కాంగ్రెస్ అధిష్టానం వైయస్ జగన్ కు బంఫర్ ఆంఫర్ ప్రకటించింది. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో కలిసి పోవటం లేదా జైలుకు వెళ్లటం ..ఏదీ కావాలో నిర్ణయించుకోమని జగన్ కు అధిష్టానం ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఒక పక్క సీబీఐ విచారణ జోరుగా సాగుతూండగా, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఇడి) మాత్రం చాపకింద నీరులా తన పనితాను చేసుకుపోతోంది. ఇప్పటికే జగన్ ఆస్తులకు సంబంధించి ఆయనకు చెందిన కంపెనీలలో సునామీలా వచ్చిపడిన నిధుల ఉప్పెన గురించి కూలంకషంగా వివరాలు సేకరించిన ఇడి.. ఇక జగన్‌ను అరెస్ట్ చేసేందుకే రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల ఆఖరిలో లోపు జగన్ మోహన్ రెడ్డిని ఇడి అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ముఖ్యంగా జగన్ కంపెనీలలో పెట్టుబడులు, విదే శీ నిధుల మళ్లింపు, ఫెరా, ఫెమా చట్ట ఉల్లంఘనలకు సంబంధించి సమగ్ర సాక్ష్యాధారాలతో సిద్దంగా ఉండాలంటూ ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న అధికారులను ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఆదేశించడం ఈ అరెస్ట్ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జగన్ ఆస్తుల కేసులో సీబీఐ విచారణ ప్రారంభించడానికి కొద్దిరోజుల ముందే ఎన్ఫోర్సెమెంట్ డైరక్టరేట్ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అదే సమయంలో ఆదాయపన్ను విభాగం కూడా రంగంలోకి దిగింది.
దీంతో పాటుగా దేశంలోని పరిశ్రమలు, కంపెనీలకు వచ్చే విదేశీ నిధులు, పెట్టుబడులపై నిరంతరం నిఘా ఉంచే రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం కూడా దర్యాప్తు చేపట్టింది. గత ఆరు నెలలుగా ఈ విభాగాలు చేపట్టిన దర్యాప్తులో జగ న్ గ్రూప్ కంపెనీలలో పెట్టుబడుల విషయంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని నిర్దారణకు వచ్చింది. ముఖ్యంగా విదేశీమారక ద్రవ్య పరిమితులు, విదేశీ కంపెనీలనుంచి పెట్టుబడులు స్వీకరించే పద్దతులలో జగన్ గ్రూప్ అనేక అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. దీంతో ఇప్పటికే ఈ విచారణలో బాగంగా జగన్‌తో పాటు ఆయన ప్రతినిధులను పలుమార్లు విచారించిన సీబీఐ ఇక ఫైనల్‌గా జగన్‌ను మరోమారు విచారించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఇందుకోసం మార్చి మొదటివారంలో నోటీసు ఇవ్వనున్నట్లు ఢిల్లీ అధికారుల సమాచారం. అయితే విచారణకు పిలిపించిన సమయంలోనే జగన్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయని బలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఇప్పటికే అన్నిరకాల లిఖితపూర్వక ఆధారాలు (డాక్యుమెంటిరీ ఎవిడెన్స్) సేకరించిందని, ఇక చర్యలు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. మరో పక్క జగన్ కంపెనీలలో పెట్టుబడులకు సంబంధించి విదేశాలకు వెళ్లి విచారించేందుకు సీబీఐ కోర్టునుంచి అనుమతి కూడా పొందడంతో తమవద్ద ఉన్న ఆధారాలతో జగన్‌పై చర్యలు తీసుకోవాలని ఇడి అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ రెండు మూడు రోజుల్లో ఢిల్లీలోని ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ నుంచి జగన్‌కు నోటీసులు జారీ అయ్యే అవకాశాలున్నాయని కొందరు అధికారులంటున్నారు. ‘జగన్ ఆస్తుల కేసులో మాపని మేం చేస్తున్నాం, వాళ్ళపని (ఇడి) వారు చేస్తున్నారు. మాకు అందిన సమాచారం వారికి అందించాం. వారి సమాచారాన్ని మాకు ఇచ్చారు. మాకందిన ఆధారాలను బట్టి మేం చర్యలు తీసుకుంటున్నాం...వాళ్లేం చేస్తారో మాకు చెప్పి చేయరుకదా’ అని సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
కాగా, భద్రతా కారణాలు, రాజకీయ కారణాల దృష్ట్యా జగన్‌ను తీహార్ జైలుకు తరలించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అటు జగన్ శిబిరం కూడా మానసికంగా సిద్ధంగానే ఉండటం ప్రస్తావనార్హం. ‘ జగనన్న తనను ఈడీ అరెస్టు చేస్తుందని చాలారోజుల నుంచే చెబుతున్నారు. దానికి అంతా సిద్ధంగానే ఉన్నాం. ఆయన అరెస్టు తర్వాత సానుభూతి వెల్లువెత్తుతుంద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
ఢిల్లీ నాయకులు మాత్రం జగన్ అరెస్టు కంటే ముందే .. కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతాడని... అందుకోసం అన్ని ప్రయాత్నలు జరుగుతున్నాయని.. జగన్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతే .. తన పై ఉన్న కేసులన్ని ఉపసంహరించుకోవాలనే ఖండిషన్ మీద జగన్ కాంగ్రెస్ కలిసే అవకాశాలు ఉన్నాయాని జగన్ కార్యకర్తలు అంటున్నారు. ఏమైన జగన్ జైలుకు వెళ్లటం కంటే.. అధిష్టానంతో కలిసి.. తన తండ్రి ఆశయాలను .. ప్రజలకు అందించవచ్చుననే అభిప్రాయం కూడా జగన్ మనస్సులో ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
ఒక వేళ జగన్ అరెస్టు అయితే .. ప్రజలలో వచ్చే సానుభూతితో.. పార్టీ విజయం సాధించిన.. ప్రభుత్వం మాత్రం తన చేతిలోకి రాదానే భావం జగన్ లో ఉందని అంటున్నారు. వీటి మనస్సుల పెట్టుకొని .. జగన్ కాంగ్రెస్ కలిసిపోతే.. అటు ప్రజలకు .. ఇటు పార్టీకి మంచిదని .. జగన్ సలహా దారులు అంటున్నారు. ఏమైన ఈ నెల ఆఖరి లోపు జగన్ విషయం తెలిపోనుందని .. ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more