టాలీవుడ్ లో స్టార్ హీరోల కంటే .. డైరెక్టర్ల రెమ్యూనరేషన్ .. చూసి నిర్మాతల భయపడిపోతున్నారట. అది కూడా నెం.1 రెమ్యూనరేషన్ కోసం స్టార్ డైరెక్టర్స్ డిమాండ్ చేస్తున్నారట. అయితే వారికి ఏవిధంగా నెం.1 స్థానాన్ని రెమ్యూనరేషన్ పరంగా నిర్ణయించాలా? లేక సెక్సస్ సంఖ్య పరంగా నిర్ణయించాలా? అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయట . ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోనూ పెద్ద హీరోలతో భారీ ప్రాజెక్టులు ఉన్నాయాట.
ఎవ్వడు డైలాగ్ రాస్తే దిమ్మతిరిగి ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే ఇప్పుడు అసలైన పంచ్ డైలాగుల డైరెక్టరని, ఆ దర్శకుడికే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని సినీ ప్రజలు అంటున్నారు.
అసలు దర్శకుడు అంటే కేవలం ఆ ఒక్క శాఖే కాదు. దర్శకుడికి డైలాగులు, స్క్రిప్ట్‌మీద మంచి పట్టుంటే ఇక ఆ చిత్రం విజయం ఖాయం చేప్పే స్టామిన ఉన్న వారే డైరెక్టరు. అయితే లేటెస్ట్‌గా రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు ‘దూకుడు’, ‘బిజినెస్‌మేన్’ చిత్రాలు ఈ సంగతి నిరూపిస్తున్నాయి. అదీగాక ఆయా హిట్టు చిత్రాలపై బాలీవుడ్ నిర్మాత, దర్శకుల దృష్టి ఉంచడంతో అటు హీరోలు, సినిమాల రేంజ్‌తో సహా దర్శకుల రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయిందని సిని నిర్మాతలు అంటున్నారు.
టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ 5 దర్శకుల పేర్లలో లిస్టులో ఉన్నాయట. పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, రాజమౌళి, వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయని , నిర్మాతలు అంటున్నారు. అయితే మగధీర, దూకుడు, బిజినెస్‌మేన్ లాంటి భారీ హిట్ల నేపథ్యంలో తమ హీరో గొప్ప అంటే... తమ హీరో గొప్ప అని అభిమానులు గొడవ పడుతున్న నేపథ్యంలో.....ఈ హిట్ల వెనక ఉన్న దర్శకత్వ విభాగంలో టాప్ రేంజ్ ఎవరిది అనే కోణం తెరపైకి వచ్చిందట.
పూరి జగన్నాథ్ తన కెరీర్లో బద్రి, పోకిరి, దేశ ముదురు, ఇడియట్, బిజినెస్‌మేన్ లాంటి భారీ హిట్లతో పాటు ఎన్నో విజయవంతం అయిన చిత్రాలను తీసి టాప్ దర్శకుడిగా ఎదిగిన విషయం తెలిసిందే. అయితే పూరి తీసిన సినిమాల్లో పలు ప్లాపు చిత్రాలు కూడా ఉన్నాయి.
ఎప్పుడు ఓటమి అంటే ఏమిటో ఎరుగని దర్శకుడిగా రాజమౌళికి మంచి పేరుందని టాలీవుడ్ మొత్తనికి తెలుసు.. ఆయన తొలి సినిమా స్టూడెంట్ నెం.1 దగ్గర నుంచి మర్యాద రామన్న వరుకు అన్నీ హిట్లే. తాజాగా ఈగ అనే విభిన్నమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నెం.1 స్థానికి పోటీ పడే దర్శకుల్లో అగ్రస్థానంలో ఉన్నది రాజమౌళేనట.
ఇక పోతే దూకుడు సినిమాతో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు శ్రీను వైట్లకి వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన తీసిన, ఢీ, రెడీ, దుబాయ్ శీను, దూకుడు చిత్రాలు శ్రీను వైట్లకి మంచి పేరు తెచ్చి పెట్టి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గుర్తింపు తెచ్చాయి.
ఇక ఆది, ఠాగూర్, దిల్, కృష్ణ, అదుర్స్ చిత్రాలతో టాప్ 5 దర్శకుల్లో చోటు దక్కించుకున్నా వివి వినాయక్ కూడా పోటీ ఉన్నాడని .. టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇక ఉన్నది త్రివిక్రమ్. ఆయన కెరీర్లో పెద్దగా హిట్లు లేక పోయినా ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు కథను నడిపిస్తాడనే మంచి పేరుతో టాప్ 5లో చివరి స్థానంలో ఉన్నాడట
అయితే వీరిలో నెం.1 స్థానాన్ని రెమ్యూనరేషన్ పరంగా నిర్ణయించాలా? లేక సక్సెస్ సంఖ్య పరంగా నిర్ణయించాలా? అనే దానిపై భిన్న వాదనలు టాలీవుడ్ లో వినిపిస్తున్నయాని ఫిలిం వర్గాలు అంటున్నాయి. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరు పెద్ద హీరోలతో భారీ ప్రాజెక్టులు చేస్తున్నారట.. ఆ సినిమా ఫలితాల ఆధారంగా 2012 సంవత్సరం నెం.1 దర్శకుడు ఎవరో తేలుతుందనే అభిప్రాయాలు నిర్మాత మండలి ఫిలిం చాంబర్ లో అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more