష్ఠానం వద్ద తన పలుకుబడి పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను చిరు గ్రహించారు. సీఎం కిరణ్‌తో దూరంగా ఉండటం రాజకీయంగా తనకు నష్టమేనని తెలుసుకున్న చిరంజీవి.. క్రమంగా సీఎంకు దగ్గరకావడం ప్రారంభించడం, అటు కిరణ్ కూడా చిరుకు దూరంగా ఉండటం వల్ల తనకూ నష్టమేనని భావించి, ఆయన కూడా చిరుతో సన్నిహితంగా వ్యవహరించడం మొదలుపెట్టారు.
దీనితో చిరును అడ్డుపెట్టుకుని సీఎం పీఠం ఎక్కాలన్న బొత్స పథకం అడ్డం తిరిగినట్టయింది. దీనితో రూటు మార్చిన బొత్స ఇప్పుడు చిరంజీవి పొడ గిట్టని దాసరి నారాయణను తెరపైకి తీసుకువచ్చే వ్యూహానికి పదునుపెడుతున్నట్లు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాసరి స్థానంలో చిరంజీవికి రాజ్యసభ ఇస్తారట కదా అన్న మీడియా ప్రశ్నకు ‘అలా ఒకరిని తొలగించి, అది మరొకరికి ఇవ్వడం అనేది ఉండదు.
దాసరి మళ్లీ కొనసాగుతారు. కొనసాగాలని భావిసున్నా’నని బొత్స చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించింది. కాపు వర్గానికి చెందిన దాసరిని కొనసాగిస్తూనే అదే వర్గానికి చెందిన చిరంజీవికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారన్న విషయం బొత్సకు తెలియదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దాసరి స్థానంలోనే చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాలని తెలిసినప్పటికీ, బొత్స కావాలనే దాసరి మళ్లీ కొనసాగుతారని వ్యాఖ్యానించడం బట్టి.. తనతో ఉండకపోతే చిరంజీవి రాజకీయ భవితవ్యం ఉండదని, తన దారికి రాకపోతే ప్రత్యర్థిని తయారుచేస్తానన్న హెచ్చరిక సంకేతంతో చిరుకు చెక్ పెట్టాలన్న వ్యూహం కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more