Lord shiva maha shivaratri

Lord Shiva Maha Shivaratri,lord shiva, maha shivaratri, om namah shivaya, shiv pooja, shivaratri pooja, maha shivaratri fast, maha shivaratri pooja, maha shivaratri festivities

Lord Shiva Maha Shivaratri

Lord Shiva.gif

Posted: 02/20/2012 01:40 PM IST
Lord shiva maha shivaratri


Lord Shiva Maha Shivaratri

శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ ఎందుకు చేస్తారు?

Lord Shiva Maha Shivaratri

ఉపవాసం అనే పదంలోనే అసలు అర్థం దాగి ఉంది. ఉప అంటే దగ్గరగా అని, వాసం అంటే నివసించడ మనీ అర్థం. అంటే భగవంతునికి దగ్గరగా నివసించడ మన్నమాట. కడుపు నిండా అన్నం తిన్నవారు భగవంతుని మీద మనసు లగ్నం చేయలేరు. కాబట్టి స్వల్పంగా అల్పాహారాన్ని లేదా పాలు, పండ్లు నీరు వంటి వానటి మాత్రమే తీసుకుంటూ మనస్సును దేవుడి మీద లగ్నం చేయడం కోసమే ఉసవాస దీక్ష ఏర్పడింది. సాక్షాత్తూ ఆ దేవుదేవుడే తన భక్తులను అనుగ్రహించేందుకు భూమి మీద సంచరిస్తుంటే ఆ సమయంలో ఆయన భక్తులమైన మనం గాఢనిద్రలో ఉండటం భావ్యం కాదు కాబట్టి ‘మేమంతా నీ రాకకోసం నిరీక్షిస్తున్నాం’ అనడానికి సంకేతంగా జాగరణ చేయాలి. ఈ జాగరణ భగవంతునిపట్ల ఎరుకకోసం మాత్రమే కానీ ఇతరత్రా లౌకిక వ్యవహారాలలో నిమగ్నం కావడం కోసం మేలుకుని ఉంటే అది జాగరణగా పరిగణింపదగ్గది కాదు.

అభిషేకం అర్చనలెందుకు?

Lord Shiva Maha Shivaratriశివుడు అభిషేకప్రియుడు, బిల్వదళాలు అంటే ఆయనకు అత్యంత ప్రీతి. మారెడు దళాలతో శివుణ్ణి పూజించడం వల్ల కలిగే ఫలమేమిటో బిల్వాష్టకంలో స్పష్టంగా ఉంది. అందుకే ఆయనకు అత్యంత ప్రియమైన పర్వదినమైన శివరాత్రి నాడు అభిషేకం చేసి బిల్వదళాలతో పూజిస్తారు.

శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు?

శివుడు లింగరూపంలో ఉద్భవించినదీ, బ్రహ్మదేవుడు జీవకోటిని సృష్టించడానికి అంకురార్పణ చేసినదీ మాఘబహుళ చతుర్థశి అర్థరాత్రి నాడే. ఈ పవిత్రమైన రోజుకే శివరాత్రి అని పేరు. ఎప్పుడూ లింగరూపంలో ఉండే ఈశ్వరుడు ఆ రూపం నుంచి నిజరూపంలో సాక్షాత్కరించే పవిత్రమైన రోజు. క్షీరసాగర మథనంలో మొదటగా వెలువడిన హాలాహలాన్ని భక్షించి కంఠంలో నిలపుకుని గరల కంఠుడిగా, నీలకంఠుడిగా పేరొందినదీ ఈ రోజే. అందుకే ప్రపంచవ్యాప్తంగా శివభక్తులు ఈ రోజున శివరాత్రి వేడుకలు జరుపుకుంటారు. ఈ రోజు శివుడు అన్ని లింగాలలోనూ ప్రవేశించి ఉంటాడని ప్రతీతి.

శివరాత్రిని ఎలా జరుపుకోవాలి?

Lord Shiva Maha Shivaratriత్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించిన పరమ పవిత్రదినం మహాశివరాత్రి . ఈ దినం సూర్యోదయానికన్న ముందే నిద్రలేచి కాలక్రుత్యాలు తీర్చుకుని శిర:స్నానం చేసి శివ పూజలు, అభిషేకాలు చేయాలి. రోజంతా ఉపవాసవ్రతాన్ని పాటించడంతోపాటు రాత్రంతా జాగరణ చేయాలి. మొదటి జాములో పరమేశ్వరుణ్ణి పాలతో అభిషేకించి, పద్మాలతో పూజించి, పులగంను నైవేద్యంగా సమర్పించాలి. రెండో జాములో పేరుగుతో అభిషేకించి , తులసీదళాలతో పూజించి, పాయసాన్ని నివేదించాలి. మూడవ జాములో నేతితో అభిషేకించి మారేడు దళాలతో పూజించి నువ్వులతో వండిన పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. నాలుగవ జాములో తేనేతో అభిషేకించి పుష్పాలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వీటితో పాటు లింగోద్భవ సమయంలో పూజలు చేయడంతో పాటు శివనామస్మరణంతో రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటి రోజు తిరిగి శివపూజలు చేసి శక్తి మేరకు నైవేద్యం సమర్పించి, భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి.

శివపార్వతులని ఈ జగత్తుకే తల్లిదండ్రులని ఎందుకంటారు?

Lord Shiva Maha Shivaratriజగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా అన్నాడు మహాకవి కాళిదాసు. లౌకిక ద్రుష్టితో చూస్తే లోకంలో ఏ తల్లిదండ్రులైనా సరరే.. మంచివీ బాగు్న వాటినీ .. పిల్లలకిచ్చి తల్లిదండ్రులైన తాము వాళ్ల పుత్రులకంటే తక్కువ స్థాయి కల వాటిని సంతోషంగా స్వీకరిస్తారు. ఈ ద్రుష్టితో ఆలోచించినట్లయితే శివపార్వతుల కళ్యాణం మాఘ బహుళ చదుర్థశినాడు . అందరికీ ఆహ్లాదకరమైన వసంతకాలాన్ని మనకిచ్చి ఆకులు రాలే శిశిరాన్ని తమ వివాహానికి సరైన రుతువుగా నిర్ణయించుకున్నారా దంపతులు. మంచి వెన్నెల కాసే పున్నమిన చిమ్మచీకట్లు కమ్ముకునే బహుళ చతుర్దశిని తాము తీసుకున్నారు. రాత్రి వేళ అయితే అది మనకి ఇచ్చింది. అని భావించి తెల్లవారు జామున మంచూ చలీ దట్టంగా ఉండే మాఘమాసం మంచిదనుకున్నారు ఆ సౌందర్యమూ లేని తుమ్మిపూలే తమ పెళ్లికి చాలనుకున్నారా దంపతులు. చక్కటి సువాసనలిచ్చే చందనాన్ని మన పరం చేసి విభూతిని చాలానుకున్నారు. చివరికి ఊరేగింపుకి ముసలి ఎద్దునీ , అలంకారంగా పాముల్నీ.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ మంచి వాటిని, మేలైన వాటిని పిల్లలకి ఇచ్చి తాము తక్కువ వాటినీ అసౌకర్యం వున్న వాటిని స్వీకరించారు. ఇలా ఉండడమనేది ఒక్క తల్లిదండ్రులకే సాధ్యమైతే – ఈ జగత్తుకు వారిని మించిన తల్లిదండ్రులెవరుంటారు మరి?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Businessman rambabu commit to suicide in hyderabad
Shashikala speaks in jaya favour in court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more