ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని అన్నా హజారే బృందం నిర్ణయించుకుంది. తొలుత కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని హజారే స్వయంగా ప్రకటించినా, ఆయన బృందం కోర్ కమిటీ తాజాగా ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. హజారే అవలంబించిన కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిపై కోర్ కమిటీలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతోనే, ప్రచారానికి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోనూ పర్యటించాలని, అయితే ఏ పార్టీకీ వ్యతిరేకంగా ప్రచారం చేయరాదనే నిర్ణయంపై కోర్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్న హజారేను కలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హజారే బృందం కోర్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ప్రభుత్వం రూపొందించిన లోక్‌పాల్ బిల్లుకు వ్యతిరేకంగా ముంబైలో అన్నా హజారే చేపట్టిన దీక్షకు ప్రజల స్పందన అంతంత మాత్రంగానే ఉండటం, అనారోగ్య కారణంగా ఆయన తన దీక్షను అర్ధంతరంగానే ముగించుకోవాల్సి రావడంతో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే దానిపై కోర్ కమిటీలో గందరగోళం నెలకొంది. కోర్ కమిటీ భేటీ చర్చల వివరాలను తెలిపేందుకు, పుణే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన హజారేను పరామర్శించేందుకు కేజ్రీవాల్‌తో పాటు ప్రశాంత్ భూషణ్ కూడా రాలెగావ్ సిద్ధి చేరుకున్నారు. భవిష్యత్ కార్యాచరణను కోర్ కమిటీ హజారే నిర్ణయానికే విడిచిపెట్టింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచా రం చేయాలా, వద్దా... ఏదైనా ఒక పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం హజారేకే విడిచిపెట్టింది. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో తమ పర్యటనలో హజారే పాల్గొనేదీ, లేనిదీ ఇప్పుడే చెప్పలేమని కేజ్రీవాల్ చెప్పారు. అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని, పూర్తిగా కోలుకుంటేనే ఆయన తమ పర్యటనలో పాల్గొనగలరని తెలిపారు. తమ పర్యటనలో ప్రజల్లో లోక్‌పాల్ బిల్లుపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
బలమైన లోక్‌పాల్ బిల్లు కోసం హజారే బృందం చేసిన కృషిని, దీనిపై ప్రభుత్వం, ఇతర పార్టీలు అవలంబించిన వైఖరిని ప్రజలకు వివరిస్తామని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ‘గణతంత్ర పునర్నిర్మాణం’ అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చేందుకైనా, వ్యతిరేకించేందుకైనా అన్నా హజారే బృందానికి స్వేచ్ఛ ఉందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ వ్యతిరేకంగా ప్రచారం చేయరాదనే హజారే బృందం నిర్ణయానికి ప్రా ముఖ్యత ఇచ్చేందుకు నిరాకరించింది. వారి నిర్ణయంతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని, వారు ఎలా కోరుకుంటే అలా చేయవచ్చని పార్టీ ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more