కుర్రకారు అంత వర్షం కోసం ఎదురుచూసేలా చేసి... అందరి మనస్సును వర్షం పై పరుగులు తీయించింది అందాల నటి. ‘‘ ఎన్నాళ్లుకు గుర్తోచ్చన వాన... ఎన్నాళ్లు దాగుంటావు .. పైనా .. ’’ అనే పాట పాడుతూ .. వర్షంలో తడుస్తూ .. వయోబేధం లేకుండా అందర్ని.. ఆమె వైపుకు పరుగులు తీయించింది. అప్పటి నుండి నునూగు మీసాల వారి నుండి 60ఎళ్ల ముసలివాడు కూడా .. వర్షం కోసం ఎదురుచూసిన రోజులావి. అలా వర్షంలో తడుస్తూ .. సినిమా ఇండస్డ్రీలో.. పెద్ద హీరో నుండి చిన్న హీరోదాక సినిమాలు చేసి ఎంతో పేరు సంపాదించుకుంది అందాల నటి త్రిష.
త్రిష సినిమాలో ఉండే ఆ సినిమా హిటే అని స్థాయిలో .. నటించి ..టాలీవుడ్ లో .. నెంబర్ వన్ గా పేరు తెచ్చుకుంది. చిరంజీవితో స్టాలిన్ సినిమాలో నటించి త్రిషకు ఆ సినిమా ఎంతో పేరు తెచ్చింది. మహేష్ తో అతడు అనే సినిమాలో పల్లటూరు అమ్మాయిగా , బావకు మరదులుగా నటించి... అతడు సినిమాన్ హిట్ చేసింది. మొన్న పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ సినిమా త్రిష అందాలు ప్రేక్షకుల కనువిందు చేశాయి. అయితే .. త్రిషకు ఒక చెడ్డ అలవాటు ఉంది.
ఆమె ఎక్కడ ఉంటే .. అక్కడ గొడవలేనట. ఏ పార్టీకి వెళ్లిన.. అక్కడి వారితో త్రిష గొడవపడుతుందట. తరుచు పార్టీలకు వెళ్లి అక్కడ మద్యం బాగి సేవించి.. అక్కడున్న వారి పై తిరుగబడి రచ్చ రచ్చ చేస్తుందట. త్రిషతో వెళ్లిన వారి పరువు మాత్రం గంగలో కలిసి పోతుందని .. సహా నటులు అంటున్నారు. కానీ త్రిష ఈ మధ్య కొత్త డైలాగు చెప్తుతుందట. నాకు ఇష్టమైన వారు ఒకరున్నారు. వారే నా ప్రాణం అంటుందట. ఈ కొత్త డైలాగు విన్న వారు .. ఎవరా ఆవ్యక్తి అని ఆరాతీస్తున్నరట. కొంత మంది హీరోలైతే.. కొంపతీసి నా పేరు చెబుతుందా? అని భయంతో వణికిపోతున్నారట. త్రిషకు అన్నీ ఆ వ్యక్తినేనట.
ఆ వ్యక్తి ఎవరో కాదు.. త్రిష తల్లినట. అవి ఆమె మాటల్లోనే విన్నదాం. ‘అమ్మే నాకు గురువు, దైవం. ఏనాడూ తన అభిప్రాయాన్ని ఆమె నాపై రుద్దలేదు. బహుశా అలా చేసుంటే ఇప్పుడు ఇంత గొప్ప స్థానంలో ఉండేదాన్ని కాదేమో...’’ అన్నారు చెన్నయ్ చందమామ త్రిష. తన గత అనుభవాలను నెమరువేసుకుంటూ ఆమె పై విధంగా స్పందించారు. ఇంకా పాత విషయాలను ఆమె గుర్తు చేసుకుంటూ, ‘‘టెన్త్ టైమ్‌లోనే మోడలింగ్ వైపు మనసు మళ్లింది. అదే విషయం అమ్మకు చెప్పాను.
అలాంటి టైమ్‌లో ఎవరైనా ఇలాంటి కోరిక కోరితే ఏ పేరెంట్స్ అయినా చీవాట్లు పెడతారు. కానీ అమ్మ నన్నేం అనలేదు. మోడలింగ్ రంగానికి చెందిన ప్రముఖురాలు ‘తార’ దగ్గరకు నన్ను తీసుకెళ్లింది. చెన్నయ్‌లోని ప్రసాద్ స్టూడియోలో ఓ సబ్బుకు సంబంధించిన వ్యాపార ప్రకటన కోసం ఆమె కొంతమంది మోడల్స్‌కి స్క్రీన్ టెస్ట్ చేస్తున్నారు. ముంబయ్, బెంగళూర్‌లకు చెందిన చాలామంది మోడల్స్ ఆ టెస్ట్‌లో పాల్గొన్నారు. కానీ తార దృష్టి మాత్రం నా అదృష్టం కొద్దీ నాపైనే పడింది. నాక్కొన్ని డైలాగ్స్ ఇచ్చి చెప్పమన్నారు. తడుముకోకుండా చెప్పేశాను. అంతే... మోడల్‌గా ఎంపికయ్యాను.
ఆ తర్వాత చెన్నయ్‌లో జరిగిన మిస్ చెన్నయ్ పోటీల్లో కిరీటం సొంతం చేసుకోవడం, మిస్సిండియా పోటీల్లో ఉత్తమ దరహాసినిగా జ్ఞాపిక అందుకోవడం జరిగిపోయాయి. ఇంత సాధించాక తర్వాత స్టెప్ సినిమాలే కదా? మంచి అవకాశాలొస్తే చేద్దాం అనుకున్నాను. అనుకుందే తడవుగా ప్రియదర్శన్ నుంచి ఆఫర్ వచ్చింది. ‘ఈ సినిమా హిట్ అయితే హీరోయిన్‌గా కొనసాగుతా. లేకపోతే మళ్లీ స్టడీస్‌పై కాన్సన్‌ట్రేట్ చేస్తా’ అని మనసులో అనుకున్నా. తొలి చిత్రం ‘లెసా లెసా’ విడుదలైంది. తొలి అడుగే ఎదురుదెబ్బ. సినిమా ఫ్లాప్. కానీ కథానాయికగా నాకు మాత్రం మంచి పేరొచ్చింది. అందుకే సినిమాలు వదలాలని అనిపించలేదు. ఆ తర్వాత జరిగిన కథంతా మీకు తెలిసిందే. దీనంతటికీ కారణం అమ్మ. అందుకే అమ్మంటే నాకు ప్రాణం’’ అంటూ అందంగా నవ్వేశారు త్రిష.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more