మెగాస్టార్ చిరంజీవి తన సినీజీవితాన్ని వదిలి పెట్టి ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్ధేశ్యంతో ప్రజల అభీష్టం మేరకు ప్రజా సేవకోసం ‘ప్రజారాజ్యాన్ని’ స్థాపించాడు. దీనికి ప్రజల మద్దతు కూడా లభించింది. అయితే ఈ అందించిన వచ్చిన అవకాశాన్నిచిరంజీవి సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యాడు.
చిరంజీవి విఫలం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని రాజకీయ పరమైన కారణాలు అయితే, మరికొన్ని తన సున్నితమైన మనస్త్వత్వం వల్ల వచ్చినవి. రాజకీయ పరంగా చెప్పాలంటే అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన చిరుకు రాజకీయ లొసుగులు తెలియక వైయస్ అండ్ కో పార్టీ, చంద్రబాబు లాంటి వాళ్ళ రాజకీయ ఉచ్చులో పడి కోలుకోకుండా పోయాడు. అదే టైంలో తన పార్టీలో ఉండే నాయకులు... పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు వెన్నుపోటు పోడవటంలో చిరు రాజకీయంగా చాలా దెబ్బతిన్నాడు. అయినా చిరు నిరుత్సాహ చెందలేదు. తన శక్తి సామార్థ్యాల మేరకు ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నించాడు.
నాకు, నా పార్టీ ఎమ్మల్యేలతో ప్రజలకు పూర్తి స్థాయిలో సేవల చేయలనని భావించిన చిరు మంచి టైంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. దీంతో తను అధికారంలో లేకున్నా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం అందుకున్నాడు. దీనికి తోడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా చిరంజీవిని ఆదరించింది. సోనియాగాంధీ కాకుండా చిరు లాంటి వాడు తన పార్టీలోకి వస్తే తన బలమే కాకుండా ఇంకొక శక్తి తన పార్టీకి తోడవుతుందని భావించింది. అంతే కాకుండా చిరంజీవికి ఉన్న చరిష్మాతో ఓట్లు తెస్తాడు అలాంటి నాయకుడు తన పార్టీకి, కాంగ్రెస్ భవిష్యత్తుకు మంచిదని భావించింది.
ఒకప్పుడు చిరంజీవిని తిట్టిన కాంగ్రెస్ వారే ఇప్పుడు పొగుడుతున్నారు, ఆదరిస్తున్నారు. ఎందుకంటే చిరుకు హైకమాండ్ వద్ద ఉన్న సాన్నిహిత్యమే. అంతే కాకుండా చిరుకు హైకమాండ్ నేతలైన సోనియాగాంధీ, హమ్మద్ పటేల్ లాంటి ముఖ్యమైన నేతలతో డైరెక్టు కాంటాక్ట్ ఉండటంతో కాంగ్రెస్ నాయకులు చిరు చుట్టు చేరుతున్నారు. మన రాష్ట్రంలో కూడా చిరుకు మంచి ఆదరణ ఉంది. బొత్స లాంటి కాపు వర్గానికి చెందిన వాడికి పీసీసీ ఛీఫ్ పదవి రావడంతో చిరుకి మరింత కలిసివచ్చింది. ఇప్పడు కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు కూడా చిరు సలహాలు తీసుకుంటున్నారు. పాటిస్తున్నారు.
వీటన్నింటికి తోడు చిరు ఎదుగుతున్నాడనికి తాజా నిదర్శనం ఏంటంటే... అపోలో గ్రూప్ లాంటి పెద్ద వారితో వివాహా బంధం కలుపుకోవడం. వివాహా బంధాలు ఒక వ్యక్తి ఎదగడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాంటిది అపోలో లాంటి పెద్ద పెద్దలతో వివాహా బంధం కలుపుకున్నాడు చిరు.
పూర్వం అక్బర్ ప్రభువు హిందువును పెళ్ళి చేసుకున్నాడు. ఈ వివాహా బంధంతో అక్బర్ రాజు ఇటు హిందువులను, అటు ముస్లీంలను దగ్గర చేసుకొని బలంగా తయారయ్యి ఎదిగాడు. అలాగే చిరుకూడా ఒక గొప్ప ఆర్థిక వేత్త తో వివాహా బంధం కలుపుకోవడం భవిష్యత్తులో గొప్ప ఆర్థిక వేత్తగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు కాంగ్రెస్ సైన్యం తోడవ్వడంతో చిరు భవిష్యత్తులో మంచి నాయకుడిగా, రాజకీయ శక్తిగా ఎదుగుతాడనడంలో సందేహం లేదు.
అంతే కాకుండా ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులలో అవినీతి ఆరోపణలు లేని రాజకీయ నాయకుడుగా ప్రజల ఆదరాభిమానాలు ఎక్కువగా ఉన్న నేతగా చిరంజీవి ఉన్నాడు. జగన్, చంద్రబాబు లాంటి నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మన రాష్ట్రంలో అవినీతి మచ్చలేని కాంగ్రెస్ నాయకుడు ఎవరంటే చిరంజీవి.
ఇవన్ని కారణాలు చిరంజీవి ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నాడనటానికి నిదర్శనం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more