చంద్రబాబు ఏ ఎండకు ఆ గోడుకు పట్టే మనిషిగా ప్రజలకు గతంలోనే అర్థమైందట. తెలుగు దేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావుగారు .. ఈ రాష్ట్ర బాధ్యతలు చెపట్టిన తరువాత.. మొదటిగా ఆయన చేసిన మంచి పని మధ్యపాన నిషేదం. ఆయన నా ఆంద్రరాష్ట్రంలో .. నా ఆడపడుచు, నా అక్కలు, నా చెల్లెమ్మలు, కోరిక మేరకు .. రాష్ట్రం బాగుపడాలని ఆయన మద్యన్ని నిషేదించి .. తెలుగు ప్రజల గుండెళ్లలో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు ఎన్టీఆర్.
ఆ తరువాత చంద్రబాబు వేసిన ప్లాన్ కు ఎన్టీఆర్ పదవి పోవటంతో.... అడ్డదారిలో పదవిని చేజిక్కించుకున్న బాబు తన విశ్వరూపాన్ని రాష్ట్రం పైకి వదిలాడు. తన మామ నిషేదించిన మద్యం మళ్లీ రాష్ట్రంలోకి రావటానికి కారణం బాబేనట. తన అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఖాజానను నింపటానికి ముందుగా మద్యం పైల్ పై సంతకం చేశాడట. బాబు అధిక రాబడి కోసం రాష్ట్రంలో ఎక్కువ లైసెన్స్ లు ఇవ్వటం జరిగిందట. అప్పటి నుండి ఇప్పటి వరకు మద్యం ఏరులై పారటానికి కారణం బాబేనని ప్రజలు అంటున్నారు. రాష్ట్రంలో మద్యం వల్ల సంవత్సరానికి ప్రభుత్వ ఖాజానకు కొన్ని వేల కోట్ల రూపాయలు రాబడి పెరుగుతుందని, దానివలన రాష్ట్రం ముందుకు పోతుందని భావించి బాబు .. మద్యం భూతాన్ని పేద ప్రజలపైకి ఉసిగొల్పాడు. అప్పటి నుండి ఈ రోజు వరకు బాబు మధ్యం పేద ప్రజల ప్రాణాలతో చెలకాటం ఆడుతున్న విషయం అందరి తెలిసిందే.
అయితే ఇప్పడు ప్రతిపక్షనేతగా ఉన్న బాబు కిరణ్ ప్రభుత్వం పై కొత్త పోరు చేస్తున్నాడట. ప్రభుత్వం మద్యం మత్తులో జోగుతుందని, మద్యం ద్వారా ఆదాయం సంపాదించడానికే ప్రాధాన్యత ఇస్తుందని, ఇది మద్యం మాఫియా నడుపుతున్న ప్రభుత్వం అని బాబు రాష్ట్ర ప్రభుత్వంపైన మండిపడుతున్నాడట. ఆయన . మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా చంద్రబాబు ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుండి సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించాడట, అంతే కాకుండా మద్యం ద్వారా ప్రభుత్వానికి ప్రత్యక్షంగా 18వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని, పరోక్షంగా ప్రజలు మద్యంపై దాదాపు 60వేల కోట్ల వరకు వ్యయం చేస్తున్నారని అన్నారు. 2004లో మూడువేల కోట్లరూపాయలున్న మద్యం ఆదాయం ఇప్పుడు 18వేల కోట్లకు చేరుకుందని బాబు ఆవేదన వ్యక్తం చేశాడట.
కిరణ్ ప్రభుత్వం దశల వారిగా మద్య నియంత్రణ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మద్యంను ప్రధాన ఆదాయ వనరుగా చుస్తోందని బాబు అంటున్నారట. వంద మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది మంత్రులు మద్యం సిండికేట్‌లో ఉన్నారని బాబు చెబుతున్నాడట. మద్యం సిండికేట్‌లో అసలైన దోషులను ఎందుకు అరెస్టు చేయడం లేదని, చిన్న చిన్న అధికారులను మాత్రమే అరెస్టు చేస్తూ .. మంత్రులను, ఎమ్మెల్యేలను ఎందుకు వదిలివేస్తున్నారని బాబు మద్యం తాగిన వాడి అరుస్తున్నాడట. అయితే మద్యం సిండికేట్లపై మహిళలు తిరుగుబాటు చేయడం ఖాయమని, మహిళలు తిరగబడితే కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేరని అంటున్నాడు .
అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు మారుపేరుగా మారిందని, కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపితే కానీ అవినీతి పోదని అంటున్నాడట. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడే స్వయంగా 31 మద్యం షాపులు నడిపిస్తున్నట్టు ఒప్పుకున్నారని, చివరకు గాంధీభవన్ పేరును బ్రాందీ భవన్‌గా మారుస్తారేమోనని సికింద్రాబాద్ ఎమ్‌జి రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాగడాతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మద్యం పోరటం చేస్తున్నాడట.
అయితే చంద్రబాబు చేస్తున్న ర్యాలీని చూసి ప్రజలు ముక్కమీద ఏలుసుకున్నారట. అసలు బాబేన మాట్లాడుతుందని చాలా మంది అనుమానం కూడా వచ్చిందట. ఈయన బుద్ది .. కుడిచేత్తో వద్దు వద్దు అంటునే .. ఎడమ చేత్తో .. కావాలి.. కావాలి.. అనే విధంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రంలో మద్యం మొదలు పెట్టి బాబే.. ఇప్పడు మద్యం పై యుద్దం చేసేది బాబేనా? అని బిగ్గమొఖంతో బాబు వైపు చూస్తున్నరంట. అసలు మద్యం ముందు గా బాబును అరెస్ట్ చేయ్యాలని ప్రజలు అంటున్నారట. గురివింద గింజ కింద నలుపు ఎవరి తెలియదని ప్రజలు అంటున్నారు.
ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ‘ఊసరవెల్లి’ మంచి హిట్ సాదించింది. ఆ సినిమాను పొరపాటున ఎన్టీఆర్ తో తీశారని.. అదే సినిమా ను చంద్రబాబు హీరో పెట్టి సినిమా తీసినట్లైతే .. బంఫర్ హిట్ సాధించేదని ర్యాలీలో పాల్గొన్న ప్రజలు గుసగుసలాడుకుంటున్నారట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more