Nagarjuna political entry in soon

Nagarjuna Political Entry In Soon,Akkineni Nagarjuna Political Entry,akkineni nagarjuna politics entry statement news,He announced in Tirupathi,nagarjuna political entry speech in tirupathy news videos statement,Nagarjuna Political Entry Statement,Nagarjuna politics news photos videos latest updartes,Nagarjuna which political party will join,which party will nagarjuna join

Nagarjuna Political Entry In Soon

Nagarjuna.gif

Posted: 03/02/2012 01:12 PM IST
Nagarjuna political entry in soon

Nagarjuna Political Entry In Soon

నాగార్జున పొలిటికల్ కింగ్ అవుతాడా.. సిల్వర్ స్క్రీన్ మన్మధుడి గ్లామర్.. పాలిటిక్సులోవర్కవుటౌతుందా.. రాజన్న సొంత పార్టీ పెడతాడా.. లేక ఏదైనా పార్టీలో చేరతాడా.. చేరితే..ఎందులో ఎంట్రీ ఇస్తాడు.. ఇప్పుడిదే హాట్‌ టాపిక్. రాజకీయ ప్రవేశంపై నాగ్ చేసిన సంచలనవ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

రాజకీయాలపై అక్కినేని నాగార్జున మనసులో మాట బయటపెట్టారు. పాలిటిక్స్‌లో మార్పులు గమనిస్తుంటానని చెప్పారు. అయితే తాను రాజకీయాలకు సరిపోతానో లేదో మాత్రం తనకు తెలియదన్నారు. తిరుపతిలో ఓ జ్యువెల్లర్స్‌ను ప్రారంభించిన నాగార్జున రాజకీయాలు, సినిమాలపై మాట్లాడారు. షిరిడీసాయి బాబా ఆధ్యాత్మిక చిత్రంలో నియమ నిష్టలతో నటిస్తున్నట్లు తెలిపారు. సినిమాల్లోకి రావడం, క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అఖిల్‌ ఇష్టమని ఆయన మనసులో మాటను బయటపెట్టారు.

ఎంతవరకు సక్సెస్?

సినీ స్టార్లు రాజకీయ నేతలుగా ఫేస్ టర్నింగు ఇచ్చుకోవడం కొత్తేమీ కాదు. మహానటుడు ఎన్టీఆర్ పొలిటికల్‌గా సక్సెసయిన తర్వాత ఆయన ఒరవడిలో అనేక మంది రాజకీయ అరంగేట్రం చేసారు. అందులో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా కూడా పనిచేశారు. కృష్ణ, కృష్ణంరాజు, జమున, శారద, మోహన్ బాబు, మురళీ మోహన్, బాబూమోహన్, విజయ శాంతి, తదితరులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కొంతమేర ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అటు బాలకృష్ణ కూడా టీడీపీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా గత ఎన్నికల్లో విస్తృతంగా పార్టీకి ప్రచారం చేసి తన ఛరిష్మా చాటుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజా తనవంతు సేవలందిస్తున్నారు.

తాజాగా యువసామ్రాట్ నాగార్జున వంతు వచ్చింది. తనకు రాజకీయాలంటే అంతులేని ఆసక్తి ఉందని, పాలిటిక్స్‌ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటానని నిశితంగా గమనిస్తుంటానని చెప్పారు. ఐతే.. తాను రాజకీయాలకు ఫిట్‌ అవుతానా లేదా అనేది తెలియదన్నారు. దీంతో పరోక్షంగా ఈ టాలీవుడ్‌ మన్మధుడు పొలిటికల్ ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నాగార్జునకు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకున్నా అన్ని పార్టీల వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో జన్మభూమికి బాహాటంగా మద్దతు తెలిపారు. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో రిలేషన్స్‌ మెయింటెన్ చేసారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మీడియా ప్రకటనలు కూడా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌తో కూడా నాగ్ కు సత్సంబంధాలు ఉన్నాయి. అటు చిరంజీవితో కూడా ఫ్రెండ్‌షిప్‌, వ్యాపార సంబంధాలు ఉన్నా రాజకీయంగా మాత్రం చిరుకు బాసటగా నిలవలేదు నాగ్‌.

ఒకవేళ నాగ్ రాజకీయాల్లోకొస్తే సొంతంగా పార్టీ పెడతారా? లేక ఏదో ఒక పార్టీలో చేరతారా? అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. చిరంజీవి ఎపిసోడ్ చూసిన తర్వాత అంత సాహసం చేయడని నాగ్‌ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే ఏపార్టీలో చేరతారనేది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్కే. సీఎం కిరణ్‌తో ఆయనకున్న సత్సంబంధాలవల్ల ఎక్కువ శాతం కాంగ్రెస్ కే మద్దతిచ్చే ఛాన్సుందనేది రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అధికారపార్టీ కావడం, తన మిత్రుడు చిరు కూడా అదే పార్టీలో ఉండడం కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు.

మొత్తం మీద సినిమాలలో తనదైన స్టైల్లో దూసుకుపోయిన నాగ్..రాజకీయాలలో కింగ్ కాగలుగుతారా..లేదా అనేది ఆసక్తిగా మారింది. సక్సెస్ ఫుల్ సినీ స్టార్ గా, బిజినెస్ మేన్‌గా పేరు తెచ్చుకున్న నాగ్ రాజకీయాల్లో నూ రాణిస్తారని అభిమానులు అంచనా వేస్తున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari narayana rao botsa satyanarayana
Id m gopikrishna has been posted as additional director appa replacing rajiv trivedi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more