తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి మెగా స్టార్ చిరంజీవికి రాజకీయాలు బాగా అలవాటైనట్లుందని బాలయ్య చేసిన వ్యాఖ్యలు నిజమనే రుజువు చేశారు చిరంజీవి. ఎందుకంటే .. ఆయన ఈ మద్య కాలంలో .. ఏదైన ముక్కు సూటిగా చెప్పేస్తున్నారని.. ఆయన సన్నిహితులు అంటున్నారు. అంటే మోహామాటనికి పోతే.. మొదటికే మోసం వస్తుందని .. చిరంజీవి గ్రహించాడని.. కాంగ్రెస్ నాయకులు చేవులు కొర్కుకుంటున్నారు. ఇటీవల కాలంలో.. తన అనుచరులకు మంత్రి పదవులు ఇప్పించుకున్న వైనం తెలిసిందే. అయితే కాంగ్రెస్ చిరుకిచ్చిన మాటను ఇంక నిలుపుకోలేదు. పార్టీని విలీనం చేసేటప్పుడు .. చిరంజీవి కూడా .. మంచి హోదా కల్పిస్తామని అధిష్టానం చెప్పింది. కానీ ఆ మాటను నిలబెట్టుకోలేదని.. పీఆర్పీ.. నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్‌లో విలీనమై ఆ తర్వాత మంత్రి పదవులు కూడా తీసుకున్న ప్రజారాజ్యం పార్టీ శాసనసభలో మాత్రం విలీన ప్రక్రియను పూర్తి చేసుకోవటానికి వెనుకాడుతోంది. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పీఆర్పీ విలీనంపై చర్చ మొదలైందట. గత సమావేశాల్లోనే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని భావించినప్పటికీ.. తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి అసెంబ్లీలో తొలి వరుసలో కూర్చునే అవకాశం కోల్పోతారన్న కారణంతో దాన్ని అప్పట్లో వాయిదా వేశారట. విలీనం చేసినందుకు రెండు మంత్రి పదవులను కూడా తీసుకున్న చిరంజీవి వర్గానికి.. అసెంబ్లీలో విలీన ప్రక్రియ పూర్తి చేయటానికి ఇప్పుడా మంత్రి పదవులే అడ్డంకిగా మారాయని చెప్తున్నారట.
ఫిబ్రవరి 13న ప్రారంభమయ్యే సమావేశాల్లోగా విలీన ప్రక్రియ పూర్తి చేస్తే కొత్తగా చేరిన మంత్రులిద్దరికీ అధికార పక్షంలో సీట్లు కేటాయిస్తారు. అలాగే చిరంజీవి వెనుక వరుసకు వెళ్లాల్సి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కానీ ఇది చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదని పీఆర్పీ నాయకులు అంటున్నారు.
ఆ కారణంగా శాసనసభలో విలీన ప్రక్రియను రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ వాయిదా వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలావుంటే.. విలీనాన్ని వ్యతిరేకించిన శోభానాగిరెడ్డిపై అనర్హత ఫిర్యాదు పెండింగ్‌లో ఉండటంతో ఆమెకు వ్యతిరేకంగా స్పీకర్ ముందు వాదించటానికి పీఆర్పీని ఉనికిలో కొనసాగించాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కూ ఏర్పడిందట. నిజానికి విలీనాన్ని ఆమోదించాలంటూ చిరంజీవి స్పీకర్‌కు లేఖ, సంబంధిత పత్రాలను సమర్పించినా చివరి నిమిషంలో న్యాయప్రక్రియ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో స్పీకర్ దాన్ని పెండింగ్‌లో పెట్టారని తెలుస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఇస్తారని ఇప్పటికే ఆయనకు సమాచారం ఇచ్చారు కానీ ఆ ఎన్నిక పూర్తయితే చిరంజీవి రాజ్యసభకు వెళ్లిన తర్వాత మాత్రమే అసెంబ్లీలో విలీన ప్రక్రియ పూర్తి చేయాలని.. తద్వారా చిరంజీవికి ఇబ్బంది లేకుండా చూడొచ్చన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెప్తున్నారు.
అయితే మొత్తం మీద చిరంజీవి వెనక సీట్లో కూర్చోవటం ఇష్టం లేదని సీఎంకు చెప్పినట్లు .. కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more