రాహుల్ గాంధీ – వరుణ్ గాంధీలు .. త్వరలో కలిసి పార్టీ ప్రచారం చేస్తారని తెలుస్తుంది. వరుణ్ గాంధీ భాజపాలో ప్రాభవాన్ని కోల్పోతున్నారని తెలుస్తుంది. యూపీ ఎన్నికలలో ఆయనకు పార్టీ ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనమని తెలుస్తుంది. గత లోక్ సభ ఎన్నికలలో భాజపా ఎన్నికల ప్రచార బాధ్యతలను వరుణ్ గాంధీ అన్నీ తానై మోశారు. అయితే ఈ సారి శాసనసభ ఎన్నికలకు వరుణ్ గాంధీనే పార్టీ దూరంగా ఉంచిందని అంటున్నారు. వరుణ్ కీలక హోదాల్లో ఉన్నవిషయం తెలిసిందే. ఇటు కాంగ్రెస్ లో కూడా రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీలు పార్టీ ప్రచార పగ్గాలు చూపడతారని ఊహించడం సహజం. అయితే వరణ్ గాంధీని సొంత నియోజకవర్గం అయిన ఫిలిబిత్ కే పరిమితం చేయటంతో.. వరుణ్ గాంధీలో మార్పులు చోటు చేసుకున్నాయని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
ఇప్పడు వరుణ్ గాంధీ ప్రచారంలో కొత్త కొత్త మాటాలు వినిపిస్తున్నాయి. వరుణ్ గాంధీ ఇందిరా గాంధీ కుటుంబ వారసత్వాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతున్నారు. వరుణ్ గాంధీ చేసే వ్యాఖ్యలు భాజపాకు మిగుడుపడటం లేదని అంటున్నారు. ఇలాగే 2009 లో కూడా లోక్ సభ ఎన్నికల సమయంలో ముస్లిమలపై వరుణ్ చేసిన వ్యాఖ్యలు పెద్దదుమారాన్నే రేపాయి. అప్పటిలో వరుణ్ గాంధీని జాతీయ భద్రత చట్టం కిందా అరెస్టు చేయటం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు భాజపాకు ఎన్నికలలో భారీ నష్టాన్ని చూపించిందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
అయితే వరుణ్ గాంధీ ఇటీవల పలు సందర్బాలలో తన తండ్రి అయిన సంజాయ్ గాంధీకి కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని పొగుడుతూ.. దేశంలో పారిశ్రామిక పెరుగుదలకు , 1979 తర్వాత కాంగ్రెస్ మళ్లీ కేంద్రంలో పగ్గాలు చేపట్టడానికి తనతండ్రే కారణమని వరుణ్ గాంధీ చేబుతున్నాడు. గతంలో భాజపా నెహ్రూ – గాంధీ కుటుంబంలో చీలికను ఎత్తిచూపడంతో ద్వారా భాజపా రాజకీయంగా లభ్థి పొందిందని వరుణ్ గాంధీ అంటున్నాడు.
వరుణ్ గాంధీ ఇవన్నీ మనస్సులో పెట్టుకొని .. సొంత పార్టీ పైన విమర్శలు చేయటం మొదలు పెట్టాడు. వరుణ్ గాంధీ ఇలానే రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తే పార్టీకి భారీగా నష్టం వస్తుందని భాజపా భయపడుతోందని మీడియా ప్రతినిధులు అంటున్నారు.
వరుణ్ కంచుకోటలో కాంగ్రెస్ అగ్రనేతలెవరు ప్రచారం చేయకపోవడం పై అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇందిరాగాంధీ కుటుంబనికి చెందిన వరుణ్ ఎన్నికల బరిలో లేనందున, భాజపా అభ్యర్థులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ముఖ్యనేతలు స్వేచ్చగా ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాహుల్ – వరుణ్ గాంధీలు కలిసి ప్రచారాం చేసిన ఆశ్చర్యంలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాహుల్ గాంధీ కూడా వరుణ్ ఎలాంటి విమర్శలు చేయకపోవటం కూడా ఇందుకు నిదర్శనమని భాజపా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more