ఏడు రోజులుగా పార్లమెంటుని స్థంబింప జేస్తున్న అంశం, చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు. మనదేశంలో చిల్లర వ్యాపారం చేసుకునేవారు ఏమవాలి, వారి గతేంటి అంటూ ప్రతిపక్షాలే కాకుండా యుపిఏ మిత్ర పక్షాలు, కేరళలాంటి రాష్ట్రాల్లో సొంత పార్టీ నాయకులు కూడా నిలదీయటం కేంద్ర ప్రభుత్వాన్ని సంకటంలో పెడుతోంది. ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్న వారంతా వీధినపడతారంటూ అందరూ విమర్శిస్తున్నారు. బిగ్ బజార్, స్పెన్సర్స్, రిలయన్స్ ఇప్పటికే ఈ రంగంలో ఎంతో అభివృద్దిని సాధించాయి కానీ అది సరిపోవటం లేదని ప్రధానమంత్రి భావన. బయట దొరికే సరుకుల కంటే ఎక్కువ నాణ్యత గలవి, తక్కువ ధరలో లభిస్తున్నాయన్నది నిజం. దానికి కారణం వారు టోకున చేసే కొనుగోలు. రిటైల్ వ్యాపారుల వాటాలోంచి శుభ్రపరచి నిల్వుంచటానికి అయ్యే ఖర్చు, సిటీ సెంటర్లలో పెద్ద పెద్ద మాల్స్ నిర్వహణ ఇవన్నీ తీసేసిన తర్వాత మిగిలిన లాభాన్ని కూడా వినియోగదారులకే ఇవ్వటం వలనే తక్కువ ధరకు ఇవ్వగలుగుతున్నారు. ఎంతో మందికి ఉపాధి కూడా లభించింది. దానికి తోడు షాపింగ్ చేసిన తృప్తి కలిగేలా చేసే ఆధునికీకరణ, జీవన శైలిని మారుస్తున్నాయి.
ఇదే పంథాలో ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టి, మరింత నిర్వహణా సామర్థ్యం ఉన్న సంస్థ రైతుల దగ్గర కొనుగోలు దగ్గర్నుంచి వినియోగదారులకు చేర్చే వరకూ స్వయంగా శ్రద్ధ తీసుకుని, నిల్వలను నిర్వహించటంలోనూ, ధరలను నియంత్రించటంలోనూ ఒక క్రమపద్ధతిని పాటిస్తే దేశానికి మంచే జరుగుతుంది, రైతుల సమస్యలూ తీరిపోతాయి. రైతులకు పడ్డ ధరకు కనీసం 5 రెట్లు చెల్లిస్తున్న వినియోగదారుడికీ, ఉత్పత్తిదారుడికీ కూడా లాభం చేకూరుతుంది. కాకపోతే మనవాళ్ళకి అలవాటు పడటానికి కాస్త టైం పడుతుంది.
అద్దాల బీరువాల్లో చీరల కంటే ఎక్కువ నాణ్యతకలవి, తక్కువ ధరలో దొరుకుతున్నాయని ఇంటికి వచ్చి అమ్మేవాళ్ళ దగ్గర గంటలకొద్దీ బేరాలు చేసి తీసుకున్న తర్వాత వచ్చే తృప్తి వేరు. అది మరి సరైన రేట్లను నిర్ణయించి బేరాలకు తావులేని దుకాణాల్లో కొనుగోలు చేసేటప్పుడు వారికి లభించదు. ఫుట్ పాత్ లను ఆక్రమించి వాటి మీద అమ్మకాలను నిర్వహించేవారి దగ్గర కొనుగోళ్ళకి ఎగబాడేవారిలో అధికశాతం మనుషులకు బేరమాడటమే తృప్తినిస్తుంది.
ఆర్థిక శాస్త్రవేత్తగా ఎంతో అనుభవం, పరిఙానం ఉన్న ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎంతో అధ్యయనం చేసిన తర్వాతనే ఈ ప్రతిపాదన తీసుకొచ్చివుండాలి. క్యాబినెట్లో కూడా చర్చించిన తర్వాతనే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకునుండివుండాలి. అయితే వీటిని అందరూ ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు, అందులో మంచే ఉంటే దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు. అంత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న మంత్రులు దాని గురించి అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పటంలో ఎందుకు విఫలమౌతున్నారు. పార్లమెంటులో చర్చకు ఎందుకు అంగీకరించరు.
దీన్ని ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకుని, దీన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవలసి వస్తే రాజీనామా చేస్తానని హెచ్చరించినట్టు కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. మరి ఆయనకెందుకింత పట్టుదల అంటే, ఎంతగానో పరిశీలించి, శోధించిన దాన్ని ప్రతిపక్షాలు తేలిగ్గా కొట్టిపారేస్తూ రాజకీయం చెయ్యటం ఎవరికీ ఇష్టముండదు ముఖ్యంగా శాస్త్రవేత్తలకు, ఙానులకు.
మరి ప్రతిపక్షాలకు అర్థం కావటం లేదా లేకపోతే మరేమైనా మతలబుందా అంటే ఒక్కొక్కరికి ఒక్కోటి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీని పడగొట్టటానికి ఒక బలమైన అంశం కోసం ఎదురు చూసేవారికి ప్రజల పక్షంలో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఎండగట్టటానికి పనికివస్తుంది. ఇంత పెద్ద ఒప్పందం కదా మాకు ఇందులో ఏమీ లేదా అని ఆగ్రహం వహించేవారు మరికొందరుంటారు. ఇందులో విదేశ సంస్థలనుంచి నొక్కేసుంటారన్నఅక్కసు కొంతమందిలో ఉంటుంది. మమ్మల్ని ముందుగా ఎందుకు సంప్రదించలేదు అని తమని తక్కువ చేసినందుకు కొందరు కినుక వహిస్తారు. విషయం సరిగ్గా అర్థం కాకపోయినా మిత్రపక్షాలతో కలిసి నిందించేవారు మరికొందరుంటారు. వ్యతిరేకతలకు ఇంకా ఎన్నో కారణాలుంటాయి.
ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వెసులుబాటు మాత్రమే. దీనివలన కోట్లాది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇష్టమైతేనే వీటిని అనుసరించండి. ఇది ఫెడరల్ ప్రభుత్వం. ఇందులో బలవంతమేమీ లేదు. అని ప్రధాన మంత్రి వాదన. మీరు మీ పాత పద్ధతిలో ట్రాఫిక్ కి అడ్డు వచ్చే బండ్లు, తలమీద గంపలో పెట్టుకుని అమ్మే వాళ్ళూ, ఫుట్ పాత్ లు ఉన్నవి మీకోసమైనా వాటిమీద తిష్టవేసి మీతో వ్యాపారం చేసేవారు చేసే అమ్మకాలనే కొనసాగించండి. నాణ్యతలేని వస్తువులను చౌకగా వస్తున్నాయంటూ కొని ఇంటికి తీసుకుపోండి అన్న విషయాన్ని ప్రధాన మంత్రి చాలా సౌమ్యంగా చెప్పారు.
అయితే విదేశ వ్యాపారుల చేతుల్లోకి పోతుంది. వాళ్ళిక ఎంతంటే అంతే అనే వాదన కూడా సరైనది కాదు. మనమిచ్చిన అనుమతిని మనం ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. అది వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి, బంగారు గుడ్డు పెట్టే బాతుని చంపుకుతినే ప్రయత్నం వాళ్లూ చెయ్యరని మనం గ్రహించాలి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more