నిన్నటి వరకు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి అలిసి, సొలసి, పోయిన కేసిఆర్ .. ఇక నుండి రాజకీయ నాలుకలు కోసే పనిలో ఉంటానని చెబుతున్నాడు. భారతంలో శకుని మామ వలే కేసిఆర్ పాచికలు వేయగలడు , కురుక్షేత్రం పుట్టింగలడు, వాటిని మరళ ఆర్పగలడు. మాటల రాజకీయ నాయకుడిగా కేసిఆర్ ఎంతో పేరు ఉంది. నిమిషాల్లో నిర్మాణుశ్యం చేయగలడు, అదే నిమిషాలో .. నిప్పు ఆర్పగల శక్తి ఒక కేసిఆర్ మాత్రమే ఉందని అందరి తెలిసిందే. రాజకీయ మేధావి. తిట్లు తిట్టాలన్న కేసిఆరే, ప్రజల చేత తిట్లు తినాలన్న కేసిఆరేకే సాధ్యం. అయితే కేసిఆర్ తెలుగు దేశం పార్టీ అధినేత పై కోత్త పోరు చేయటానికి సిద్దమయ్యడు. నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కేసిఆర్ ఇప్పడు ఆ పార్టీ నాయకుల నాలుకలు కోసే పనిలో బిజీగా ఉంటాడని అంటున్నారు. రేపటి నుంచి బాబు వెంటే పడతా!.. బాబు సంగతి చూస్తానని మీడియా ముందు ప్రకటన కూడా చేశాడు.
కేసిఆర్ నాలుకలు కోసే పనిలో ముందుగా టీ-టీడీపీ నేతలు చంద్రబాబు మూతి నాకే కుక్కలు "అబద్ధానికి పెద్ద కొడుకు చంద్రబాబు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. ఆయన చేసిన పాపాలు గంగా నదిలో మునిగినా.. పన్నీరుతో కడిగినా పోవు. నికృష్టమైన నాయకుడు చంద్రబాబు. విద్రోహంలో హీనమైన గతం ఆయనది. వంచనలో అవినీతి కృష్టుడు. తిమ్మిని బమ్మి చేసే మనిషి. బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో మనుషులను మాయం చేసిన మాయావి. ఆయన బతుకే కుట్రలమయం'' -తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ఈ విధంగా మొదలు పెట్టాడు.కేసీఆర్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఆయన రావటానికి కూడా పెద్ద కారణం ఉందట. పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దయిన నేపథ్యంలో. తెలంగాణ భవన్‌లో ఆయన చంద్రబాబుపై తిట్ల పురాణం ఎత్తుకున్నారు. "ఇంకా పిచ్చి కూతలు కూస్తే నాలుక చీరేస్తాం.. జాగ్రత్త!'' అంటూ టీడీపీ నేతలను హెచ్చరించారు. పోలవరం టెండర్ల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు టీడీపీ వారి మీద పరువునష్టం దావా వేస్తామని ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. "టీడీపీ కుక్కలు నిన్నటిదాకా పోలవరం టెండర్లపై సొల్లు కూతలు కూశాయి. కానీ.. టెండర్లు రద్దయ్యాయి. ఇప్పుడు వాళ్లు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? బట్ట కాల్చి మీదేసి.. గోబెల్స్ ప్రచారం చేసి.. కుక్కలకంటే హీనంగా పిచ్చి కూతలు కూస్తే అయిపోతుందా?'' అని కేసీఆర్ రెచ్చిపోయారు. అయితే "రేపటి నుంచి నీ వెంటే పడతాం. నీ బాగోతాలు.. కుంభకోణాలు.. చరిత్ర మొత్తం బయటపెడతాం. మీ సంగతి చూస్తాం'' అంటూ చంద్రబాబును సవాల్ విసిరారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులకు కారణమయ్యాడు. విద్యుత్ చార్జీల పెంపును నిరసించిన వారిపై కాల్పులు జరిపించి ముగ్గురిని పొట్టనబెట్టుకున్న నరరూప రాక్షసుడు. అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన నీచుడు. తెలంగాణ ఆస్తులు, కంపెనీలను తెగనమ్మిన నయవంచకుడు. నకిలీ స్టాంపుల కుంభకోణం, అర్బన్ బ్యాంకుల కుంభకోణం, స్కాలర్‌షిప్‌ల కుంభకోణం, పనికి ఆహార పథకంలో అక్రమాలు, మద్యం కుంభకోణం, నీరు-మీరు పథకంలో అవినీతి.. ఇలా ఎన్నో కుంభకోణాలు ఆ ప్రబుద్ధుడి హయాంలోనే జరిగాయని కేసిఆర్ పూరణం చదువుతూ ఎమ్మార్‌లో ఆయన కుటుంబం విల్లాలు పొందలేదా? ఒకటి బాలకృష్ణ భార్యది, మరొకటి చంద్రబాబు కోడలుది.. ఇదీ వారి చరిత్ర'' అని దుయ్యబట్టారు. "రెండు ఎకరాలున్న చంద్రబాబు తల్లి తన మనవడికి రూ.30 లక్షల పెట్టి జూబ్లీహిల్స్‌లో 5 ఎకరాల భూమి కొని ఇస్తుందా? తప్పుడు పత్రాలు.. లెక్కలు చూపి తప్పించుకుంటావా చంద్రబాబు? పొద్దున లేస్తే బినామీ బాగోతం నీదిదని ఆయాసంతో అంటున్నాడు.
అంతే కాకుండా వచ్చిన తెలంగాణను ఆపింది నువ్వు కాదా? తెలంగాణకు వ్యతిరేకంగా కుట్ర చేసింది నువ్వే కదా ? అయినా పెద్దనోరు పెట్టుకొని మాట్లాడితే అయిపోతుందా ?'"ఏనుగు వెళ్తుంటే పిచ్చి కుక్కలు ఎన్నో మొరుగుతాయని ఇన్ని రోజులు చూసీచూడనట్టు పోయినం. చచ్చిన పామును ఇంకా చంపుడెందుకని ఊరుకుంటుంటే.. చెప్పిందే చెప్పుకొంటూ పోతున్నరు. ఇకపై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే.. నాలుకలు కోసేస్తాం.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి జాగ్రత్త! అబిడ్స్‌లో మీ ముక్కు భూమికి రాస్తారా ? ఆర్ యూ రెడీ ?.. చంద్రబాబు చెంపలేసుకొని క్షమాపణ చెపుతాడా? టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాడా? అయినా ఈ లఫంగి మాటలు ఎందుకు?'' అని 'దేశం' నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
"పోలవరం ప్రాజెక్టు టెండర్ పొందింది ఎవడో నాకు తెలియదు. అది కమ్మోళ్లు 1950 కంటే ముందు పెట్టుకున్న కంపెనీ. ఎవడో బోడిగానికి టెండర్ వస్తే మోకాలికి బొడిగుండుకు ముడిపెట్టినట్లు దాంతో నాకు సంబంధం అంటగడతారా?'' అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పుకునే చంద్రబాబు.. బతుకేందని ప్రశ్నించారు. "చంద్రబాబూ.. నీ అక్రమాలపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. వద్దంటూ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లావు ? నువ్వో పెద్ద మానిప్యులేటర్‌వి. న్యాయ పరీక్షకు ఒక్కసారైనా నిలబడ్డావా?'' అని నిలదీశారు. ఈ సన్నాసులు (టీడీపీ తెలంగాణ నేతలు) చంద్రబాబు మూతి నాకే కుక్కలు. సకల జనుల సమ్మె సమయంలో ఏ ఫ్రిజ్‌లో.. ఎక్కడ పండావ్ చంద్రబాబూ ?..సెల్‌ఫోన్లు నువ్వే తెచ్చావా ? సీఎంగా ఉన్నప్పుడు ఇట్లనే మాట్లాడితే.. సింగపూర్ ఆర్థిక మంత్రి అలాంటి వాళ్లను మా దగ్గరైతే పిచ్చాస్పత్రిలో చేర్చుతామని లేకపోతే ఉరి తీస్తామని చెప్పారు. గుర్తు లేదా?'' అని అన్నారు. టీడీపీ అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. 'దొంగల ముఠా బండే' అని చెప్పారు. ఆ పార్టీది పైరవీలు, టెండర్ల చరిత్ర అయితే తమది ఉద్యమాల చరిత్ర అని అన్నారు. తమకు టెండర్ అంటే ఏమిటో..అది ఎలా వేస్తారో కూడా తెలియదని చెప్పారు. కార్పొరేట్ పైరవీలు, టెండర్ సెటిల్‌మెంట్లతో బతుకుతున్నది టీడీపీ వాళ్లేనని, తమకు అటువంటి సంబంధాలులేవని అన్నారు.
"చంద్రబాబూ చాలెంజ్ చేస్తున్నా.. రాబోయే ఉప ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ నీ పార్టీకి డిపాజిట్ రాదు. నిన్ననే సర్వే రిపోర్ట్ వచ్చింది. ఒక్కో స్థానంలో 5వేల నమూనాలతో సర్వే చేయించాను. టీడీపీకి ప్రతి చోటా 10 శాతంలోపే ఓట్లు. 7,8,9 శాతం ఓట్లు వస్తే మహా ఎక్కువ. అప్పుడు నీ బతుకు ఎందో తేలుతుంది కదా?'' అని వ్యాఖ్యానించారు. ఉన్నతమైన ప్రజాకోర్టులోనే తేల్చుకుందాం..రా ! అంటూ చంద్రబాబుకు సవాల్ చేశారు. "తెలంగాణపై నువ్వు కుడి వైపా? ఎడమ వైపా? చెప్పు'' అని నిలదీశారు. చేసిన తప్పులకు టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలని, ఇప్పటికైనా మాజీ సీఎంగా చంద్రబాబు హుందాగా వ్యవహరించాలని కేసీఆర్ కోరారు.
"తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే అర్హత ఈ సొల్లుగాళ్లకు ఉందా ? శవాల మీద ప్రమాణాలు చేసిన పారిపోయిన దద్దమ్మలు వాళ్లు. ఎవరో కొంత మంది నకిలీ.. డూప్లికేట్‌గాళ్లను తెచ్చి.. వాళ్లే అమరవీరుల కుటుంబాలంటే నమ్ముతారా? అసలు అమరవీరుల కుటుంబాలు తెలంగాణ ద్రోహుల పార్టీ కార్యాలయానికి వెళ్తాయా?'' అని ప్రశ్నల వర్షం కురిపించారు. "తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నది మేం. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల వరకు కూడా ఇచ్చాం. కాని, ఎక్కడా చెప్పలేదు. చెబితే అమర వీరులను అవమానించినట్టే. వారి మరణానికి వెలకట్టినట్టే. ఈ దరిద్రులా.. లోఫర్‌గాళ్లా.. అమరుల కుటుంబాలను ఆదుకునేది?'' అని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
"ఉప ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటూ రాదు. కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు. అయినా మళ్లీ అధికారంలోకి వస్తానని చంద్రబాబు పగటి కల కంటున్నారు. ఛీ..పో..అని ప్రజలు ఉమ్మేస్తున్నా..లుచ్ఛా దందా చేస్తున్నారు. జావగారిపోతున్నా గోచీ కాపాడుకోవటానికి యత్నిస్తున్నారు'' అని విరుచుకుపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more