తెలుగు సినిమా ‘సత్యం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరావు మనవుడు అయిన హీరో సుమంత్ తో జతకట్టిన జెనీలియా తన కేరియర్ ను టాలీవుడ్ ప్రారంభించింది. అప్పటి నుండి అడపాదడపా సినిమాలు చేస్తున్న పెద్ద గుర్తింపు రాలేదు. నందమూరి హీరో ఎన్టీఆర్ తో చేసిన ఆమెకు తగిన హీరోయిన్ వేశాలు రాలేదట. ఆ తరువాత 2006 లో హీరో సిదార్థ తో కలిసి ‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సు ఒక హాసినిగా తాకింది. అప్పటి నుండి ఆమెకు జెనిలియా పేరు బదులు హాసినిగా తెలుగులో పిలవబడుతుంది. ఆ సినిమా నుండి హాసినికి మంచి కేరియర్ లోకి వెళ్లి పోయింది. అటు తమిళ్, తెలుగు, హిందితో తన హవా చూపుతుందట.
అయితే బాలీవుడ్ లోకి జేనిలియా ..పూర్తిగా ప్రేమలో మునిగిపోయి చివరకు అది పెళ్లి వరకు వచ్చింది . త్వరలో మరో మూడు రోజుల్లో ఈ బ్యూటీ బ్యాచిలర్ లైఫ్‌కి స్వస్తి చెప్పబోతున్నారట. తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లాడబోతుందట.. అయితే మామూలుగా జెనిలియా హీరోయిన్‌కి పెళ్లి అనే వార్త టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడలలో పెద్ద సందడి నెలకొందట.
అయితే జేనిలియా పెళ్లి టాలీవుడ్ నుండి హీరోలైన రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్, రామ్, సుమంత్, తరుణ్ మొదలగు హీరోలకు ఆహ్వానం అందిందట. కోలివుడ్ నుండి కూడా హీరో, సిద్దార్థ, విజయ్, జీవా, ఇంక ప్రముఖులకు జెనీలియా తన పెళ్లి ఆహ్వనం పత్రికను పంచించిందట. అయితే జేనిలియా లవర్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కావటంతో.. పెళ్లి చాలా వైభవంగా చేస్తారని బాలీవుడ్ న్యూస్ ద్వారా తెలుస్తుంది.
అయితే గత కొన్ని రోజులుగా రితేష్, జెనీలియాల పెళ్లికి సంబంధించి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. వీరి వివాహ వేడుకలు దాదాపు నాలుగైదు రోజులు జరుగుతాయని సమాచారం. ఈ వేడుకలకు నాందిగా ఇటీవల ముంబయ్‌లోని ‘రాయల్టీ రెస్టారెంట్’లో ఫర్దీన్‌ఖాన్, సాజిద్ నదియాడ్‌వాలా ఓ పార్టీ ఏర్పాటు చేశారట జెన్నీ, రితేష్‌కి ఈ ఇద్దరూ మంచి స్నేహితులు కావడంవల్లే ఈ పార్టీని ఎరేంజ్ చేశారట. ఇందులో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొని కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతే కాకుండా కరణ్ జోహార్ దర్శకత్వంలో ‘సంగీత్ పార్టీ’ ఆట, పాటలతో ఈ వేడుక కోలాహాలంగా జరుగుతుందని బాలీవుడ్‌వారు చెబుతున్నారు. ‘కుచ్ కుచ్ హోతా హై’లాంటి అద్భుతమైన ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించిన కరణ్‌జోహార్ భార్యాభర్తలు కాబోతున్న ఈ ప్రేమికుల సంగీత్ కార్యక్రమాన్ని అద్భుతంగా డిజైన్ చేయాలని భావించారట. ఆయన దర్శకత్వంలో సంగీత్ జరగనుందట. ఇటీవల జెనీలియా, రితేష్ కోసం ఫర్దీన్, సాజిద్ ఇచ్చిన పార్టీకి హాజరై.. అక్కడి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారట కరణ్. ఆ ఏర్పాట్లను మించే స్థాయిలో సంగీత్‌ని ప్లాన్ చేశారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అంతే కాకుండా ఈ వేడుకను ముంబయ్‌లోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో చేస్తారని సమాచారం. ఈ వేడుకకి దర్శకత్వం వహించడం మాత్రమే కాదు రితేష్ ధరించబోయే దుస్తులను కూడా కరణే డిజైన్ చేయించారట.. ఇంకా రితేష్ స్నేహితులు జాయేద్‌ఖాన్, ఫర్దీన్‌ఖాన్ కూడా కాలు కదపనున్నారట. ఈ సంగీత్ జెన్నీ, రితేష్‌లకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అవ్వాలనే సంకల్పంతో ఇరువైపు కుటుంబ సభ్యులు, స్నేహితులు భావిస్తున్నారట.
3న వివాహం, 4న రిసెప్షన్
ఫిబ్రవరి 3న ముంబయ్‌లో రితేష్, జెనీలియా పెళ్లి జరగనుంది. 1న సంగీత్, ఆ మర్నాడు జరిపే మెహందీ కార్యక్రమం ఓ ఎత్తయితే వివాహ వేడుక మరో ఎత్తు అనిపించే విధంగా జరపనున్నారట. పెళ్లికి మర్నాడు ముంబయ్‌లోని సాంటా క్రజ్‌లోని గ్రాండ్ హయత్‌లో రిసెప్షన్ జరుగుతుంది. ఈ ఏడాది బాలీవుడ్‌లో జరగబోతున్న తొలి వివాహ వేడుక ఇదే. రితేష్, జెనీలియాలకు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉండటం, రితేజ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు కావడంతో... ఇటు సినీరంగ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ రంగ ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొనబోతున్నారట.
మా బంధం ఆదర్శంగా నిలుస్తుంది.
ఇదిలా ఉంటే దాదాపు ఎనిమిదేళ్ల క్రితం రితేష్, జెనీలియా ‘తుజే మేరీ కసమ్’ అనే చిత్రంలో నటించారు. ఇది ఇద్దరికీ తొలి చిత్రమే. ఈ సినిమా అప్పుడు ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం ప్రేమకు దారి తీసింది. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ ‘తేరే నాల్ లవ్ హో గయా’ అనే చిత్రంలో నటించారు. ఫిబ్రవరి, 24న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఒకవైపు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటూనే.... రితేష్, జెన్నీ మూడు, నాలుగు రోజుల క్రితం కూడా ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని, చిత్రవిశేషాలు తెలియజేశారట. మా వైవాహిక జీవితం ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇద్దరికీ ఈ బంధం మీద నమ్మకం ఉందని చెబుతున్నారట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more