ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న వారే ఎక్కడయినా రాణిస్తారు. అది రాజకీయాలు కావచ్చు. మరొక రంగం కావచ్చు. ఒకనాటి కారు డ్రైవర్లు నేడు మంత్రులు, ఎంపీల వుతున్నారు. ఒకప్పటి ఆఫీసుబాయ్‌లు కూడా ఎమ్మెల్యే లయ్యారు. రైసుమిల్లుల్లో గుమాస్తాలు కూడా ఎమ్మెల్యే లుగా పనిచేశారు. నాడు పీఏలుగా ఉన్న వాళ్లు నేడు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అప్పటి పంచాయితీ స్థాయిలో చోటా మోటా కాంట్రాక్టర్లు నేడు బడా కాంట్రా క్టర్లు, మంత్రులు పనిచేస్తున్నారు.
తెలంగాణ నేత కు పీసీసీ పగ్గాలివ్వాలని దామోదర్‌రెడ్డి ఢిల్లీలో చేసిన లాబీ యింగ్ సత్తిబాబును అభద్రతకు గురిచేస్తోందంటున్నారు. మొన్నటి వరకూ చిట్‌చాట్‌లో సీఎం మీద, ఆయన అనుసరిస్తోన్న విధానాల మీద కామెంట్లు చేసిన సత్తిబాబు, గత కొద్దిరోజుల నుంచి ఎందుకో మౌనవ్రతం పాటిస్తున్నారు. పైగా తన వద్దకు వచ్చిన మీడియాను ఎందుకు వచ్చారు? ఎవరు రమ్మనమన్నారంటూ చిరాకు ప్రదర్శిస్తున్నారు. అయితే, మీడియాపైనా, మీడియా ప్రతినిధులపైనా సత్తిబాబు విమర్శలు కురిపిస్తూ, జర్నలిస్టులను అవమానిస్తున్నా కనీసం దానిని ప్రశ్నించే సాహసం కూడా చేయకపోగా, గాంధీభవన్‌లోని ఇద్దరు, ముగ్గురు మీడియా ఆస్థాన విద్వాంసులు మాత్రం అవన్నీ తమను కాదన్నట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. ఇలాంటి భజనపరులు, ఆత్మాభిమానం లేని వారి వల్లే జర్నలిస్టులకు నేతల వద్ద విలువ లేకుండా పోయిందని మీడియా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇవన్ని ఒక రకం అయితే .. అసెంబ్లీలో సత్తిబాబుక స్పీకర్ షాక్ ఇవ్వటం కొత్తగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
మద్యం సిండికేట్లపై చర్చ జరుగుతున్న సమయంలో కూడా అది ప్రజల కోసం జరుగుతున్న చర్చ కాదని చెప్పి లోపలికి పోకుండా లాబీల్లోనే కాలక్షేపం చేశారు. తాజాగా సభలో జరుగుతున్న చర్చ సమయంలో పైకి లేచి మాట్లాడేందుకు ప్రయత్నించగా, మైక్‌ను స్పీకర్ కట్ చేయడంతో పాపం సత్తిబాబు బిత్తరపోయారు.
కొద్ది సేపు తరువాత స్పీకర్ చర్చ సందర్భంగా మాట్లాడడానికి మంత్రి బొత్స సత్యనారాయణకు అనుమతి ఇచ్చారు. దీంతో, "చాలా మంచి వాతావరణం. ఏడు రోజులుగా ఏది కావాలో గుర్తించారు. 2004కు ముందు.. 2004 తర్వాత..'' అని బొత్స వ్యాఖ్యానించగా స్పీకర్ మళ్లీ అడ్డుపడ్డారు. చర్చను పక్కదారి పట్టించవద్దంటూ మైక్ కట్ చేయబోయారు. వెంటనే సత్తిబాబు "సార్.. నేను చేసేది విమర్శ కాదు.. ఒట్టు' అని అనడంతో సభలో నవ్వులు పూశాయి.
బొత్స కొనసాగిస్తూ "2004కు ముందు సభలో ఎప్పుడూ రాష్ట్రంలో కరువు గురించి చర్చ జరిగేది. 2004 తర్వాత నుంచి గిట్టుబాటు ధర కావాలన్న దానిపైనే చర్చ జరుగుతోంది. దానిని గమనించాలన్నదే నా విన్నపం'' అని చమత్కరించారు. తర్వాత టీడీపీని విమర్శించేలా వ్యాఖ్యలు చేస్తుండగా స్పీకర్ మనోహర్ మైక్ కట్ చేశారు. దీంతో, సత్తిబాబు కంగు తిన్నారని తెలుసు.
అయితే నాదేండ్ల ఇలా చేయటం పై అనేక అనుమనాలు వస్తున్నాయి. స్పీకర్ కావాలనే .. బొత్స మైక్ ను కట్ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. నాదెండ్ల మనోహర్ ను స్పీకర్ గా నియమించింది.. సీఎం కిరణ్ కుమార్ కాబట్టి.. బొత్స కు సీఎంకు ఈ మద్యకాలంలో కొంత విరుదం ఉండటం తెలిసిన విషయమే. స్పీకర్ అది మనస్సులో పెట్టుకొని.. బొత్సకు షాక్ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు గాంధీభవనంలో గుసగుసలాడుకుంటున్నారు.
ఈ షాక్ నుండి సత్తిబాబు తేరుకోవటానికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు సత్తిబాబు మౌనంగా ఉండటమే మంచిదని .. సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. అంతే కాకుండా .. బొత్సకు టైమ్ బాగులేదు కాబట్టి, కేసిఆర్ మాదిరే బొత్స కూడా చంఢీయాగం చేస్తే మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారని బొత్స బంధువులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more