రాష్ట్ర మంత్రివర్గంలోకి కొత్త ముగ్గురు మంత్రులను తీసుకున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి శాఖల కేటాయింపులలో స్వల్పమార్పులు చేశారు. ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మా వద్ద అదనంగా ఉన్న వ్యవసాయశాఖను గృహనిర్మాణ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇన్నాళ్లు కన్నా లక్ష్మీనారాయణ చూసిన గృహ నిర్మాణ శాఖను కేటాయించారు. ముఖ్యమంత్రితో ఇటీవల కాలంలో విభేదిస్తు వస్తున్న మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వద్దనున్న వైద్య ఆరోగ్య, 104, 108 సర్వీసులను మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొండ్రు మురళికి అప్పగించారు. శంకర్రావు నిర్వహించిన జౌళీ, చేనేత శాఖలను అదే సామాజికవర్గం నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ప్రసాద్‌రావుకు కేటాయించారు. సీఎం ఇలా చేయటం వెనక పెద్ద కారణం ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
కిరణ్ ముఖ్య మంత్రి పదవి చేపట్టినప్పటి నుండి .. కాంగ్రెస్ నాయకులలో అంతర యుద్దం జరుగుతుందని తెలుసు. అయితే కొంత మంది మాత్రం బయటి ప్రపంచానికి తెలిసేలా శత్రువులు అయి, ముఖ ముఖిగానే యుద్దం చేయటం మొదలు పెట్టారు. వారిలో బొత్స , ఢి ఎల్, శంకర్ రావు తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారని తెలుసు. అయితే తెర మీద వీరి పేర్లు రావటంతో.. కిరణ్ వీరికి ఎలాగైన చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కొత్త ప్లాన్లు వేస్తున్నాడని .. సీనియర్ నాయకులు అంటున్నారు.ముందుగా .. దళిత వర్గానికి చెందిన నాయకుడు శంకరావు పై వేటు వేసిన సంగతి తెలిసిందే. సీఎం తన రెండో వేటు కు సిద్దంగా ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఈసారి .. బోత్స సత్యనారాయణకు , డిఎల్ రవింద్ర రెడ్డిల పై వేటు వేయటం ఖాయమని తెలుస్తుంది.
సీఎం అదే మనస్సు పెట్టుకొని విస్తరణ పేరుతో.. ముందుగా బొత్స పై ప్రయోగం చేశాడని తెలుస్తుంది. ఎందుకంటే ... కాపు వర్గానికి చెందిన బొత్స ను ఎదురుకోవటం కిరణ్ వల్ల కాదని భావించి, అదే కాపు వర్గానికి చెందిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కు వ్యవసాయశాఖను గృహనిర్మాణ శాఖ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. బొత్స కు పోటిగా కన్నాను సీఎం ప్రొత్సహించినట్లు తెలుస్తుంది. ఒక పక్క మెగా స్టార్ చిరంజీవితో మంతనాలు జరుపుతూనే .. సీఎం కాపు నాయకులు మద్య కొత్త చిచ్చుపెడుతున్నాడని .. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.
అదే విధంగా డీఎల్ రవింద్ర రెడ్డిని కూడా కిరణ్ కాటు వేసినట్లు తెలుస్తుంది. ఆయన వద్ద ఉన్న 104, 108 వైద్య సర్వీస్సులను మంత్రి పదవి బాద్యతలు స్వీకరించిన కొండ్రు మురళికి అంగించటం పై డిఎల్ సీఎంల మద్య మంటలు ఎక్కువైనాయని .. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఏమైన సీఎం ప్రమోషన్ పేరుతో ..తన శత్రువులైన వారిని తొలగించే పనిలో బిజింగా ఉన్నాడని తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more