సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు చాలా జోరుగా సాగుతున్నాయి. గత మూడు రోజుల్లో పశ్చిమ గోదావరి కోస్తా జిల్లాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. కోడిపందాలలో బెట్టింగ్ మీద నిషేధం ఉన్నా దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులే స్వయంగా పాల్గొంటూ పోలీసులు ఆ చాయల్లోకి రావద్దని ముందే చెప్పేసారని సమాచారం. కోడి పందాలు లేని సంక్రాంతిని ఊహించలేమని చెప్తున్నారు ఆ వేడుకల్లో ఉత్సాహంగా తిరుగుతున్నవారు.
ఇక కోడిపుంజులను బరిలోకి దింపుతున్నవారు వాటిని ఎంతో ప్రేమగా మంచి ఆహారం పెట్టి ఏపుగా పోషించి, వాటి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని, అవి గెలవాలని ఎన్నో మొక్కులు కూడా మొక్కుకుంటున్నారు. వివిధ జాతులు ఉన్న కోడిపుంజులలో విశేష ఙానం కలిగినవారు వాటికి తగు పోషణ చేసి శిక్షణ కూడా ఇచ్చి పందేల్లోకి దింపుతుంటారు. జీడిపప్పు బాదం లాంటి ఖరీదైన ఆహారం పెట్టి వాటిని ముద్దుగా చూసుకుంటారు. ఓడిపోతే మాత్రం అవే ఆహారంగా మారిపోతాయి.
పందెం కట్టటం, డబ్బు చేతులు మారటం వాటికున్న చట్ట వ్యతిరేకతను కాసేపు పక్కకు పెట్టినా, కొత్తగా వాటిని చూడటానికి వచ్చినవారికి హృదయం ద్రవించటం ఖాయం. వాడిగా ఉండే గోళ్ళతోనూ ముక్కుతోనూ గుచ్చి శత్రు కోడి రక్తమోడి గిలగిల్లాడేట్టు చెయ్యటం కోడిపుంజుకి పుట్టుకతో వచ్చిన విద్యే అయినా, వాటి కాళ్ళకి ప్రత్యేకంగా కత్తులను కట్టి యుద్ధానికి పంపుతారు. పైకి ఎగిరి కాళ్ళతో ఎదుటి కోడిని కొట్టినప్పుడు దాని శరీరంలోంచి రక్తం బయటకు చిమ్ముతుంది. చిన్న ప్రాణం ఎంతలోకి పోతుంది. వెంటనే తల పక్కకు వాల్చేస్తుందా కోడి.
అసలు ఎదుటి కోడిని ఎందుకు పొడవాలి, ఎందుకు చంపాలన్నది ఏ కోడిపుంజుకీ తెలియదు. వాటి గెలుపు నిజానికి వాటి గెలుపు కాదు- వాటిని పెంచినవారి గెలుపు. ఓడిపోతే వారిని పెంచినవారికి ఆహారం. అభం శుభం తెలియని కోడి పుంజులు కాళ్ళకి కత్తి కట్టి వదిలిపెట్టినా ఎదుటి పుంజుని చూసి పక్కకు తిరిగిపోయే సందర్భాలు చాలా ఉంటాయి. అప్పుడు వాటిని పట్టుకుని ఒకదాని ముక్కుతో మరో దాన్ని పొడిపించి వాటిలో కసి రగిలేట్టుగా చేస్తారు.
రాజకీయరంగంలో కూడా ఇలాంటి వైఖరే కనిపిస్తుంది. అధికారంలో ఉండటం కోసం ఇతర పార్టీలతోనే కాదు, సొంత పార్టీలో కూడా పోరు సలుపుకునే విధంగా ప్రవర్తించే విధానాలుంటాయి. ఇద్దరి మధ్య పోరు ప్రారంభించేట్టుగా చెయ్యటం చాలా సులభం. ఒకరి బలహీనతలను మరొకరికి అందేలా చెయ్యటమే. దానితో ఒకరి మీద మరొకరు వ్యాఖ్యానాలు, ఆరోపణలు, సవాళ్ళు, సంధించుకుంటారు. ఈ యుద్ధకాండను మొదలుపెట్టించిందెవరో తెలియకుండా పెద్దలు జాగ్రత్త పడతారు. ఇద్దరూ మళ్ళీ ఆశ్రయించేది పార్టీ పెద్దలనే. సమాచార హక్కు ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా ఎన్నో లోపాయీ కారీ వ్యవహారాలు విచిత్రమైన రీతిలో బయటపడతాయి. అవసరానికనుగుణంగా అవి సమసిపోతాయి కూడా. తెలియకుండానే మీడియా వాటికి ఆద్యం కూడా పోస్తుంది.
చిదంబరం ప్రధానమంత్రికి రాసిన లేఖ జనతా పార్టీ అధ్యక్షుడి చేతికి చిక్కటం, అది ప్రణబ్ ముఖర్జీ నాయకత్వంలో నడుస్తున్న ఆర్థిక మంత్రిత్వ శాఖనుంచి బయట పడటం దానితో వారిద్దరి మధ్యా చిచ్చురేగి చివరకు ప్రధానమంత్రి, సోనియా గాంధీలు కలుగజేసుకోవటంతో సమసిపోవటం కూడా ఇలాంటిదే నన్న వార్తలు ఆమధ్య గుప్పుమన్నాయి. సరిగ్గా తెలంగాణా ఆందోళన ఉధృతంగా ఉన్న సమయంలో తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కి పోలవరం టెండర్లలో జోక్యమున్నదని ఆ సమయంలో బయటపడటం కూడా విచిత్రమే. హోమ్ థియేటర్లో ఏ స్పీకర్లోంచి ఎంత శబ్దం బయటకు రావాలనేది నిర్ణయించటానికి రిమోట్ కంట్రోల్ చేతిలో ఉన్నంతకాలం మనం ఆడింది ఆట, పాడింది పాటే కదా. అలాంటివారికి కొన్ని డుడు బసవన్నలూ, కొన్ని కోడిపుంజులూ చేతిలో ఉంటాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more