ఇప్పడు దేశంలో అన్ని రాష్ట్రాలు .. ఆంధ్రప్రదేశ్ రాజకీయల బాటలోనే నడుస్తున్నాయి. ఏ రాష్ట్రా రాజకీయ నాయకుడైన .. ఆంధ్ర రాజకీయాలను ఉపయోగించుకుంటున్నారట. స్వయన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్య దర్శి రాహుల్ గాంధీ ఆంద్రప్రదేశ్ ను ఆదర్శంగా తీసుకోమని చెబుతున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లా అభివృద్ధి చేస్తామని పార్టీ ప్రధాన కార్య దర్శి రాహుల్‌గాంధీ చెబుతూ.. ఇందుకు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధిని గురించి కూడా వారికి చెబుతున్నాడట. గిరిజనులు ఎక్కువగా ఉన్న మీర్జాపూర్‌లో ఒక ఎన్నికల సభలో రాహుల్ చెప్పాడని మీడియా ప్రతినిధులు అంటున్నారు. ‘60 శాతం మించి ఎప్పుడు ఓట్లు పోలైనా, ప్రజలు మార్పు కోరుతున్నారనడానికి సూచన. ఉత్తరప్రదేశ్‌లో పది జిల్లాల్లోని 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 62 నుంచి 64 శాతం ఓట్లు పోల య్యాయి. ఇది మార్పునకు సంకేతం రాహుల్ భావిస్తున్నారట. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి గురించి వారికి రాహుల్ గాంధీ వివరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఉత్తరప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్‌లా అభివృద్ధి చెందుతుందన్నారు. ‘కాంగ్రె స్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అమెరికా, ఇంగ్లాండ్‌ల్ని తలదన్నేలా అభివృద్ధి చెందిందని. ఆ దేశాల్లో నిరు ద్యోగులు ఉద్యోగాలకోసం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. అంతే కాకుండా ఆ రాష్ట్రంలోకి దేశ, విదేశీ పెట్టుబడులతో అనేక పరిశ్రమలు వస్తున్నాయి’ అని రాహుల్ ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉదహరించారు. ‘ఉత్తరప్రదేశ్‌లో మంచికోసం మార్పు కోరేట్టయితే, కాంగ్రెస్‌కు ఓటేయాలి. ఒకవేళ బహుజన సమాజ్ పార్టీని (బీఎస్పీ), సమాజ్‌వాదీ (ఎస్‌పి) ని కోరుకుంటే గూండాలు, అవి నీతికి దన్నుగా నిలుస్తున్నారని అర్థం’ అని రాహుల్ గాంధీ ఆ సభలో చెప్పాటం వారేకే బాగుందని.. అసలు ఆంద్ర ప్రదేశ్ నుండి ఏమీ ఆదర్శంగా తీసుకోవాలో రాహుల్ వారికి వివరించి చెప్పాలేదని .. మీడియా ప్రతినిధులు అంటున్నారు.
అయితే అక్కడు సినీయర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం.. ఆంధ్ర ప్రదేశ్ .. కాంగ్రెస్ పరిపాలన చేపట్టిన దగ్గర నుండి రాష్ట్రం రావణా ఖాష్టంలా మారిపోయింది. ఎందుకంటే .. ప్రత్యేక రాష్ట్రం కోసం .. తెలంగాణ ప్రజలు పోరాటలు, ఉద్యమాలు, గొడవలు , కుంభకోణాలతో, ఇప్పటికి రగిలిపోతుంది, అంతే కాకుండా పెద్ద పెద్ద వీవీఐలు మొత్తం చంచల్ గూడ జైల్లో కొత్త జీవితం అనుభవిస్తున్నారు, ఇలా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను రాహుల్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎలా అన్నాడో అక్కడ ఎవ్వరి అర్థం కాలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ప్రతిపక్ష నాయకులు అయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే.. ఏపీలో అభివృద్ధి అనేది .. ఆగిపోయి ఇప్పటికి కొన్ని సంవత్సరాలైందని , అక్కడ అంత గొడవలు, భారీ కుంభకోణాలు, పదవి కోసం కోట్టుకోవటం, ముఖ్యమంత్రులు మారిపోవటం అలాంటివి తెలిసి కూడా రాహుల్ యూపీని ఏపీలా చేస్తానని అన్నాడంటే.. యూపీలో మరో ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమాలు , గొడవలు ,బంద్ లు చేయమని అర్థం కాబోలు అని ప్రతిపక్షలు నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more