ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంత అర్జెంటుగా ‘రైతు పోరు బాట’కు విరామం ఇచ్చి ఢిల్లీ వళ్లాల్సిన అవసంర ఏముంది. తన పై సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళటం అనేక అనుమానాలకు దారితీస్తుంది. దీని పై తనకు వ్యతిరేకంగా పనిచేసే మీడియా కూడా అప్పుడే ప్రచారం మొదలు పెట్టింది. మరో రెండు మూడు రోజుల్లో చంద్రబాబును సీబీఐ విచారించనున్న నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడని ప్రచారం చేస్తుంది.
అయితే కొందరు మాత్రం చంద్రబాబు పర్యటనపై రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఢిల్లీలో ఉన్న సుప్రింకోర్టులో నుండి స్టే తెచ్చుకోవడానికే వెళ్లాడని, తనకు తెలిసిన జడ్జీల ద్వారా, తన హయాంలో నియమితులైన జడ్డీల ద్వారా స్టే తెచ్చుకోవడానికి పావులు కదుపుతున్నాడని అనుకుంటున్నారు. ఈ కేసులో నుండి బయట పడటానికి జాతీయస్థాయి నేతలతో చర్చలు కూడా జరుపుతున్నాడని అంటున్నారు.
అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు తెలివిగా తను కోర్టుకు వెళ్లకుండా తనకు బినామీలుగా చప్పబడుతున్న నామానాగేశ్వర రావు, సీఎం రమేష్, రామోజీరావులతో సుప్రీం కోర్టులో అప్పీలు ధాఖలు చేయించాడని, ప్రాథమిక విచారణ ప్రారంభం కాకముందే సుప్రీం కోర్టు ద్వారా స్టే తెచ్చుకోవడానికే ఢిల్లీ పర్యటన చేస్తున్నాడని అంటున్నారు.
అయితే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మాత్రం జాతీయ నేతల దగ్గర తన గోడును వెల్లబోసుకున్నాడు. ‘’32 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. ఇప్పటి వరకు కాపాడుకున్నది నిజాయితీ, విశ్వసనీయతే. ఇప్పుడు వీళ్ళంతా నాపై బురద జల్లారు. వాళ్ళు చల్లిన బురదను నేను కడుక్కోవాలి. అది మంచిది కాదు అని చంద్రబాబు తన గోడును వెల్లబోసుకున్నాడు.
ఒకవేళ చంద్రబాబు అవినీతికి పాల్పడకపోతే ఢిల్లీ స్థాయిలో పావులు కదపాల్సిన పనేముందని, తన పై వచ్చిన ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకోవాలని అంటున్నారు. అసలే అభధ్రతా భావంతో ఉండే చంద్రబాబు కాంగ్రెస్ తనను ఇరుకున పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీ స్థాయిలో పావులు కదువుతున్నారని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more